top of page

చదవడం మంచి అలవాటు


'Chadavadam Manchi Alavatu' New Telugu Article


Written By A. Annapurna


(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)


అవును చదవాలి. చదువుతూనే ఉండాలి. తెలుసుకోవాలి. తెలుసుకుంటూనే ఉండాలి. గ్రంథ పఠనం వలన మన జీవితాలు సక్రమ మార్గంలో నడుస్తాయి. ఉన్నతమైన ఆశయాలు ఏర్పడుతాయి. భవితలో మంచి జరుగుతుంది. దేశ ప్రగతికి మంచి జరుగుతుంది. అందుకు ఉదాహరణ నేనే !


ఇప్పటి లోక్ సత్తా స్థాపకులు డా. జయప్రకాష్ నారాయణ్ ఇంతకు ముందు కలక్టర్ గా పనిచేశారు. 1989 -90 లలో తూర్పు గోదావరి జిల్లాకి కలక్టర్ గా వచ్చినపుడు నిజాయితీ గల ఆఫీసర్ గా,పేద ప్రజలకు,వ్యవసాయ రైతులకు మంచి చేసిన వారుగా పేరు తెచ్చుకున్నారు.


నాది కాకినాడ కనక అది నిజం అని తెలుసు. ప్రజాసేవ కోసం తన ఉద్యోగానికి పదవీ విరమణ చేసి లోక్ సత్తా స్వచ్ఛంద సంస్థ స్థాపించారు. అప్పుడు ప్రజలను చైతన్య వంతులుగా చేయడానికి, వారి భావ జాలాన్ని తెలియ చేయడానికి రాజకీయాల పట్ల అవగాహన కల్పించడానికి ప్రజల హక్కులు ఏమిటో తెలియ చెప్పడానికి అనేక పత్రికలలో వ్యాసాలూ రాసేరు.


అప్పటికే 'జె పీ' గారి గురించి తెలుసు కనుక నేను వాటిని వదలకుండా చదవడం, ఫైల్ చేసుకోడం జరిగింది. అంతవరకూ విజయవాడలో ఉన్న నేను మా వారి ట్రాన్స్ఫర్

కారణంగా హైదరాబాద్ వచ్చాం. అంతే! నా జీవితానికి గొప్ప మలుపు వచ్చింది.


క్లాస్ పుస్తకాలతో బాటు పత్రికలూ, ఎన్నెన్నో పుస్తకాలు చదవడం మా తండ్రిగారు అలవాటు చేశారు. ఆ మంచి అలవాటు ఆశయాలకు బాట వేసింది. నా పన్నెండేళ్ల

వయసులోనే కాకినాడ మెడికల్ కాలేజీ అనాటమీ డిపార్ట్ మెంట్ చూసి భయపడలేదు సరికదా మరణానంతరం నా దేహాన్ని డొనేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. దానికి కారణం అప్పటికే మెడికల్ కాలేజి ఎవరి పేరున స్థాపించారో

(ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ తండ్రి గారు అని గురుతు.)

వారి దేహం డొనేట్ చేసారని విన్నాను.


ఆ వయసులో నా ప్రమేయం ఎంత అనిగాని, ఎక్కడ వుంటాను అనిగాని అవగాహనా లేక పోయినా నాలో ఒక ఆశయం ఏర్పడటం ఆశ్చర్యం. దానికి కారణం నిరంతరమూ చదవడం వలన ఏర్పడిన ఒక ఆలోచన మాత్రమే !


ఎవరూ ఇలా చేయమని నాకు చెప్పలేదు. ఆలా లోక్ సత్తా నాకు 'ఆశయాల వేదిక' కల్పించింది. ఎవరి వ్యాసాల వలన ప్రభావితం అయ్యానో ఆ గొప్ప వ్యక్తి పత్రిక లో వ్యాసాలు రాయగల అవకాశం లభించింది. ఇది ఎవరికీ లభించని మహా భాగ్యం !

రాబోయే యువతరానికి మార్గ దర్శకులు జయప్రకాశ్ నారాయణ్. మహిళలు కూడా వారి అంతర్గత ఆలోచనలను సాకారం చేసుకోండి! అందుకు ఎవరో ఒకరు సహాయ పడతారు. మనలో ఆశయం ఉంటే అవకాశము లభిస్తుంది. అది ఏరకంగా ఐనా !


ఆ చదివే అలవాటు, ఉత్తరాలు రాసే అలవాటు నన్ను రచయిత్రిని కూడా చేసింది.


విల్ యు ట్రై??

***

ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


Twitter Link


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ




నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)













22 views0 comments

Comments


bottom of page