తరం మారుతున్న వేళ - పార్ట్ 3

Taram Maruthuna Vela - Part 3 - Telugu Family Story | Vasundhara Rani Munipalle
తరం మారుతున్న వేళ - పార్ట్ 3 - తెలుగు కుటుంబ కథ | వసుంధర రాణి మునిపల్లె
Published in manatelugukathalu.com on 24/11/2026
ఖాళీగా ఉన్న ఓ ఫ్లాట్ నుంచి ప్రతి రాత్రి వినిపించే చిన్నపిల్ల ఏడుపు వెనుక అసలు రహస్యం ఏమిటి? కార్తీక్ చేసిన అన్వేషణ ఐదేళ్లుగా దాగి ఉన్న ఒక నేరాన్ని వెలుగులోకి తీసుకువస్తుంది.
ఇక తరం మారుతున్న వేళ - పార్ట్ 3 చదవండి.
పద్మావతి ఆశించినట్లుగానే మూడవ అడుగు అయిన నిశ్చితార్థం వేడుక ఎంతో హుందాగా, ఆత్మీయంగా జరిగిపోయింది.
అటు అబ్బాయి తరఫు బంధువులు, ఇటు పద్మావతి వాళ్లు... అందరూ ఒకే వేదికపై చేరి కొత్త జంటను ఆశీర్వదించడంతో పద్మావతి గుండెపై ఉన్న సగం బరువు దిగిపోయినట్లయింది.
ఇక అసలైన ఘట్టం... పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లికి ముందు రోజు నుంచే మెహందీ, హల్దీ, సన్నాయి మేళాలతో పెళ్లి మండపం అంతా పండుగ వాతావరణంతో కళకళలాడింది.
ఇక రాత్రి జరిగిన సంగీత్ వేడుక అయితే ఒక రేంజ్‌లో సాగింది. బ్రహ్మాండమైన డెకరేషన్లు, వెలుగుల మధ్య పిల్లలు, పెద్దలు వాళ్లకి తోచినట్లుగా ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు.
ఎన్నో నెలల పాటు పద్మావతి పడ్డ ఆందోళనలు, భయాలన్నీ ఆ సంతోషంలో కొట్టుకుపోయాయి.
తెల్లవారితే పెళ్లి. హోస్ట్‌గా పద్మావతి బాధ్యత పద్మావతికి ఉంది కదా! వచ్చిన అతిథులందరినీ పేరుపేరునా పలకరించడం, వాళ్లకు మర్యాదలు చేయడం, బంధువులకు కొత్త బట్టలు పెట్టడం, అందరూ భోజనాలు చేశారో లేదో కనుక్కోవడం... ఇలా క్షణం తీరిక లేకుండా అటు ఇటు తిరుగుతోంది.
అది చూసిన అఖిల, "అమ్మా, నువ్వు పెళ్లికూతురి తల్లివి. ఏదో వేరే వాళ్ల పెళ్లికి వచ్చినట్లు అంతలా తిరుగుతున్నావేంటి? మిగతా పనులు వేరే వాళ్లు చూసుకుంటారు, నువ్వు అస్సలు స్టేజ్ దిగడానికి వీల్లేదు, నా పక్కనే ఉండు" అంటూ గట్టిగా చెప్పింది.
కూతురి మాట కోసం కాసేపు స్టేజ్ మీద ఉన్నా, పెళ్లి సందడిలో హోస్ట్‌గా తన బాధ్యత పద్మావతిని ఊరుకోనివ్వలేదు.
మధ్యమధ్యలో స్టేజీ దిగిపోతూనే ఉంది. అతిథులకు బట్టలు పెట్టే టైంలో, పెళ్లికి వచ్చిన నగలు, క్యాష్, గిఫ్ట్ కవర్లు ఉన్న బ్యాగ్‌ను ఒక చోట పక్కన పెట్టి, బట్టలు తీసి ఇవ్వడం, పెట్టించడం చూసేటప్పటికి... ఆ బ్యాగ్ ఎక్కడ పెట్టానో మర్చిపోవడం! పైగా స్టేజ్ మీద ఉన్నప్పుడు ఫొటోగ్రాఫర్ కూడా ఫొటో ఫ్రేమ్‌లో అడ్డంగా పడుతోందని ఆ బ్యాగ్ తీసి పక్కన పెట్టమన్నాడు.
