బహుజనుల బాటలో జ్యోతి-ఫూలే

Bahujanula Batalo Jyothi - Phule - Telugu Social Article | Thokala Rajesham
బహుజనుల బాటలో జ్యోతి-ఫూలే - తెలుగు సామాజిక వ్యాసం | తోకల రాజేశం
Published in manatelugukathalu.com on 28/11/2026
మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాలు బహుజనుల ఐక్యతకు, సామాజిక సమానత్వానికి మార్గదర్శకాలు. ఫూలే, అంబేద్కర్ తాత్వికతను విశ్లేషిస్తూ కుల నిర్మూలన, సామాజిక పరివర్తన ప్రాధాన్యాన్ని వివరించే వ్యాసం ఇది.
బహుజనులు అంటే మెజారిటీ ప్రజలు అని అర్థం. ఇప్పుడు బహుజనులు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అనే విశాలార్ధంలో వ్యవహరిస్తున్నాం. బహుజనులు అనే పదాన్ని జ్యోతిరావు ఫూలే వాడలేదు. దానికాయన శూద్రులు, అతిశూద్రులు అన్న పదాలను వాడాడు. కానీ వారంతా నేడు బహుజనులు అనే గుర్తింపు కింద ఒక్కటవుతున్నారు.
కులాల వారీగా విడిపోవటంలో ఉన్న నష్టాన్ని అధిగమించడానికి బహుజనులు అన్న గుర్తింపు సమర్థవంతంగా పనిచేస్తుంది. అందుకే అంబేద్కర్ ను అధ్యయనం చేసిన వాళ్ళైనా, ఫూలేను అర్థం చేసుకున్న వాళ్ళైనా బహుజనులు అన్న పదాన్ని తమ గుర్తింపు కేంద్రంగా చేసుకుంటున్నారు. నిజానికి ఫూలే భావజాలం, అంబేద్కర్ భావజాలం వేరు వేరు కాదు. రూపంలో కొద్దిపాటి తేడాలను ప్రదర్శించినప్పటికీ సారంలో అవి రెండూ ఒక్కటే.
ఫూలే చూపిన బాటలోనే అంబేద్కర్ ప్రయాణం చేశాడు. ఫూలే ఎక్కడైతే ఆగాడో అక్కడినుంచి తనపనిని మొదలు పెట్టాడు అంబేద్కర్. అందుకే అంబేద్కర్ ఫూలేను తన గురువుగా ప్రకటించాడు. అంబేద్కర్ ఎస్సీలకు మాత్రమే నాయకుడని నమ్మడం ఎంత అమాయకత్వమో,ఫూలే బీసీలకు మాత్రమే నాయకుడని నమ్మడం కూడా అంతే అమాయకత్వం. మహాత్మా ఫూలే ముమ్మాటికీ బహుజనులందరి నాయకుడు.
బహుజనులు ఏకం కావాలంటే వారిని విడదీసిన కులవ్యవస్థ నాశనం కావాలి. కులనిర్మూలన కోసం ఫూలే 1850,60 లలోనే ఎంతో శాస్ట్రీయంగా ఆలోచించాడు. కులం, వర్ణం ఎలా వచ్చాయో ఆయన ఉదాహరణలతో సహా వివరించాడు. అనంతర కాలంలో కులం మీద అంబేద్కర్ విస్తృతంగా అధ్యయనం చేసి రూపొందించిన "కుల నిర్మూలన" సిద్ధాంత పత్రంలో ఫూలే వేసిన బీజాలున్నాయి.
ఇప్పటికీ కులతత్వ వాదులు చేసే కులాన్ని బట్టి ప్రతిభ అనే దుర్మార్గపు సిద్ధాంతాన్ని ఆయన ఆనాడే తీవ్రంగా విమర్శించాడు. పశు పక్ష్యాదులకు లేని కులం మనుషులకు ఎలా తగులుకుంది? అంటూ సహజసిద్ధమైన ప్రశ్నలు లేవదీశాడు.
