top of page
Original.png

గొప్పతనం

#BommakantiSaiManojna, #బొమ్మకంటిసాయిమనోజ్ఞ, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu,  #TeluguPoems


Goppathanam - New Telugu Poem Written By Bommakanti Sai Manojna

Published In manatelugukathalu.com On 08/01/2026

గొప్పతనం - తెలుగు కవిత

రచన: బొమ్మకంటి సాయి మనోజ్ఞ


గొప్పతనం

(వచన కవిత)

**********************************


ఒక చల్లని సాయంత్రం పూట, పగలు-రాత్రి కలిసిన వేళ...


పగలు ఇలా అంది. "నిన్ను చూస్తుంటే జాలిగా ఉంది. ఎందుకు ఇంత ఉత్సాహంగా వస్తున్నావు.? నువ్వంటే అందరికీ భయం. ఎవరూ నీలో ఉండాలి అనుకోరు. చెడుకు చిహ్నంగా నిన్ను చూస్తారు. నువ్వు ఉన్నంతసేపు మనిషికి తన జీవనం ఆగిపోతుంది. నాతో పోల్చుకుంటే నీవు శూన్యం".


చీకటి చిన్నబుచ్చుకున్నట్టు కనిపించినా చిన్న చిరునవ్వుతో ముందుకు నడిచింది.


ఇదంతా చూస్తున్న సాయంత్రానికి పగలు పలికిన మాటలు నచ్చలేదు. ‘ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నావు’ అని నిశిని నిలదీసింది.!


దానికి నిశి... "నా అంధకారంలో సేద తీరనిదే, నేను హత్తుకొని ఓదార్చనిదే, ఏ ప్రాణికీ తరువాతి ఉదయం లేదు." అని చెప్పి జాబిలి ఒడిలో వాలిపోయింది.


ఆ క్షణం సాయంత్రానికి అర్ధం అయింది... "అవమానం, గొప్పతనాన్ని చెరిపేయలేదు అని.!"  


************************************

బొమ్మకంటి సాయి మనోజ్ఞ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత్రి పరిచయం: బొమ్మకంటి సాయి మనోజ్ఞ

Profile Link:

 నా పేరు బొమ్మకంటి సాయి మనోజ్ఞ. రచనా ప్రయాణంలో ఇంకా ప్రారంభ దశలో ఉన్న ఒక ప్రేరణాత్మక రచయితను. జీవితాన్ని ఆనందభరితమైన దృక్కోణంతో చూడటం, ఆ సానుకూల భావాలను నా కథలు, కవితల ద్వారా పంచుకోవడం నా ఆశయం. నా పదాలు ఎవరికైనా చిరునవ్వు, ధైర్యం ఇవ్వగలిగితే అదే నా రచనకు సార్థకత.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page