రాజ్యాంగ సందేశం

Raajyanga Sandesam - Telugu Social Article | Thokala Rajesham
రాజ్యాంగ సందేశం - తెలుగు సామాజిక వ్యాసం | తోకల రాజేశం
Published in manatelugukathalu.com on 27/11/2026
భారత రాజ్యాంగం దేశ ప్రజల హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయానికి పునాది. డా. బి.ఆర్. అంబేద్కర్ దార్శనికతతో రూపుదిద్దుకున్న రాజ్యాంగం అందించిన సందేశం, దాని స్ఫూర్తి, ప్రాథమిక హక్కుల ప్రాముఖ్యతను ఈ వ్యాసం వివరిస్తుంది.
ఏ దేశం ముందుకు వెళ్లాలన్నా దానిని నడిపించే విధివిధానాలు అవసరం. ఆ విధివిధానాలను ఆ దేశపు రాజ్యాంగం నిర్దేశిస్తుంది.
రాజ్యాంగం దానికదే దేశంలో అత్యున్నత వ్యవస్థ. దానిని మించి వ్యవహరించే పరిస్థితి ప్రభుత్వాలకు ఉండదు. న్యాయస్థానాలకు కూడా ఉండదు.
అన్ని వ్యవస్థలూ రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి. మనదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం.
అంత పెద్ద రాజ్యాంగాన్ని మనకు అందించిన దార్శనికుడు అంబేద్కర్. 1950, జనవరి 26 నుంచి ఈ రాజ్యాంగం అమలులోకి వచ్చింది. మనదేశం మిగిలిన దేశాల్లాంటిది కాదు.
ఇక్కడ అనేక తరాలనుంచి కులాలు కొనసాగుతున్నాయి. ఆ కులాల మధ్య ఎక్కువ తక్కువలున్నాయి.
పేదలు, ధనికుల మధ్య అంతరాలున్నాయి. ఆహార విహారాలలో తేడాలున్నాయి. సంస్కృతిలో వైవిధ్యముంది.
మనది ఉపఖండ లక్షణాలుగల దేశం. ఇన్నిరకాల భేదాలను అర్థం చేసుకుంటూ అందరికీ ప్రాతినిధ్యం కల్పిస్తూ రాయటం వల్ల మన రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగంగా అవతరించింది. అందరి గురించి చర్చించిన అతిగొప్ప రాజ్యాంగం భారత రాజ్యాంగం.
ఇలా అందరి గురించి ఆలోచించిన మహోన్నతుడు అంబేద్కర్.
భారత రాజ్యాంగం ఆత్మ పౌరుల ప్రాథమిక హక్కుల్లో ఉంది. 12 నుంచి 35 వరకు గల ఆర్టికల్స్ ద్వారా రాజ్యాంగం ప్రస్తుతం ఉన్న ఆరు ప్రాథమిక హక్కులకు హామీ పడింది.
భారత పౌరులందరికీ ఈ హక్కులు సమానంగా సంక్రమిస్తాయి. కులం వల్లనో, మతం వల్లనో ఏ విధమైన తేడాలు ప్రాథమిక హక్కుల విషయంలో తలెత్తకూడదు.
వీటిని కాపాడటం ప్రభుత్వాల బాధ్యత. పౌరుల హక్కులకు భంగం కలిగితే న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి. ఏ మనిషి కూడా ఎటువంటి వివక్షకు గురికాకుండా స్వేచ్ఛగా జీవించటమే రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ఇచ్చిన సందేశం.
మనదేశంలో పరాయి పాలన వల్ల చాలాకాలం పాటు మన హక్కులను కోల్పోయాం.
కులాధిక్యత లాంటి అంతర్గత సమస్యల వల్ల కింది వర్గాల ప్రజలు కూడా చాలారకాల ఇబ్బందులను ఎదుర్కొనవలసి వచ్చింది. గతచరిత్ర నేర్పిన గుణపాఠాలను సవిమర్శకంగా పరిశీలించింది రాజ్యాంగం.
