'Boni Adirindi' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 04/07/2024
'బోణీ అదిరింది' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
అనిల్, ఆనంద్ మంచి స్నేహితులు. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఫేమస్ అయిపోవాలని అనుకున్నారు. ఇద్దరూ కలిపి వీడియోలు చేస్తూ ఉంటే, అనిల్ వాటిని అప్లోడ్ చెయ్యడం.. వైరల్ చెయ్యడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఆనంద్ కి రోజు రోజు కు గుర్తింపు పెరుగుతోంది. అందుకే, తెలివైన అనిల్ ని తన సెక్రటరీగా ఉండమని చెప్పాడు.
ఇలా ఉంటుండగా.. ఈ మధ్య ఆనంద్ కి బయట చిన్న చిన్న ఓపెనింగ్స్ పిలుస్తున్నారు. ఇది కుడా మంచి పబ్లిసిటీ యే కదా.. ఒప్పుకోమని అనిల్ చెప్పడం చేత, ఆనంద్ వాటికి ఒప్పుకున్నాడు.
"ఆనంద్ ! ఈ రోజు నీకు ఒక ఓపెనింగ్ కి ఆహ్వానం వచ్చింది!" అన్నాడు ఫ్రెండ్ అండ్ సెక్రటరీ అనిల్..
"ఇక మీదట నన్ను'సర్' అని పిలవాలి, గౌరవం ఇవ్వాలి అనిల్.. ఇంతకీ ఏమిటో ఆ ఓపెనింగ్? షాపింగ్ మాల్ అయి ఉంటుంది. సెలబ్రిటీ అయితే చాలా కష్టమే మరి! ప్రతీ ఓపెనింగ్ కి నన్నే పిలుస్తున్నారు అనిల్" అన్నాడు ఆనంద్
"నువ్వు.. సారీ మీరు ఇంకా జస్ట్ అప్ కమింగ్ అంతే!.. స్టార్ కాదు.. అందుకే మిమల్ని చిన్న చిన్న ఓపెనింగ్స్ మాత్రమే పిలుస్తున్నారు సార్!"
"అదీ గొప్పే కదా.. అనిల్! కానీ.. ప్రతీ ఓపెనింగ్ లో నన్ను స్పీచ్ ఇమ్మని తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారు.. చుట్టూ జనాలు"
"ఒక పని చేస్తాను.. మీ కోసం ఒక స్పీచ్ ఫార్మాట్ తయారు చేస్తాను.. అది అన్ని ఓపెనింగ్స్ కి ఫాలో అయిపొండి సర్! జస్ట్ ఆ ఓపెనింగ్ పేరు మారిస్తే చాలు.. మిగిలినదంతా ఒకటే.. "
"థాంక్స్ రా.. నువ్వు నా టైం సేవ్ చేసావు"
"అయితే రేపు మన సందులో ఒక కిరానా షాప్ ఓపెనింగ్ కు పిలిచారు.. ఆ లెటర్ ఇవ్వు.. రేపు చదివేస్తాను.. " అన్నాడు ఆనంద్
మర్నాడు షాప్ ఓపెనింగ్ బాగా జరిగింది..
"సర్! స్పీచ్ ఎలా ఇచ్చారు సర్!"
"స్పీచ్ చాలా బాగా ఇచ్చాను. అంతా నువ్వు రాసి ఇచ్చినదే!.. ప్రతి ఓపెనింగ్ కి నన్నే బోణీ చెయ్యమని అడుగుతున్నారు.. లేకపోతే ఒప్పుకోవట్లేదు. కిరానా షాప్ కాబట్టి.. ఇదిగో.. కొన్ని సరుకులు కొన్నాను!"
"ఎవరు సార్?"
"చుట్టూ ఉండే ఆ జనమే.. మన ఫ్యాన్స్!"
"రేపు మీకు రెండు ఓపెనింగ్స్ ఉన్నాయి సార్! ఒక గంట గ్యాప్ లో.. డీటెయిల్స్ అక్కడే తెలుస్తాయి.. ఇప్పుడు చెప్పలేదు"
"అలాగే!.. స్పీచ్ పేపర్ రెండు కాపీలు ఇవ్వు.. మార్చి చెప్పేస్తాను.. " అన్నాడు ఆనంద్
మర్నాడు ఆనంద్ చాలా హ్యాపీ గా ఓపెనింగ్స్ కి బయల్దేరాడు. అనిల్ కు పని ఉండి వెళ్ళలేదు.
కొంతసేపటి తర్వాత.. ఆనంద్ కు ఫోన్ చేసి అనిల్.. "ఏమిటి సర్! ఫస్ట్ ఓపెనింగ్ అయిపోయిందా?"
