బుర్రకథ
- Addanki Lakshmi

- 1 day ago
- 3 min read
#అద్దంకిలక్ష్మి, #AddankiLakshmi, #BurraKatha, #బుర్రకథ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథ

Burra Katha - New Telugu Story Written By Addanki Lakshmi
Published In manatelugukathalu.com On 08/03/2026
బుర్రకథ - తెలుగు కథ
రచన: అద్దంకి లక్ష్మి
"అమ్మా! నాన్నగారు! వెళ్లొస్తా, బై బై!" అంటూ బ్యాగ్ తీసుకుని బుర్రకథ ట్రూప్తో పాటు వెళ్ళిపోయింది దుర్గ.
పరంధామయ్యగారు భార్యని చూస్తూ విసుగుకున్నారు. "ఏమిటే దీనికీ పిచ్చి! బుర్రకథలు చెప్పుకుంటూ బతుకుతోంది. తెలుగులో ఎం.ఎ. పాస్ అయింది. కాలేజీలో ఎక్కడైనా లెక్చరర్గా వెళ్ళవే అంటే వినదు!"
"పోనీలెండి! దానికి ఏది ఇష్టమైతే అదే చేయనివ్వండి. మనకి మటుకు అది ఒక్కతే కదా కూతురు?
ప్రతి పట్టణంలో, పల్లెల్లో వెళ్ళి బుర్రకథలు చెబుతుంటే దీనికి ఎంత పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి!
ఈ ప్రోగ్రాంలో కూడా డబ్బు దొరుకుతుంది కదా!
దీనికి చిన్నప్పటినుంచి బుర్రకథల పిచ్చి. ఇంట్లో డ్యాన్స్ చేసి, ఆ చిడతలు పట్టుకొని పాడుతూ ఉండేది కదా!
అప్పుడు చూసి ముచ్చటపడేవారు," అంటూ శాంతపరిచింది.
"అది కాదే! అందరూ నవ్వుతున్నారు కదా!
'బుర్రకథలు చెప్పుకుని బతుకుతోంది. పిల్లకి పెళ్లి అయినా చేయలేదు' అంటున్నారు. లెక్చరర్ ఉద్యోగం చేస్తే ఎంత బాగుంటుంది!"
"ఏమండీ! నేనొకటి చెప్పనా?
లెక్చరర్ ఉద్యోగాలు, కంపెనీలో ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్నైనా చేయొచ్చు. అదేమీ కష్టమైన పని కాదు.
మీరు ఒకటి చెప్పండి, 'మందలో ఒకరిగా ఉండడం మీకు ఇష్టమా, వందలో ఒకరిగా నిలిచిపోవడం మీకు ఇష్టమా?'"
తల్లిదండ్రులు పిల్లల గురించి ఏమిటి ఆశిస్తారు, చెప్పండి? దీనికి మటుకు లోటే ముందుంది? టీవీ వాళ్లు పిలిచి ప్రోగ్రాములు ఇప్పిస్తున్నారు. తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలలో అన్నిటిలోనూ పాల్గొంటోంది. పూర్వం వచ్చిన పాత కథలు కాక, తనే కొత్తగా అంశాలను సృష్టించుకుని రాసి పాడుతోంది.
మొన్న టీవీలో ఇంటర్వ్యూ వాళ్ళు దీని గురించి ఎంత పొగిడారు!
ముఖ్యంగా పల్లెల్లో ఉండే ఆడపిల్లలందరూ టీవీలో ఇది చెప్పే బుర్రకథలు విని, వాళ్ళలో చాలా మార్పు వచ్చిందని, ధైర్యసాహసాలు వచ్చాయని!"
అంటూ సుశీలమ్మ భర్తకి నచ్చచెబుతూ వంటగదిలోకి వెళ్ళిపోయింది.
ఇప్పుడు ఆంధ్రదేశమంతటా దుర్గ చెప్తున్న బుర్రకథలతో మహిళల్లో చాలా మార్పు వస్తోందని, ఆమె అంశాలను కొత్త కొత్తగా సంఘంలోని సమస్యలకు అనుగుణంగా తయారు చేసుకుంటుంది.
'స్త్రీ అబల కాదు, సబల' అని మహిళా సాధికారత,
అన్ని రంగాలలో మహిళలు సాధిస్తున్న ప్రగతి,
ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు,
ఆ సమయంలో వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు గురించి చెప్పే బుర్రకథలు
చాలా ఉత్తేజకరంగా ఉండి, పల్లెల్లో ఉండే మహిళలలో ఎంతో మార్పు తెస్తుంది.
స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నప్పుడు వారు తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పే బుర్రకథలు చాలా ప్రసిద్ధి అయినాయి.
దుర్గ చెప్పే బుర్రకథలు వినడం వల్ల ఆడపిల్లలు అత్యాచార సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి తప్పించుకున్న సంఘటనలు రోజు పేపర్లో వస్తున్నాయి.
ఇదంతా దుర్గ చెప్పే బుర్రకథల ఫలితమని అందరూ ప్రశంసిస్తున్నారు.
&&&&__&&&
