top of page
Original.png

రెండు వరాలు

38 minutes ago
4 min read

రెండు వరాలు – చక్కని సంసారం, చల్లని సంతానంతో ఆనందంగా గడుపుతున్న తెలుగు కుటుంబం | సీదా నాగరాజు కుటుంబ బంధాల వ్యాసం
రెండు వరాలు – చక్కని సంసారం, చల్లని సంతానంతో ఆనందంగా గడుపుతున్న తెలుగు కుటుంబం | సీదా నాగరాజు కుటుంబ బంధాల వ్యాసం

Rendu Varalu - Telugu Inspirational Article | Seeda Nagaraju

రెండు వరాలు - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | సీదా నాగరాజు

Published in manatelugukathalu.com on 23/11/2026


"ఆడది కోరుకొనే వరాలు రెండే రెండు: చక్కని సంసారం, చల్లని సంతానం" అని ఆనాడే ఒక సినీ కవి బల్లగుద్ది చెప్పాడు. ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా ఒక స్త్రీ కోరుకొనే వరాలు ఆ రెండే. చక్కని సంసారం అంటే అర్థం చేసుకొనే భర్త, అత్తగారి ఆరాళ్ళు, ఆడబిడ్డల పోరు లేని చక్కని కాపురం. చల్లని సంతానం అంటే చెప్పిన మాట వింటూ, మంచి నడవడికతో, మంచి మార్కులు కూడా తెచ్చుకుంటూ, మంచి పేరు తీసుకువచ్చే పిల్లలు అని అర్థం కాబోలు. నిజమే మరి! ఆడవారు, మగవారు అనే తేడా లేకుండా అందరూ కోరుకొనే కోరికలు అవే కదా! మగవారైతే అర్థం చేసుకొనే అందమైన భార్య, సమాజంలో తన గౌరవాన్ని పెంచే పిల్లలను కోరుకుంటారేమో!


మొదటి విషయానికి వద్దాం. ఈ ఆధునిక యుగంలో నూటికి దాదాపు తొంబై శాతం స్త్రీలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. స్త్రీలు కూడా మగవారికి సమానంగా, కొండొకచో మగవారి కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నారు. ఆర్థికంగా మగవారికి ధీటుగా నిలబడుతున్నారు. అయినా వారికి అత్తగారి ఆరాళ్ళు, ఆడబిడ్డల పోరు ఇప్పటికీ తప్పడం లేదు. భర్త గారి ఇగోలకి, అత్తింటి వారి బెదిరింపులకు భయపడి స్వేచ్ఛగా బ్రతకలేకపోతున్నారు. అందుకేనేమో అప్పుడు, ఇప్పుడు, బహుశా మరెప్పుడూ వారు చక్కని సంసారాన్నే మొదటి వరంగా కోరుకుంటున్నారు. అర్థం చేసుకొనే భర్తతో పాటు, ఇబ్బందులు పెట్టని అత్తను, ఆడబిడ్డలను ఆహ్వానిస్తున్నారు.


ప్రస్తుతం పిల్లల గురించి మాట్లాడుకుందామా! "అపుత్రస్య గతిర్నాస్తి" అన్నారు పెద్దలు. పుత్రుడు అంటేనే పున్నామ నరకం నుండి కాపాడేవాడు అన్నారు. ఇప్పుడు స్వర్గం, నరకం వగైరాలను నమ్మినా నమ్మకపోయినా సంతానం అంటే అందరికీ సంతోషమే, సంబరమే. ఆడపిల్ల అయితే లక్ష్మీదేవి అని ఆనందిస్తాం. ఎంతైనా మన రక్తం కదా!


పిల్లలను లాలించడంలోనూ, బుజ్జగించడంలోనూ, సముదాయించడంలోనూ, వారు అడిగే చిట్టి పొట్టి సందేహాలకు జవాబులు చెప్పడంలోనూ... అంతులేని ఆనందాన్ని అనుభవిస్తాం. వారు ఎంత అల్లరి చేసినా విసుగు రాదు. వారు ఒక్క నిమిషం కనపడకపోయినా అల్లాడిపోతాం. వారు ఎదిగే కొద్దీ వారితో బంధం బలపడిపోతుంది. వాళ్ళు కనపడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతాం.


నిజానికి తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం అంటే... మన తల్లిదండ్రులు మనల్ని ఎంత ముద్దుగా పెంచారో, అంతకంటే ముద్దుగా మనం కూడా మన పిల్లలని పెంచడం. అంతేగానీ, ముసలివాళ్ళైన అమ్మానాన్నలకు సేవ చేస్తూ పిల్లలను వదిలేయమని కాదు. పిల్లలను... అది ఒక్కరైనా, ఇద్దరైనా... ఈ రోజుల్లో ఒక్కరే ఉంటున్నారు కదా!


ఆడపిల్ల అంటేనే... ప్రేమ, అభిమానం, ఆత్మీయత, ఆప్యాయత, మమకారం, అనురాగం. తను కళ్ళముందుంటే చాలు! తన కోసం ఎంతకైనా తెగిస్తాం. తన ఆనందం కోసం ఎంత దూరమైనా వెళతాం. పంతాలు, పట్టింపులు, పగలు, ద్వేషాలు, అవమానాలు, అసూయలు... ఇవన్నీ మరచిపోతాం.