ఆనాటి చాలామంది సంస్కర్తలకంటే భిన్నంగా ఆలోచించినవాడు ఫూలే. అప్పటి సామాజిక వ్యవస్థ మీద ఆనాటి సంఘ సంస్కర్తలకు లేని స్పష్టత ఫూలేకు ఉంది. అందుకే స్పష్టమైన ఉద్యమాన్ని ప్రకటించి ముందుకు వెళ్ళాడు. ముందు తరాలకు ఆదర్శంగా నిలిచాడు.
ఈ నేపథ్యంలో బహుజనులను ఏకం చేయటానికి ఫూలే అందించిన తాత్వికత బాగా పని చేస్తుంది. ఏమిటా తాత్వికత? అగ్రవర్ణ, ఆధిపత్య,బ్రాహ్మణీయ సంస్కృతికి భిన్నంగా బహుజనుల కోసం పరిచయం చేసిన ప్రత్యామ్నాయ సంస్కృతిలో అది కనిపిస్తుంది. కొన్ని శాస్త్రాలు నిజానికి బహుజనుల పాలిట ఎలా అధర్మంగా వ్యవహరించాయో చెప్తూ ఆయన చేసిన పరిశీలనలో దొరుకుతుంది.
"ఇతర మతస్థులు ఒక్క చోట చేరి వారి మత గ్రంథాన్ని అందరూ కలిసి చదువుకున్న విధంగా కులాలకతీతంగా హిందువులందరూ ఒక్కచోట చేరి తమ మత గ్రంథాలను ఎందుకు చదువుకోవడం లేదు"అన్న కీలకమైన ప్రశ్న వేశాడు ఫూలే.
ఒకరకంగా ఇప్పుడు కంచె ఐలయ్య లాంటి మేధావులు వాదిస్తున్నట్టుగా ఆధాత్మిక ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నాడు ఫూలే. ఆధాత్మిక రంగంలో ప్రజాస్వామ్యం లేకపోవటం మూలంగా అంటే ఒకే వర్గం ఆధిపత్యం వహించడం కారణంగా మిగిలిన అన్ని రకాల ఆధిపత్యాలకు అది మార్గం సుగమం చేసిన వైనం ఆయన పరిశీలనలో ఉంది.
ఫూలే అందించిన ఈ తాత్వికతను ఇప్పుడు బహుజనులు తమ జీవితాలలో భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా సాంస్కృతిక పరివర్తన జరగకుండా ఎంత పెద్ద రాజకీయ ఉద్యమం వచ్చినా అది నిలబడలేదు. అందుకే ఫూలే ఏం చెప్పాడో తెలుసుకొని దానిని ఆచరణలో పెట్టటం బహుజనుల తక్షణం కర్తవ్యం.
-తోకల రాజేశం
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
తోకల రాజేశం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: నా పేరు తోకల రాజేశం.
తోకల రాజేశం మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన వారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.9 వ తరగతి చదువుతున్నపటి నుంచే పద్యాలు రాస్తున్నారు.వీరి ఊరు ఆవడంలో చదివే పిల్లలు 20 మందితో శతకాలు రాయించారు.ఇప్పటివరకు వీరు తెలుగు బాల శతకం(2006),చెమట చుక్కలు(నానీలు-2010),పాతాళ గరిగె(సాహిత్య వ్యాసాలు-2013),అడవి దీపాలు(వచన కవిత్వం-2017),మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర(తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురణ-2020),కొబ్బరి నీరా! శతకం(పదిమందితో కలిసి-2023),మట్టి విజయం(పద్యకవిత్వం-2024),ఆట సాగుతూనే ఉంటది(వచన కవిత్వం-2026)అనే పుస్తకాలు ముద్రించారు.తెలుగులో వెలువడుతున్న ప్రసిద్ధ దిన, వార, మాస పత్రికలన్నింటిలోనూ రాజేశం రాసిన కవితలు, వ్యాసాలూ వచ్చాయి. తెలుగునాట ప్రతిష్టాత్మక ఎక్స్ రే ప్రధాన పురస్కారం(2012),సహస్ర వసంతాల పద్య పురస్కారం(2012),సాహితీ శిరోమణి పురస్కారం(2015),సినారె పురస్కారం(2023),తో పాటు రాష్ట్రస్థాయిలో పలు పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రచయితల వేదికకు మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు.










Comments