అలా పెట్టిన విషయం మర్చిపోయి మండపమంతా తిరగడం... నిజం చెప్పాలంటే ఇందులో పద్మావతి తప్పు కూడా చాలా ఉంది. ఆ బ్యాగ్‌ని అంత జాగ్రత్తగా చూసుకోలేకపోయింది. దానికి తోడు ఆ హడావిడిలో కలిగిన మతిమరుపు!
నిజానికి ముందే తన స్నేహితులకు చెప్పి ఉంచింది. వాళ్లు సమయానికి వచ్చి ఉంటే, ఆ బ్యాగ్ వాళ్ల చేతిలో పెట్టేసి పద్మావతి కాస్త నిశ్చింతగా ఉండేది.
తన వెనక ఇంత బాధ్యత ఉండేది కాదు. కానీ వాళ్లకి కొంచెం దూరంలో హోటల్‌లో గది బుక్ చేసి ఉండటంతో వాళ్లు రావడానికి ఆలస్యం అయింది. వాళ్లు వచ్చేసరికి స్టేజ్ మీద ఇప్పటికే వేరే వాళ్లు కూర్చుని గిఫ్ట్‌లు తీసుకుంటున్నారు.
అందువల్ల వాళ్లు కూడా మళ్లీ మధ్యలో కల్పించుకుని కూర్చోలేకపోయారు. నిజానికి అందులో వాళ్ల తప్పు కూడా ఏమీ లేదు. ఇంతలో స్టేజీ మీద దృశ్యం మారింది.
గిఫ్ట్‌లు తీసుకోవడానికి ఎవరెవరో కూర్చున్నారు, మారుతూ వచ్చారు. చివరికి ఆ గిఫ్ట్ కవర్ల కట్ట పద్మావతి చేతికి ఇచ్చారు. కానీ ఆలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఆ తర్వాత కూడా పద్మావతి బ్యాగ్‌ని అక్కడక్కడా పెట్టడంతో, అందులోని కవర్లు, డబ్బులో సగం ఎవరు తీశారో, ఎవరు కొట్టేశారో అస్సలు తెలియదు.
మొత్తంగా చూస్తే చాలా పెద్ద మొత్తంలోనే పోయాయి. ఎవరిని ఏమనగలదు?
కొంతమంది పెళ్లి చూడటానికి కాకుండా దొంగతనం చేయడానికే వస్తారేమో అనిపించింది.
చుట్టూ ఉన్నవాళ్లంతా తనే ఆత్మీయంగా పిలుచుకున్న చుట్టాలు. ఎవరినైనా ఏమన్నా అడిగితే, "పెళ్లికి పిలిచి మా మీద దొంగతనం అంటగట్టింది" అంటారు.
పరువు, మర్యాదల కోసం పద్మావతి నోరు మెదపలేదు. ఆ బాధతో రెండు రోజులు కంటి మీద కునుకు లేదు, మనసు చాలా బరువుగా అనిపించింది.
కానీ మూడో రోజు ఉదయం మాత్రం పద్మావతి మనసును తేలిక చేసుకుంది. "పోన్లే... ఇంత పెద్ద ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా బ్రహ్మాండంగా జరిగింది కదా! అంత మంది కళ్లు పడి ఉంటాయి.
నా బిడ్డ పెళ్లికి తగిలిన దిష్టి అంతా ఈ డబ్బు రూపంలో పోయింది. హిజ్రాలు వస్తే దిష్టి తీసి డబ్బులు తీసుకుంటారు కదా... అలాగే వాళ్లు కూడా అలాంటి వాళ్లే, మా పెళ్లికి దిష్టి తీసి తీసుకుని వెళ్లారులే" అని తన మనసుకు తనే సర్దిచెప్పుకుంది. నిజంగానే ఆ డబ్బుతో పాటు ఆ పెళ్లికి ఉన్న దిష్టి కూడా పోయింది.
పదేళ్ల ప్రేమను గెలిపించుకుని, అన్ని మెట్లూ దాటుకుని అఖిల కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. డబ్బు పోయిన బాధ కంటే, కూతురి పెళ్లి బ్రహ్మాండంగా జరిగిందన్న తృప్తితో పద్మావతి మనసు ప్రశాంతంగా మారింది.
**
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
వసుంధర రాణి మునిపల్లె గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె
నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.
నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.
ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.













Comments