నాకు తెలిసిన ఒక తండ్రి, తనకు ఉద్యోగం పోయేంత చాలా పెద్ద కష్టం వచ్చినపుడు, ఆ కష్టాన్ని మరచిపోయేందుకు బ్రాందీలు, విస్కీలు తాగుతూ కూర్చోలేదు. చిన్న పిల్లవాడైన తన కొడుకుతో ఆడుతూ పాడుతూ ఆ బాధను మరచిపోయేందుకు ప్రయత్నించాడు. తాను కూడా చిన్న పిల్లవాడిలా మారిపోయి, తన కొడుకుతో ఆడుకుంటూ పాడుకుంటూ సేదతీరాడు. ఆ బాధను మరచిపోయాడు. మంత్రం వేసినట్లుగా ఆ కష్టము కూడా తొలగిపోయింది.


మనల్ని డిప్రెషన్ నుండి కాపాడే మందు బ్రాందీ, విస్కీ, రమ్ము కాదు... పిల్లల నవ్వులు, అమాయకంగా వాళ్ళు చేసే అల్లరి, మన మీద వారు చూపించే అభిమానం, కల్మషం లేని వారి ప్రేమ. కాదంటారా?


గడిచిపోయిన కాలం తిరిగిరాదు. పిల్లలతో అనుబంధం ఒక వరం. వారితో మాట్లాడటం, వారు చెప్పే కబుర్లు వినడం, వారితో కలసి ఆడుకోవడం, వారికి కథలు చెప్పి నిద్రపుచ్చడం, వారితో కలసి విజ్ఞాన విహార యాత్రలు చేయడం, ఇష్టమైన రుచికరమైన విందులు ఆరగించడం, పండుగలు పబ్బాలు సంతోషంగా జరుపుకోవడం, విందులు వినోదాలలో పాల్గొనడం, పెళ్ళిళ్ళు, తిరునాళ్ళు వంటి సంబరాలలో పాలు పంచుకోవడం... ఇవే కదా జీవితంలో తీపి గుర్తులు, మరపురాని క్షణాలు, మధుర స్మృతులు.


ఏమంటారు? అయినా కొందరు ఆడవారు, మగవారు అనవసరమైన ఇగోలకి పోయి, మనస్పర్థలతో వారి వారి జీవిత భాగస్వాములకు దూరమై తమ జీవితాలనే కాకుండా తమ పిల్లల జీవితాలను కూడా అస్తవ్యస్తం చేస్తున్నారు. బాగా సంపాదించే తల్లిదండ్రులు ఉండి కూడా అనాథలుగా పెంచబడుతున్నారు. ఇది భావ్యమేనా?


రైలు ప్రయాణంలో కొన్నిసార్లు చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. సీటు విషయంలోనో, కిటికీ విషయంలోనో, సామాను పెట్టే స్థలం విషయంలోనో ప్రయాణికుల మధ్య అభిప్రాయభేదాలు రావచ్చు. మొదట కొంత కోపం వచ్చినా... కొద్దిసేపటికి ఆలోచిస్తాం. మన ప్రయాణం ఇంకొంతసేపే కదా! ఇంత చిన్న విషయానికి ఎందుకు గొడవపడాలని అనుకుంటాం. ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తాం. కానీ అదే మన జీవితంలో జరిగితే మాత్రం రోజుల తరబడి ఆలోచిస్తాం.


ఎవరైనా మనల్ని అవమానించారని భావిస్తే వారితో మాట్లాడటం మానేస్తాం. చిన్న అపార్థం కారణంగా ఏళ్ల తరబడి బంధాలను దూరం చేసుకుంటాం. కొన్నిసార్లు మనకు ఎంతో ఇష్టమైన వ్యక్తులతో కూడా మాట్లాడకుండా ఉంటాం. ఆ తర్వాత మనసులో బాధపడతాం.


ఒక్కసారి ఆలోచించండి... మన జీవితం ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. రేపు ఏం జరుగుతుందో కూడా తెలియదు. అలాంటప్పుడు చిన్న చిన్న విషయాల కోసం మనకు ఇష్టమైన వారితో గొడవపడుతూ విలువైన సమయాన్ని ఎందుకు వృథా చేసుకోవాలి? ప్రతి విషయాన్నీ మనసుకు తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి మాటకూ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి గొడవలోనూ గెలవాల్సిన అవసరం అంతకంటే లేదు.


కొన్నిసార్లు మనం మౌనంగా ఉండటమే మనశ్శాంతికి మంచిది. మరికొన్నిసార్లు మనమే ముందుగా మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవడం మన బంధానికి మంచిది.చివరిగా ఒక్క మాట. తనకు తాను సుఖపడితే ఒక ఆనందం; తన వారిని, అంటే భార్యా (భర్త) పిల్లలను సుఖపెడితే పరమానందం. అందుకే ఆనందం వద్దు, పరమానందం పొందుదాం.


*** 


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



సీదా నాగరాజు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 







మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


పరిచయం

సీదా నాగరాజు

: పేరు సీదా నాగరాజు.1965లో గుంటూరు పట్టణంలో జన్మించాను.స్థానిక జలగం రామారావు మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి (1980)వరకు, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల; నాగార్జున సాగర్ లో ఇంటర్మీడియట్( 1980-82), సిల్వర్ జూబ్లీ కళాశాల, కర్నూలు లో డిగ్రీ( 1982-85),ఆంధ్రా క్రిస్టియన్ కాలేజ్ అఫ్ లా లో లా డిగ్రీ(1985-88) చదువుకున్నాను.దక్షిణ మధ్య రైల్వే గుంతకల్ డివిజన్ లో ఉద్యోగం చేసి 2025 లో రిటైర్ అయ్యాను.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page