ఓల్డ్ ఇజ్ గోల్డ్
Old is Gold - Telugu Social Articles | Ganti Asa Padmini
ఓల్డ్ ఇజ్ గోల్డ్ - తెలుగు సామాజిక వ్యాసాలు | గంటి ఆశ పద్మిని
Published in manatelugukathalu.com on 28/11/2026
“ఓల్డ్ ఇజ్ గోల్డ్” అనేది పాతకాలపు జీవన విధానాలు, ఆరోగ్యకరమైన అలవాట్లు, మధురమైన జ్ఞాపకాల విలువను గుర్తుచేసే ఆలోచనాత్మక కథనం. కొత్తదనాన్ని స్వీకరిస్తూనే పాతదనంలోని మంచిని కాపాడుకోవాలని ఇది సందేశమిస్తుంది.
“ఓల్డ్ ఇజ్ గోల్డ్” అనే సామెత అందరికీ తెలుసు. ప్రతి కొత్త జనరేషన్‌కి పాత పద్ధతులు, సినిమాలు, వేషధారణ, పాత డిజైన్లు నచ్చవు. కానీ పెద్దలు అందరూ “ఓల్డ్ ఇజ్ గోల్డ్” అని అంటుంటారు.
“ఓల్డ్” అంటే పాత. పాత అంటే జరిగిపోయినవి, గడిచిపోయినవి అని అర్థం.
ఆ గడిచిపోయిన క్షణంలోకి మనల్ని తీసుకెళ్లగల సత్తా, శక్తి ఉన్నది కేవలం ఒక జ్ఞాపకానికే.
గడిచిన ప్రతి ఒక నిమిషం మనకు ఏదో ఒక అనుభవాన్ని అందిస్తూనే ఉంటుంది. ఆ అనుభవంలోంచి మనం ఏదో ఒక గుణపాఠం నేర్చుకుని ఉంటాము.
ఆ అనుభవాన్ని గుర్తుచేస్తూ మనల్ని ఆ రోజులోకి, ఆ ఘడియలోకి తీసుకెళ్లగల జ్ఞాపకాన్ని గుర్తుచేసే ప్రతి పాత వస్తువే గానీ, విషయమే గానీ, సినిమావే గానీ, లేక పాత రోజులే కానీ ఏదైనా చాలా విలువైన బంగారంతో సమానం.
ఉదాహరణకు:- ఒక పాత సినిమా చూస్తున్నాము అనుకోండి, ఆ సినిమా కేవలం మనకు వినోదాన్నే మాత్రమే పంచదు.
ఆ రోజుల్లోని పరిసరాలు, వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలు, ఇంకా ఎన్నో అప్పటి కాలానికి అనుగుణంగా ఉండే సమాజాన్ని చూపిస్తోంది. ఒక పాత సినిమా చూస్తున్నప్పుడు.. మనసు నిండా జ్ఞాపకాలతో నిండిపోతుంది.
“మనం ఎవరితో ఆ సినిమాకు కలిసి వెళ్ళాము, ఏ రోజు వెళ్ళాము, సినిమా చూస్తున్నప్పుడు ఏమైనా సంఘటనలు జరిగి ఉంటే అవి అన్నిటినీ గుర్తుచేస్తూ” మనల్ని ఆ రోజులోకి లాక్కెళ్ళి కూర్చోబెడుతుంది. ఆ జ్ఞాపకాలు ఎంతో మధురంగా, అపురూపంగా అనిపిస్తాయి.
మనలో చాలామందికి పాతకాలం ఇంటి పద్ధతులు, పాతకాలం మనుషులు నచ్చరు.
ఎందుకంటే అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు అంటాము. కానీ అప్పటికాలం మనుషులే ఎనభై ఏళ్ళు వచ్చినా ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పటి కాలం మనుషులు నలభై రాగానే రోగాలపాలు అవుతున్నారు.
ఆ కాలపు ప్రతి పద్ధతిలో ఒక ఆరోగ్య రహస్యం దాగి ఉంది. ఆ పద్ధతులను అప్పటి మనుషులందరూ.. భయపడుతూనో, బాధపడుతూనో పాటించారు కాబట్టి చాలాకాలం ఆరోగ్యంగా ఉన్నారు.
అంటే ప్రతి కష్టంలోనూ ఒక సుఖం ఉంటుంది. కానీ ఇప్పటి కాలం పిల్లలు అసలు కష్టపడడానికే ఇష్టపడట్లేదు. ఇంక సుఖం ఎక్కడ అనుభవిస్తారు? రానున్న రోజుల్లో ఇంకా ఇంకా కష్టాలే పడతారు.
ఉదాహరణకు:- ఇప్పుడు ఎన్నో యంత్రాలు వచ్చాయి. మనిషి కూర్చొని స్విచ్ నొక్కితే అన్ని పనులు అలా నిమిషాల్లోనే పూర్తవుతాయి. అప్పటి కాలం మనుషులు అన్నీ స్వయంగా చేతులతో చేసేవారు.
“ఒళ్ళు అలిసేంత కష్టపడితే మెదడు విశ్రమించేంత నిద్ర పడుతుంది” అని మా అమ్మమ్మ చెప్పుతుండేది.
ఇప్పటికాలం మనుషులకు అలసట ఏది? అందుకే అందరూ “నిద్ర ఏది?” అని అడుగుతున్నారు. నిద్ర పట్టక రాత్రి ఒంటిగంట, రెండు, మూడు ఇలా సమయం లేకుండా రాత్రంతా ఫోన్ చూస్తూ ఇంకా అనారోగ్యాలపాలు అవుతున్నారు.
మనలో చాలా మందికి పాతకాలం వంటలు నచ్చవు. దానికి ముఖ్య కారణం కొత్త రుచులకు అలవాటు పడటం.
రెండో కారణం పాత వంటకాల తయారీకి సమయం, పని ఎక్కువ. ఓపికలు లేవు అని అందరూ ఆర్డర్ పెట్టుకుని కొత్త వంటకాలను తింటూ వాటి రుచులకు అలవాటు పడిపోతున్నారు. దీని వల్ల మంచి పౌష్టిక ఆహారం లేక చిన్నతనం నుంచే ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురుకుంటున్నారు.
కొత్తదనాన్ని ఆహ్వానిస్తూ, పాతదనాన్ని గౌరవిస్తూ, పాటిస్తూ.. రెండిటినీ సమతుల్యత చేసుకుంటూ మంచి జీవితాన్ని గడపాలి అందరూ.
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
గంటి ఆశ పద్మిని గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

పరిచయం: నా పేరు గంటి ఆశ పద్మిని.
నేను ఇప్పటివరకు ముఫై కథలు, పది బాలగేయాలు, ఒక మినీ నవల , ఐదు పుస్తక సమీక్షలు చేసాను.రాసాను. నా కథలు విశ్వభవిష్యత్, ఈనాడు, రేపటికోసం పత్రికలో పబ్లిష్ అయ్యాయి. సుమబాల, ఉషబాల, బాలబాట పుస్తకాల్లో, కదంబం అనే వెబ్ మ్యాగజైన్ లో కూడా నా కథలు ప్రచురణ అయ్యయి.











Comments