బరువెక్కిన బడి సంచులు
- Addanki Lakshmi

- Dec 19, 2025
- 4 min read
#అద్దంకిలక్ష్మి, #AddankiLakshmi, #BaruvekkinaBadiSanchulu, #బరువెక్కినబడిసంచులు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Baruvekkina Badi Sanchulu - New Telugu Story Written By Addanki Lakshmi Published In manatelugukathalu.com On 19/12/2025
బరువెక్కిన బడి సంచులు - తెలుగు కథ
రచన: అద్దంకి లక్ష్మి
"నమస్తే సార్, మా పిల్లవాడు స్కూల్ కి వెళ్ళాడు మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు. రోజూ స్కూల్ బస్సులో వెళ్తాడు. మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తాడు. ఈ రోజు తిరిగి రాలేదు. " అంటూ కంగారుపడుతూ మూర్తి ఆఫీసు నుంచి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశాడు,
"స్టేషన్ కి రండి సార్. కంప్లైంట్ ఇవ్వాలి. " అంటూ పెట్టేసాడు ఇన్స్పెక్టర్.
మూర్తి మళ్ళీ వెంటనే భార్య భానుకి ఫోన్ చేశాడు,
"నేను ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ రాసి వస్తాను. కంగారు పడకు" అంటూ,
రాజు, ‘నవీన్ ఉన్నత పాఠశాల’లో నాలుగో తరగతి చదువుతున్నాడు. పిల్లలందరితో రోజు స్కూల్ బస్సులో వెళ్తాడు. స్కూల్ బస్సు కాలనీ గేట్ దగ్గర వచ్చి ఎక్కించుకుంటుంది. మళ్ళీ పిల్లలందర్నీ దింపుతుంది.
ఈరోజు ఐదు గంటలకి ఆ కాలనీ పిల్లలు అందరూ తిరిగి వస్తున్నారు, కానీ వారిలో రాజు లేడు.
భానుకి మధ్యలోనే పిల్లలందరూ కనిపించారు. కానీ రాజు కనపడలేదు.
'రాజు ఏడి? మీతో రాలేదా?" అంటూ పిల్లలని అడిగింది
"ఏమో ఆంటీ కనిపించలేదు. వెళ్ళేటప్పుడు మాతో వచ్చాడు. వచ్చేటప్పుడు మాకు అస్సలు కనిపించలేదు. " అన్నారు.
భాను గుండెలు గుభేల్ మన్నాయి.
ఇంటికి వచ్చి వెంటనే ఆఫీసులో ఉన్న భర్త కి ఫోన్ చేసింది ఏడుస్తూ.
"నేను చూస్తాను కంగారు పడకు. అంటూ మూర్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు.
అదీ విషయం.
ఇంట్లో భాను ఏడుస్తూ కూర్చుంది పిల్లవాడి గురించి బెంగ పెట్టుకుని.
మూర్తి ఇంటికి వచ్చాడు. తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాడు.
అందరూ మాకు తెలియదు మా ఇంటికి రాలేదని చెప్పారు.
ఏమయ్యాడు పిల్లాడని మనసు పరిపరి విధాల పోతోంది ఇద్దరికీ.
పోలీస్ స్టేషన్ కి పది నిమిషాలకు ఓసారి ఫోన్ చేస్తున్నాడు. ఇంకా కనిపించ లేదు అంటూ ఇన్ఇన్స్పెక్టర్ జవాబు.
పక్కనే పల్లెటూర్లో ఉన్న తల్లిదండ్రులకి ఫోను చేద్దామనుకున్నాడు కానీ చేయలేదు. మూర్తి, వాళ్ళు పెద్దవాళ్లు.. కంగారు పడతారేమో అని అనుకున్నాడు,
రాత్రి తొమ్మిది గంటలైంది. తండ్రి ఫోన్ చేశాడు.
"నువ్వు కంగారు పడకురా! పిల్లవాడు ఇక్కడికి వచ్చాడు. ‘అమ్మమ్మని తాతని చూడాలనిపించి ఇక్కడకు వచ్చాను’, అన్నాడు.
‘మీ అమ్మా నాన్నకు చెప్పి వచ్చావా’ అని అడిగాను. లేదన్నాడు. కంగారు పడకు. బాగానే ఉన్నాడు. విషయము కనుక్కుందాము, "
రాజు క్షేమంగా ఉన్నాడని తెలిసింది. తల్లిదండ్రులు ఇద్దరికీ మనసు కుదుటబడింది.
పట్నం పక్కనే ఉన్న పల్లెటూరికి సిటీ బస్సులు వెళుతూ ఉంటాయి. సిటీ బస్సులో తాతగారింటికి వెళ్ళిపోయాడు రాజు.
ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి పిల్లవాడు దొరికాడని చెప్పాడు మూర్తి.
మర్నాడు ఉదయం భార్యాభర్తలిద్దరూ పక్కనే ఉన్న పల్లెకు వెళ్లారు. మూర్తి తల్లిదండ్రులు ఆ పల్లెలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు.
