మనందరి మహేంద్రుడు

Manandari Mahendrudu - Telugu Inspirational Articles | Surya Manda(MS)
మనందరి మహేంద్రుడు - తెలుగు ప్రేరణాత్మక వ్యాసాలు| సూర్య.మండా(MS)
Published in manatelugukathalu.com on 27/11/2026
మహేంద్ర సింగ్ ధోని భారత క్రికెట్‌కు అందించిన విజయాలు, నాయకత్వం, ఆటతీరు, ప్రశాంతమైన వ్యక్తిత్వం గురించి ఈ వ్యాసం గుర్తుచేస్తుంది. అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే ‘మహి’ క్రికెట్ వారసత్వానికి ఇది ఒక ప్రేమపూర్వక నివాళి.
మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ అభిమానులకి పరిచయం అవసరం లేని పేరు. క్రికెట్ తెలియని వారికి సైతం ఈ పేరు సుపరిచితమే.
ఎక్కడో రాంచీలో పుట్టిన ఈ తుఫాన్ ప్రపంచ క్రికెట్‌ని శాసిస్తుందని ఎవరు మాత్రం ఊహించి ఉంటారు? రాంచీ వీధుల నుండి వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ వరకు తనకంటూ ఒక పేజీని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.
సాధారణ ప్రజలు మాత్రమే కాదు, సహచర ఆటగాళ్లు సైతం అతనికి అభిమానులే. అతను క్రీజ్‌లో ఉంటే తప్పకుండా గెలుస్తామని భరోసా ఇచ్చేవాడు.
క్రికెట్ అంటే కేవలం శరీరంతో ఆడే ఆట మాత్రమే కాదు, మైండ్ గేమ్ కూడా అని తన పదునైన ఆలోచనలతో ఎన్నోసార్లు నిరూపించాడు.
బౌలర్ ఎవరైనా, వేసింది ఎలాంటి బంతి అయినా సిక్స్ కొట్టగల సామర్థ్యం ఉన్నా జట్టు అవసరానికి తగినట్లుగా ఆటను మార్చుకుంటాడు.
యువ ఆటగాళ్ల కోసం కింది స్థానంలో బ్యాటింగ్‌కి వస్తాడు. జట్టు గెలిచినప్పుడు అందరికంటే వెనుక నుండి సెలబ్రేట్ చేసుకుంటాడు.
జట్టు ఓడిపోతే అందరికంటే ముందు వరుసలో బాధ్యత వహిస్తాడు. ఎంతోమంది గొప్ప ఆటగాళ్లు రావొచ్చు, గొప్ప కెప్టెన్లు రావొచ్చు.
కానీ మహేంద్రుడు లాంటి ఆటగాళ్లు మాత్రం మరొకరు పుట్టరు. ఆటగాడిగా మాత్రమే కాదు మంచి వ్యక్తిగా కూడా ధోని ఎంతోమందికి ఆదర్శం.
పదుల సంఖ్యల్లో సెంచరీలు లేకపోవచ్చు కానీ పదునైన ఆలోచనలతో మ్యాచ్‌ని మార్చగల సత్తా ఉంది.
ధోని ఒక నిర్ణయం తీసుకున్నాడంటే అది కచ్చితంగా గొప్ప మార్పును తెస్తుంది. తన నిర్ణయం, తన అంచనా ఎప్పుడూ తప్పు కాలేదు.
మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే రోహిత్ శర్మని ఓపెనర్‌గా మార్చి ధోని తీసుకున్న నిర్ణయం భారత బ్యాటింగ్ లైనప్‌నే మార్చేసింది. రోహిత్ శర్మని ప్రపంచ మేటి ఆటగాళ్లలో ఒకరిగా మార్చింది. ఆటగాళ్ల మీద భరోసా ఉంచుతూ వారికి అండగా ఉంటాడు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడు, కూసింత అయినా గర్వం ఎరుగడు ఈ కారణజన్ముడు.
538 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 17,266 అంతర్జాతీయ పరుగులు, 16 అంతర్జాతీయ సెంచరీలు, 108 హాఫ్ సెంచరీలు, 195 స్టంపింగ్‌లు, 634 క్యాచ్‌లు, 359 సిక్స్‌లతో పాటు బౌలింగ్ చేస్తూ కూడా ఒక వికెట్‌ని తీసుకున్నాడు.
దీనితో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 278 మ్యాచ్‌లు ఆడి 5,439 పరుగులు, 24 హాఫ్ సెంచరీలతో పాటు 5 సార్లు జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు.
వన్డేలలో పదివేల పరుగుల మైలురాయి దాటిన అతి కొద్దిమంది ఆటగాళ్లలో ధోని ఒకరు. అది కూడా 50.58 అత్యున్నత యావరేజ్‌తో సాధించాడు.
ఆటగాడిగానే కాదు పౌరుడిగా కూడా తనకి ఉన్న దేశభక్తిని, ప్రేమను సైన్యంలో చేరి చాటుకున్నాడు.
మహేంద్ర సింగ్ ధోని భారత సైన్యం (Indian Army) లో పనిచేశారు. క్రికెట్‌కు ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా, 2011 నవంబర్ 1న భారత సైన్యంలోని టెరిటోరియల్ ఆర్మీ (Territorial Army) లో ఆయనకు గౌరవ లెఫ్టినెంట్ కర్నల్ (Honorary Lieutenant Colonel) హోదా లభించింది.
ధోని భారత సైన్యంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన 106 పారాచూట్ రెజిమెంట్ (పారా కమాండో విభాగం) లో భాగమయ్యారు.
2015లో ఆయన ఆగ్రాలోని ఆర్మీ ట్రైనింగ్ స్కూల్లో కఠినమైన శిక్షణ పూర్తి చేసుకుని, విమానం నుండి 5 సార్లు పారాచూట్ జంప్స్ విజయవంతంగా చేశారు.
దీనితో ఆయన అర్హత కలిగిన పారాట్రూపర్ (Qualified Paratrooper) గా నిలిచారు.
2019 ప్రపంచకప్ తర్వాత క్రికెట్ నుండి కొంత విరామం తీసుకున్న ధోని, జమ్మూ కశ్మీర్‌లోని దక్షిణ కశ్మీర్ ప్రాంతంలో విక్టర్ ఫోర్స్ (Victor Force) తో కలిసి దాదాపు రెండు వారాల పాటు (జూలై 31 నుండి ఆగస్టు 15 వరకు) క్రియాశీల విధులు నిర్వర్తించారు. అక్కడ సాధారణ సైనికుడిలాగే పెట్రోలింగ్, గార్డ్ డ్యూటీలు చేశారు.
కేవలం గౌరవ హోదా తీసుకోవడమే కాకుండా, సమయం దొరికినప్పుడల్లా సైనికులతో కలిసి ఉండటం, శిక్షణ తీసుకోవడం ద్వారా దేశభక్తిని చాటుకున్నారు.
భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మభూషణ్, పద్మశ్రీ, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నతో పాటు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నుండి ఎన్నో ప్రతిష్టాత్మక గౌరవాలను అందుకున్నారు.
ఇంతటి మహోన్నతమైన ఆటగాడు మన దేశంలో పుట్టడం మన అందరికీ గర్వకారణం. తన ఆటతోనే కాదు వ్యక్తిత్వంతో సైతం అభిమానులను సంపాదించుకున్నాడు. మహేంద్రుడి శకం ఆటగాడిగా ముగిసింది, కానీ అతని ప్రస్థానం క్రికెట్ ఉన్నంత కాలం ఉంటుంది.
ప్రపంచానికి ఒకడే ధోని. అభిమానుల గుండెల్లో అతని ధనాధన్ సిక్సర్లు ఎప్పటికీ నిలిచిపోతాయి. మిస్ యు మహి...
--------------- THE END ---------------
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
సూర్య.మండా(MS) గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: సూర్య.మండా(MS)

