top of page
Original.png

మాట సాయం

2 hours ago
3 min read

ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువకుడికి మాట సాయం ద్వారా మార్గదర్శకత్వం అందిస్తున్న వ్యక్తి – మానవత్వం, సామాజిక బాధ్యతను ప్రతిబింబించే దృశ్యం.
మన మాట... మరొకరి జీవితానికి బంగారు బాట.


Mata Sayam - Telugu Inspirational Article | Seeda Nagaraju

మాట సాయం - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | సీదా నాగరాజు

Published in manatelugukathalu.com on 24/11/2026


మాట ముత్యాల మూట, రత్నాల కోట, చూపిస్తుంది బంగారు బాట. మాట సాయం కొందరికి... కాదు కాదు... అందరికీ స్ఫూర్తినిస్తుంది, కీర్తినిస్తుంది. కొన్ని కొన్ని సందర్భాలలో ప్రాణం కూడా పోస్తుంది. అందుకేనేమో పాశ్చాత్యులు 'టీచింగ్ ఫిష్' అనే నానుడిని ప్రాచుర్యంలోకి తెచ్చారు. 


ఆకలితో ఉన్నవాడికి చేపలను ఇవ్వడం వలన ఆ నాటి ఆకలి మాత్రమే తీరుతుంది. అదే వ్యక్తికి చేపలు పట్టడం నేర్పించినట్లయితే జీవితాంతం అతనికి ఆకలి పోరాటం తప్పుతుంది. తను బ్రతకడమే కాకుండా తనను నమ్ముకున్న వారిని కూడా బ్రతికించగలుగుతాడు. 


అదే కోవలో... ఆర్థిక సాయం కొంతవరకే ఆదుకోగలుగుతుంది; మాట సాయం మాత్రం జీవితాంతం ఆదుకుంటుంది, ఆదరువునిస్తుంది. ఆర్థిక సాయం వలన నష్టం జరగవచ్చేమో గానీ, మాట సాయం వల్ల జరిగే నష్టం స్వల్పాతిస్వల్పం లేదా శూన్యం. 


కొందరు పలుకుబడి గల వ్యక్తులు తమ మాట ద్వారా ఉద్యోగాలు ఇప్పించగలుగుతారు. కొందరు అధికారులు తమ మాట ద్వారా కావలసిన పనులు సత్వరమే చేయించగలుగుతారు. కొందరు ఉన్నతాధికారులు తమ మాట ద్వారా చిన్న అధికారులను సైతం ప్రభావితం చేసి, కావలసిన పనులను తాత్సారం చేయకుండా త్వరగా చేయించగలుగుతారు. రాజకీయ నాయకులు తమ మాట ద్వారా అధికారుల చేత ప్రజలకు కావలసిన మౌలిక వసతులను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయగలరు. 


అంతెందుకు... ప్రస్తుతం అమెరికా దేశంలో డొనాల్డ్ ట్రంప్ గారి సంచలనాత్మక నిర్ణయాల వలన ఎందరో భారతీయులు ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలో ఉద్యోగం సంపాదించేందుకు లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి అమెరికాలోనే MS చేసినా ఉద్యోగాలు పొందలేక, ఇటు ఇండియాకి తిరిగి రాలేక త్రిశంకు స్వర్గంలో ఎందరో ఊగిసలాడుతున్నారు. 


అక్కడే సొంత కంపెనీలు స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తున్న ప్రవాస భారతీయులు గానీ, ఉద్యోగాలు ఇప్పించగలిగే భారతీయ మూలాలు ఉన్న ఉన్నత ఉద్యోగులు గానీ, పలుకుబడి ఉన్నవారు గానీ అక్కడ ఇబ్బంది పడుతున్న యువతకు మార్గదర్శకత్వం వహించి, వారి మాట సాయం ద్వారా తగిన ఉపాధి కల్పించగలిగితే అంతకన్నా సేవ, పుణ్యం మరొకటి ఉంటుందా! 


మన మాట పదిమందికి జీవనోపాధి కల్పించగలిగినందుకు సంతోషించాలి కానీ, 'నాకెందుకులే' అని మిన్నకుండడం సబబు కాదు. మాట సాయం చేస్తే పోయేదేముంది? మాట తప్ప. ఆర్థికంగానూ, సామాజికంగానూ మనకు ఏ మాత్రం నష్టం వాటిల్లదు. ఉద్యోగం ఇప్పించగలిగితే వెల్ అండ్ గుడ్... ఒక జీవితం బాగుపడుతుంది. లేదంటే మన మాట వృథా అయింది అనుకుందాం, అంతే! అంతకు మించి జరిగే నష్టం ఏముంటుంది? అయినా ప్రయత్నం చేస్తే తప్పేముంది? 