"ఏమిటి అయ్యేది.. చాలా ఇబ్బంది పడ్డాను అనిల్. అక్కడకు వెళ్ళిన తర్వాత తెలిసింది.. అది ఒక సెలూన్ షాప్ ఓపెనింగ్ అని! ఓపెనింగ్ బాగా జరిగింది.. కూల్ డ్రింక్స్ హడావిడి అంతా బాగానే ఉంది. కానీ, స్పీచ్ ఇస్తున్నప్పుడే.. జనాలకి కోపం వచ్చి.. బాగా తిట్టారు.. "
"స్పీచ్ ఏమని ఇచ్చారు సర్ ?"
"కిరానా షాప్ ఓపెనింగ్ కి చెప్పినట్టే, ఇలాంటి షాపులు వీధికి ఎన్నో రావాలని.. అందరికీ బాగా ఉపయోగపడాలని నా కోరిక" అని చెప్పాను అంతే.. !
"మరి తిట్టరా సర్?"
"నేను నీ అంత తెలివైన వాడిని కాదు కదా అనిల్!"
ఇంకా విను అనిల్.. బోణీ కొట్టాలని షాప్ యజమాని బలవంతం చేసాడు. నేను ఎవరికో కటింగ్ చెయ్యాలేమో అనుకుని లోపలికి వెళ్లి రిలాక్స్ అవుతూ ఉంటె, నాకే కటింగ్ చేసి పడేసారు..
"పోనీలెండి సర్, కటింగ్ అయిపోయింది కదా.. ఇప్పుడు బాగా స్మార్ట్ గా ఉండే ఉంటారు కదా.. "
"స్మార్ట్.. ?? నా ఖర్మ! జుట్టు ఎంత ఎక్కువ తీస్తే, అంత బోణీ బాగుంటుందని.. మొత్తం గొరికేసారు రా!"
"అయ్యో! అంతా మన మంచికే సర్.. " అని ఓదార్చాడు అనిల్
"అంతేనంటావా అనిల్.. ?"
"అంతే.. ! నెక్స్ట్ ఓపెనింగ్ కి ఫోన్ వచ్చింది.. మీరు బయల్దేరండి.. "
"ఈ అవతారం తోనా.. ?"
"మీకు ఇలాగ ఫేమస్ అవాలని రాసిపెట్టి ఉందేమో.. ఇంక ఆలోచించకండి.. "
"ఇదేమి తంటా తెస్తుందో.. ?"
"వెళ్ళండి సర్.. ఈ ఓపెనింగ్స్ వల్ల మీకు మంచి పాపులారిటీ పెరుగుతుంది.. నో చెప్పకండి"
"అంతే అంటావా అనిల్?"
"మీకు లొకేషన్ షేర్ చేస్తాను.. అక్కడకు వెళ్ళండి సర్ "
"పంపించు వెళ్తాను.. "
ఒక గంట తర్వాత అనిల్ నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది ఆనంద్ కి..
"సర్! అయిపోయిందా సెకండ్ ఓపెనింగ్?"
"అంతా పోయింది.. "
"ఏమిటి అంత నీరసంగా చెబుతున్నారు.. ?" అడిగాడు అనిల్
"జరిగింది చెబితే.. నీకే తెలుస్తుంది. నెక్స్ట్ ఓపెనింగ్ కి వెళ్ళిన తర్వాత తెలిసింది.. అది ఒక సులభ్ కాంప్లెక్స్ ఓపెనింగ్ అని. రిబ్బన్ కట్ చేసిన తర్వాత.. స్పీచ్ ఈ సారి మార్చి చదివాను.. మంచి రెస్పాన్స్ వచ్చింది"
"బాగానే ఉంది కదా! మరి ఏమిటి ప్రాబ్లం.. ?"
సులభ్ కాంప్లెక్స్ లో ఉన్న టాయిలెట్స్ అన్నిటికి బోణీ చెయ్యమని బలవంతం చేసారు. అక్కడ ఒక అరడజను ఉన్నాయి. ఒక్కో దానికి బోణీ చెయ్యాలని పట్టు బట్టారు.. మొదటిది బాగానే బోణీ చేసాను.. నాకూ కడుపు ఫ్రీ అయిపోయింది. కానీ మిగిలిన వాటికి కుడా బోణీ చెయ్యాలని పట్టుబట్టారు అంతా.. చేసేదేమీ లేక.. ఒక్కో దానిలో కొంచం కొంచం బోణీ చేసాను.. విరోచన మాత్రలు ఇచ్చి మరీ బోణీ చేయించారు.. "
"అయ్యో సర్! ఎవరూ చెయ్యలేని పని చేసి.. మీరు చాలా ఫేమస్ అయ్యారు. నెక్స్ట్.. సినిమా ఛాన్స్ గ్యారంటీ సర్"
'మనసులో ఏదో పెట్టుకుని.. ఇదంతా ఆ అనిల్ గాడే చేసి ఉంటాడు.. అందుకే వాడు ఇక్కడకు రాకుండా జాగ్రత్త పడ్డాడేమో.. ' అని మనసులో అనుకున్నాడు ఆనంద్
************
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Comments