పూర్తి పేరు: సూర్య.మండా(MS)
జన్మస్థలం: శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్
స్వస్థలం: అరసవిల్లి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్
తల్లి పేరు: శారద
తండ్రి పేరు: భీష్మ
అన్నయ్య పేరు: రామ్ కుమార్
📚 విద్యాభ్యాసం:
ప్రాథమిక విద్య (Elementary): M.P.P. స్కూల్, ఆదిత్య నగర్ కాలనీ, అరసవిల్లి
ఉన్నత విద్య: మున్సిపల్ హైస్కూల్, అరసవిల్లి.
ఇంటర్మీడియట్: కాకతీయ జూనియర్ కాలేజీ, శ్రీకాకుళం.
డిగ్రీ (B.A.): S.V.S. డిగ్రీ కాలేజీ, శ్రీకాకుళం.
ఉపాధ్యాయ విద్య (B.Ed.): శ్రీ వేంకటేశ్వర కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్.
✍️ సాహిత్య ప్రస్థానం & అభిరుచులు:
తెలుగు సాహిత్యంపై మక్కువతో గత కొంతకాలంగా కవితలు, కథలు రచిస్తున్నాను. సమాజ స్పృహ, మానవీయ కోణాలను స్పృశిస్తూ రచనలు చేయడం నా ప్రత్యేకత. నా రచనలు డిజిటల్ సాహిత్య పత్రికలలో, వార్త పత్రికల్లో మరియు పలు సామాజిక మాధ్యమ సాహిత్య వేదికలలో ప్రచురితమయ్యాయి. సాహిత్యాన్ని పాఠకులకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా నా ఈ రచనా ప్రయాణం సాగుతోంది.










Comments