కొంత మంది ప్రభుత్వ కార్యాలయాలలో గానీ, ఇతరత్రా వ్యవహారాలలో గానీ తమ పనులు జరగక, చేయవలసిన వ్యక్తులు సరిగా సకాలంలో స్పందించక ఇబ్బందులు పడుతుంటారు. అట్లాంటి వారికి సంబంధిత ఉద్యోగులను గానీ, సంబంధిత వ్యక్తులను గానీ తమ అధికారం చేత గానీ, తమ పలుకుబడి చేత గానీ ప్రభావితం చేయగలిగిన స్థానంలో ఉన్న వ్యక్తులు / హితులు / సన్నిహితులు తమ మాట ద్వారా సాయం చేయగలిగితే అంతకు మించిన ఉపకారం ఇంకేముంటుంది? 


మన మాట... తెగిపోయే కొన్ని బంధాలను కలుపుతుంది. విడిపోయే కొన్ని కుటుంబాలను ఏకం చేస్తుంది. మనస్పర్థలతో విడిపోయే భార్యాభర్తలను కలుపుతుంది. విచ్ఛిన్నం కాబోతున్న కుటుంబ బంధాలను కాపాడుతుంది. ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్న వారికి జీవనోపాధి చూపించగలుగుతుంది. ఎంతో మంది చిన్నారులను తల్లి/తండ్రి ప్రేమకు దూరం కాకుండా కాపాడుతుంది. యువత బలవన్మరణాలకు, ఆత్మహత్యలకు పాల్పడకుండా అడ్డుకుంటుంది. 


ఇన్ఫ్లుయెన్సర్లు, మోటివేటర్లు, మెంటార్లు గెలవాలనే స్ఫూర్తిని మాత్రమే కలిగించగలరు. మాట సాయం చేసే వ్యక్తి మాత్రం ఒక వ్యక్తి కాదు... సామూహిక శక్తి. తన మాట ద్వారా ఎవరినైనా గెలిపించగలడు. దీనినే ఇంగ్లీషులో గౌరవంగా "put in a good word" అన్నారు. 


మద్దతు అనుకోండి, వత్తాసు అనుకోండి, రికమండేషన్ అనుకోండి, ప్రోద్బలం అనుకోండి, వకాల్తా అనుకోండి, బలపరచడం అనుకోండి, సమర్థించడం అనుకోండి, సిఫారసు అనుకోండి, సహకరించడం అనుకోండి, మాట సాయం అనుకోండి, మంచిగా మాట్లాడటం అనుకోండి, మంచి చేయడం అనుకోండి..... ఇంకా ఏ పేరైనా పెట్టండి, కానీ అవసరమైన వారికి మాత్రం మాట సాయం చేయండి. 


'నాకెందుకులే' అని మౌనంగా ఉండవద్దు. 'నాకేమి అవసరం' అని మిన్నకుండవద్దు. ఎవరి సమస్యను వారు పరిష్కరించుకుంటారులే అనే దాటవేత ధోరణి పనికి రాదు. చేతనైన సాయం, మాట సాయం చేయండి. కష్టాలలో ఉన్న వారికి మద్దతునివ్వండి. అన్యాయం జరుగుతున్నప్పుడు న్యాయాన్ని బలపరచండి. అధర్మం అనిపిస్తే బాధితునికి బాసటగా నిలవండి. 


మీ మాట సాయం ఒకరికి న్యాయం చేయగలిగిందంటే మీరే సర్వోన్నత న్యాయమూర్తి. 

మీ మాట సాయం ఒకరిని కష్టాల నుండి కాపాడగలిగిందంటే మీరే సర్వోన్నత రక్షణాధికారి. 

మీ మాట ఒకరికి జీవనోపాధి కల్పించగలిగిందంటే మీరే సర్వోన్నత అన్నదాత, భాగ్య ప్రదాత. 


మీ మాట ఒక కుటుంబాన్ని ఆదుకోగలిగిందంటే మీరే సర్వేశ్వరుడు. 


ధర్మో రక్షతి రక్షితః


*** 


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



సీదా నాగరాజు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 







మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


పరిచయం

సీదా నాగరాజు

: పేరు సీదా నాగరాజు.1965లో గుంటూరు పట్టణంలో జన్మించాను.స్థానిక జలగం రామారావు మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి (1980)వరకు, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల; నాగార్జున సాగర్ లో ఇంటర్మీడియట్( 1980-82), సిల్వర్ జూబ్లీ కళాశాల, కర్నూలు లో డిగ్రీ( 1982-85),ఆంధ్రా క్రిస్టియన్ కాలేజ్ అఫ్ లా లో లా డిగ్రీ(1985-88) చదువుకున్నాను.దక్షిణ మధ్య రైల్వే గుంతకల్ డివిజన్ లో ఉద్యోగం చేసి 2025 లో రిటైర్ అయ్యాను.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page