అందుకే రిజర్వేషన్లను సామాజికంగా అణిచివేతకు గురైన వాళ్లకు ఉపశమనంగా అందించింది. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతీ విషయానికి అడుగున దేశీయమైన పునాది బలం ఉంది.
అనేక తాత్విక, చారిత్రక చర్చల సారంగా తయారయింది భారత రాజ్యాంగం. అందుకే ప్రపంచంలో సగర్వంగా చెప్పుకునే స్థాయిలో నిర్మాణమైన రాజ్యాంగం మనది. అంతగొప్ప రాజ్యాంగాన్ని దేశానికి అందించిన దార్శనికుడు అంబేద్కర్.
నిజానికి భారత దేశానికి ఆత్మ లాంటిది మన రాజ్యాంగం. ఈ దేశ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ అంబేద్కర్ తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా తదేక దీక్షతో పూర్తి చేసిన మహోన్నత మానవతా పత్రం.
రాజ్యాంగం వల్ల అందరికీ న్యాయం జరగకపోతే అది రాజ్యాంగం తప్పు కాదు. దాన్ని సరిగా అమలుచేయని పాలకులది.
ఈ విషయం గురించి స్వయంగా అంబేద్కర్ ఒక సందర్భంలో వివరించాడు కూడా. అట్లాంటి ప్రపంచదేశాలతో కొనియాడబడిన అద్భుతమైన భారత రాజ్యాంగాన్ని, దాని స్ఫూర్తిని వ్యతిరేకిస్తూ కొందరు రాజకీయ నాయకులు వ్యాఖ్యలు చేస్తుండటం సిగ్గుచేటు.
ఇది వారి తిరోగమన దృక్పథాన్ని సూచిస్తుంది. దేశం ముందుకు వెళ్లాలని భావించే వాళ్ళెవరూ రాజ్యాంగ స్ఫూర్తిని కించపరుస్తూ మాట్లాడరు.
రాజ్యాంగం మనుషులందరిని సమానం చేసిందనే అక్కసుతో వీళ్ళు మాట్లాడుతారు. వీళ్ళు సమానత్వం అనే భావనకు వ్యతిరేకులు.
అంటే కులం ఉండాలని, కులం వల్ల కొనసాగే దోపిడి ఉండాలనేది వీళ్ళ సిద్ధాంతం. ఇటువంటి వాళ్ళు ఎందరు, ఎన్నిరకాలుగా కుట్రలు పన్నినా రాజ్యాంగ మౌళిక స్వరూపాన్ని మార్చలేరు. రాజ్యాంగం తాలూకు శక్తి అది.
-తోకల రాజేశం
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
తోకల రాజేశం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: నా పేరు తోకల రాజేశం.
తోకల రాజేశం మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన వారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.9 వ తరగతి చదువుతున్నపటి నుంచే పద్యాలు రాస్తున్నారు.వీరి ఊరు ఆవడంలో చదివే పిల్లలు 20 మందితో శతకాలు రాయించారు.ఇప్పటివరకు వీరు తెలుగు బాల శతకం(2006),చెమట చుక్కలు(నానీలు-2010),పాతాళ గరిగె(సాహిత్య వ్యాసాలు-2013),అడవి దీపాలు(వచన కవిత్వం-2017),మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర(తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురణ-2020),కొబ్బరి నీరా! శతకం(పదిమందితో కలిసి-2023),మట్టి విజయం(పద్యకవిత్వం-2024),ఆట సాగుతూనే ఉంటది(వచన కవిత్వం-2026)అనే పుస్తకాలు ముద్రించారు.తెలుగులో వెలువడుతున్న ప్రసిద్ధ దిన, వార, మాస పత్రికలన్నింటిలోనూ రాజేశం రాసిన కవితలు, వ్యాసాలూ వచ్చాయి. తెలుగునాట ప్రతిష్టాత్మక ఎక్స్ రే ప్రధాన పురస్కారం(2012),సహస్ర వసంతాల పద్య పురస్కారం(2012),సాహితీ శిరోమణి పురస్కారం(2015),సినారె పురస్కారం(2023),తో పాటు రాష్ట్రస్థాయిలో పలు పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రచయితల వేదికకు మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు.










Comments