మూర్తి తండ్రి చెప్పిన విషయం ఇది..
పిల్లలు స్కూల్ బస్సు లో వెళ్తారు. స్కూలు బయట గేటు నుంచి లోపలికి వెళ్లి పైన రెండంతస్తుల లో క్లాస్ కి వెళ్ళాలి. పుస్తకాల బరువు మోయలేక నీరసం వస్తుంది. ఒక పుస్తకం తీసుకెళ్లక పోతే టీచర్లు కేకలు వేస్తారు. ఈ పుస్తకాల బరువుతో తలలో నొప్పి వస్తుంది రోజూ. చదవ బుద్ధి కాదు.
‘తలనొప్పి, కళ్ళు కూడా. చిన్న అక్షరాలు. సరిగా కనిపించవు. చదువంటే విసుగొస్తోంది. బడికి వెళ్ళ బుద్ధి కావడం లేదు. నేను కూడా ఇక్కడే ఉండి ఈ వ్యవసాయం పనులు చూస్తాను. తాతా నాకు చదువు వద్దు. ఇంటికి రాగానే బోలెడు హోంవర్క్’ అంటూ ఏడ్చేసాడు, ఇది అసలు సంగతి,”
తండ్రి చెప్పిందంతా విన్నాడు మూర్తి.
“ఈ నూతన విద్యా విధానం ఇలా ఉంది నాన్న గారు, ఏంచేస్తాం మనము, పిల్లలందరికీ ఇదే ప్రాబ్లం, మా చిన్నప్పుడు ఒక సబ్జెక్టు కి ఒక ప్రశ్న జవాబులు పుస్తకం ఒక్కటే ఉండేది. ఇప్పుడు రకరకాల ఎక్సర్ సైజులతో మూడు నాలుగు పుస్తకాలు ఉంటాయి. మొత్తం రోజు 10 కేజీల పుస్తకాలు మోసుకుపోవలసి వస్తోంది పిల్లలు పాపం,” అంటూ మూర్తి కూడా బాధపడ్డాడు.
రాజుని మెల్లిగా అనునయించి మర్నాడు తిరిగివచ్చారు.
మూర్తి స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లి ఈ పిల్లల ప్రాబ్లం, బండెడు పుస్తకాలు మోత గురించి మాట్లాడాడు.
సిలబస్ మార్చమని, స్కూల్ లో రాసే పుస్తకాలన్నీ, పిల్లలందరికీ ఒక్కొక్క షెల్ఫు తయారు చేయించి ఆ పుస్తకాలు అందులో పెట్టుకోమని చెప్పాలనీ, రోజు అన్ని పుస్తకాలు మోయ కుండా మూర్తి తనకు తోచిన సలహాలను ఇచ్చాడు.
"అలాగే సార్. ఈ ప్రాబ్లం పరిశీలిస్తా”మంటూ ప్రిన్సిపాల్,
జవాబు చెప్పి పంపించేశాడు మూర్తిని.
మార్పు లేని విద్యా విధానం..
బరువులు మోయ లేని చిన్నారుల భుజాలు..
***
అద్దంకి లక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి
నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి
జన్మ స్థలం:రాజమహేంద్రవరం
డేట్ అఫ్ బర్త్
3_6_1946.
నివాసం: నవీ ముంబయి
విద్యార్హతలు:
బి.ఎ; బి. ఇడి
**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,
బాంబే మునిసిపల్ కార్పొరేషన్
**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.
భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;
విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ
**కుమారుడు:
గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,
**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.
అల్లుడు మధుసూదన్ అమెరికా
వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు
**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,
నిరక్షరాస్యతను నిర్మూలించుటకు
సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,
నాటకాలు వ్రాసి
విద్యార్థుల నాటకాలు
వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,
సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి
చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,
**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,
**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం
**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం
సాహితీ జీవితం_రచనలు
**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను
**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి
ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను
**అనేక సమూహాల్లోని
ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,
పద్యాలు ప్రచురించ బడినవి
కవితలకు కథలకు బహుమతులు పొందినాను
నేను రాసిన
కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా
**మినీ కవితలు
పంచపదులు
సున్నితాలు
ఇష్టపదులు
**గేయాలు
**వ్యాసాలు
**నాటకాలు
పద్యాలు
గజల్స్
కథలు
రుబాయీలు
బాల సాహిత్యం
**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి
*సాహిత్య సేవ
తేనియలు,
తొణుకులు,
చిలక పలుకులు,
పరిమళాలు,
మధురిమలు,
ముత్యాలహారాలు,ఇష్టపదులు,
సకినాలు,
సున్నితాలు,
పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,
**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను
**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,
అన్ని గ్రూపుల నుంచి,
15 బిరుదులు పొందడం జరిగినది,
ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,
2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,
రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,
1.ప్రచురణ,,,
1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,




Comments