top of page
Original.png

బంధాలకు బంధీ

#NandyalaVijayaLakshmi, #నంద్యాలవిజయలక్ష్మి, #బంధాలకుబంధీ, #కవితాశిశువు, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

ree

Bandhalaku Bandhee - New Telugu Poem Written By  - Nandyala Vijaya Lakshmi

Published in manatelugukathalu.com on 25/07/2025 

బంధాలకు బంధీ - తెలుగు కవిత

రచన: నంద్యాల విజయలక్ష్మి


బంధాలకు బంధీ

-------------------------

అందాలజంట, వివాహమనే బంధముతో ముడివడి, 

కొత్త బంధాలను తగిలించుకుని, వినూత్నమైన ఆలోచనలతో, 

కొత్తకోరికలతో అడుగులు వేస్తూ, 

మధురమైన ప్రేమకు బందీగా, 

నూతనజీవితానికి చుడుతుంది శ్రీకారం. 


పాతబంధాలకు మెరుగులు పెడుతూ 

కొత్త బంధాలను స్వీకరిస్తూ 

మెట్టినింట బందీ అయినా, 

అనురాగము ఆప్యాయత అదనంగా దొరికితే, 

జీవనము ఆనంద దాయకముకాదా?


అతివ అంతరంగము మురిసిపోదా? 

తలవనితలంపుగా తగిలే బంధాలు 

ప్రయాణవేళ పరిచయాలు, 

మనసుకు ఒక అందమైన భావనగా, 


మిగిలి తెలియని అనుబంధాన్ని మనసు స్వాగతిస్తే;

కలిగే అనుభూతి ఉత్తేజము కలిగించదా? 


అంతరంగములో ప్రశాంతత నెలకొనదా?

నిత్యజీవితంలో బంధాలకు బందీలమైతేనే 


ఆత్మానందము. అనిర్వచనీయమైన అనుభూతి. 



ree













కవితాశిశువు

------------------

మేథో మథనము జరిగి మనసు స్పందించాక 

అక్షరసేనను తోడుతెచ్చుకుని 

ప్రసవవేదనలాంటి అనుభూతిని పొందిన తర్వాతే కెవ్వుమనే కవితాశిశువు వెలుగు చూస్తుంది 


అక్షరాలన్నీ ఏరికూర్చుకుని 

అద్భుత పదపుష్పాలు ఎన్నుకుని 

మనసనే దారముతో ముడివేసినప్పుడు 

కవితాతోరణము మన ముంగిటవేలాడుతుంది 


శిశువును అలంకరించురీతి 

అలంకారాలూ ఉపమానాలు ప్రాసలు

యతులూ పొందుపరుచుకుని

అనుభూతితో రమ్యంగా తీర్చిదిద్దితేనే అవుతుంది అది అందాల అద్భుత కవిత 


వస్తువేదైనా ప్రస్తుతి అయినా నిందాస్తుతి అయినా 

కువిమర్స అయినా సవిమర్స అయినా 

కవితగా మారినప్పుడే జనావళిని అలరించు 

అబ్బురపరుచు ఆనందింపచేయు 

కవికి పేరు తెచ్చేది కవితే. 

కవి మనసును పరవశింపచేసేది కవితే. 


***

నంద్యాల విజయలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం: నంద్యాల విజయలక్ష్మి

ఊరు. హైదరాబాదు

నేను ఎం.ఏ . ఆంగ్లసాహిత్యము బి.ఇ. డి

చేసి ఆంగ్ల ఉపన్యాసకురాలిగా పని చేసి ఇప్పుడు విశ్రాంత జీవనము గడుపుతున్నాను .

రెండు వందలపైగా కవితలు మూడుకథానికలు రాసాను

యాభై పైగా సర్టిఫికెట్స్ సహస్రకవిమిత్ర బిరుదు పొందాను .

పుస్తకపఠనము పై నాకు ఆసక్తి .

విశ్వనాథసాహిత్యమునుండీ ఆధునిక రచయితలు పుస్తకాలు చదివాను .ఇంకా ఎన్నో చదవాలని కోరిక .

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page