కథలు అల్లటం - పుకార్లు చల్లటం

Kathalu Allatam - Pukarlu Challatam - Telugu Inspirational Article | Kotha Viritha
కథలు అల్లటం - పుకార్లు చల్లటం - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Published in manatelugukathalu.com on 24/11/2026
నిజానిజాలు తెలుసుకోకుండా మనం అల్లే కథలు ఎదుటివారి జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తాయో ఎప్పుడైనా ఆలోచించామా?
నవ్విస్తూనే మన ప్రవర్తనను ప్రశ్నించే కొత్త విరిత గారి వ్యంగ్య రచన “కథలు అల్లటం - పుకార్లు చల్లటం”
ఆడ మగ, చిన్న పెద్ద, ముసలి ముతక, పాప బాబు…బేధం లేకుండా అల్లేస్తారు. అల్లటం అంటే ఏదో పూలమాల అనుకునేరు, కథలండి బాబూ కథలు… లేనిదాన్ని ఉన్నట్టు చూపించే అసలైన కళలు!
ఇంట్లో, బయట, ఆఫీసులో, మార్కెట్లో,మీటింగ్‌లో, డేటింగ్లో, చాటింగ్‌లో, చీటింగ్‌లో!
హోంవర్క్‌లో, నోట్‌బుక్‌లో, కోడలి గుణంలో, కొడుకు జీతంలో, వచ్చే ఖర్చులో, పోయే ఖర్చులో, ఉన్న కుప్పల్లో, లేని అప్పుల్లో!
ఎక్కడ చూసినా కథల అల్లిక… ఎదుటివాళ్ల మీద పుకార్ల చల్లిక!
నిజానికి కొంచెం మసాలా దట్టించి, ఊహలకి రెక్కలు కట్టి,మనకు నచ్చినట్టు కథను మార్చి, పక్కోడి పరువును గాలికి వదిలేస్తాం!
నాలుగు మాటలు వింటే చాలు… నలభై కథలు సిద్ధం చేస్తాం.
చూడకపోయినా చూసినట్టు,
వినకపోయినా విన్నట్టు,
తెలియకపోయినా తెలిసినట్టు తీర్పులిచేయగలం.
ఒకరి మాటకు పది అర్థాలు, ఒకరి మౌనానికి వంద అపార్థాలు!
కథలు అల్లటంలో మనకు పోటీ లేదు, కానీ ఆ కథల వల్ల విరిగిన మనసుల్ని అతికించే ఓపిక, తీరిక అసలే లేదు!
కథలు అల్లటం కళ కావచ్చు, కానీ పుకార్లు చల్లటం ఎదుటివారి జీవితాలతో ఆడుకోవటమే!
నోటితో అల్లిన కథకు కాసేపు చప్పట్లు పడొచ్చు,
కానీ నిజం బయటపడితే, మన పరువే బజారున పడొచ్చు!
***
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
మనతెలుగుకథలు.కామ్ — తెలుగు కథలకు మీ సొంత వేదిక
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.










Comments