సాహిత్య అకాడమీ ప్రభుత్వం వారు ఈ సంవత్సరం ఆమెకి ప్రత్యేక పురస్కారంతో గౌరవిస్తున్నామని తెలియజేశారు.
దానితో తండ్రి పరంధామయ్యగారు, సుశీలమ్మ సంతోషపడ్డారు.
వీరేశలింగం పంతులు గారు, రాజా రామ్మోహన్ రాయ్ మొదలగు సంఘ సంస్కర్తలు ఎంతో మంది స్త్రీల గురించి పాటుపడ్డారు.
తమ కూతురు దుర్గ కూడా తెలుగు సాహిత్యంలో కవులందరి ప్రభావంతో సంఘ సేవ చేస్తున్నందుకు, వందలో ఒకరిగా నిలిచిపోయినందుకు, ఈ రోజుల్లో జానపద కళలకు ఇంత ప్రాముఖ్యం ఇస్తున్నారు అంటే తల్లితో పాటుగా తండ్రి కూడా సంతోషపడ్డాడు.
***
అద్దంకి లక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి
నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి
జన్మ స్థలం:రాజమహేంద్రవరం
డేట్ అఫ్ బర్త్
3_6_1946.
నివాసం: నవీ ముంబయి
విద్యార్హతలు:
బి.ఎ; బి. ఇడి
**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,
బాంబే మునిసిపల్ కార్పొరేషన్
**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.
భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;
విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ
**కుమారుడు:
గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,
**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.
అల్లుడు మధుసూదన్ అమెరికా
వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు
**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,
నిరక్షరాస్యతను నిర్మూలించుటకు
సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,
నాటకాలు వ్రాసి
విద్యార్థుల నాటకాలు
వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,
సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి
చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,
**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,
**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం
**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం
సాహితీ జీవితం_రచనలు
**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను
**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి
ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను
**అనేక సమూహాల్లోని
ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,
పద్యాలు ప్రచురించ బడినవి
కవితలకు కథలకు బహుమతులు పొందినాను
నేను రాసిన
కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా
**మినీ కవితలు
పంచపదులు
సున్నితాలు
ఇష్టపదులు
**గేయాలు
**వ్యాసాలు
**నాటకాలు
పద్యాలు
గజల్స్
కథలు
రుబాయీలు
బాల సాహిత్యం
**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి
*సాహిత్య సేవ
తేనియలు,
తొణుకులు,
చిలక పలుకులు,
పరిమళాలు,
మధురిమలు,
ముత్యాలహారాలు,ఇష్టపదులు,
సకినాలు,
సున్నితాలు,
పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,
**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను
**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,
అన్ని గ్రూపుల నుంచి,
15 బిరుదులు పొందడం జరిగినది,
ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,
2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,
రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,
1.ప్రచురణ,,,
1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,




Comments