top of page

చదువు విలువ తెలుసుకో!

#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ChaduvuViluvaThelusuko, #చదువువిలువతెలుసుకో, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 95


Chaduvu Viluva Thelusuko - Somanna Gari Kavithalu Part 95 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 14/07/2025

చదువు విలువ తెలుసుకో! - సోమన్న గారి కవితలు పార్ట్ 95 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


చదువు విలువ తెలుసుకో!

----------------------------------------

చదువులేని జీవితము

కాదు వర్ణ శోభితము

చూడ అతలాకుతలము

కాలినట్టి కాగితము


చదువుతోనే గౌరవము

ఎక్కిస్తుంది అందలము

అదే అన్నింటికి మూలము

చేయవలదు నిర్లక్ష్యము


వేస్తుంది ప్రగతి బాట

విజ్ఞాన విరుల తోట

ఆశ్రయిస్తే ఘన కోట

తరిగిపోని సిరి మూట


ఉన్నతంగా చదువుకో

ఎవరెస్టులా ఎదిగిపో

చదువులేని జీవితాలు

కొరగానివని తెలుసుకో


చదువు ద్వారా వికాసము

జీవితాల్లో వినోదము

పెంచుతుంది విజ్ఞానము

త్రుంచుతుంది అజ్ఞానము


చదువంటే అతిముఖ్యము

చేసుకోకు ఇక దూరము

కష్టపడి చదివితేనే

సుఖమయమే జీవితము

ree

























అక్షర సత్యాలు - ఆణిముత్యాలు

----------------------------------------

మితిమీరిన స్వార్ధము

కలుగజేయు నష్టము

మానుకున్న మంచిది

త్యాగగుణం శ్రేష్టము


వేయరాదు నిందలు

వెదక రాదు తప్పులు

మంచి పనికి ఎప్పుడు

చెప్పరాదు సాకులు


అనుక్షణం గొడవలు

రేపరాదు కక్షలు

సున్నిత మనస్కులకు

పెట్టరాదు బాధలు


వద్దు వెకిలి చేష్టలు

ముద్దు మేలి గుణములు

దైవానికి ఇష్టము

శుద్ధమైన మనసులు


ఇంటిలోని పిల్లలు

మింటిలోని చుక్కలు

కన్నవారికైతే

కంటిలోని కాంతులు


సదనంలో మహిళలు

వెలుగులీను ప్రమిదలు

వారు లేక మహిలో

ముసురుకొనును మబ్బులు

ree










పెద్ద మనిషి హితోక్తులు

------------------------

గాలిలోన దీపము

పెట్టుకుంటే నష్టము

చేతులతో దానికి

కాపునిస్తే లాభము


నీటి మీద రాతలు

వదరుబోతు మాటలు

నిర్మిస్తే నిలవవు

ఆకాశ హార్మాలు


పనికిరాని కూతలు

నీచమైన చేతలు

హానికరం పరికింప

చెదరగొట్టు తలపులు


దుష్టులతో స్నేహము

అత్యంత ప్రమాదము

సజ్జనుల సహవాసము

బ్రతుకున మధుమాసము


అధికమైన కోపము

తెచ్చునోయ్ అనర్ధము

జీవితాన శాంతము

తలపించును నాకము


పెంచుకోకు ద్వేషము

ఆదిలోన త్రుంచుము

చేయబోకు పాపము

చివరికదే దాస్యము

ree














వినయమే ఆభరణం

----------------------------------------

హెచ్చితే అహంకారము

ఆవరించు అంధకారము

నియంత్రణ లేకపోతే

బ్రతుకగును అతి దారుణము


క్షీణించును బంధాలు

వర్ధిల్లవు స్నేహాలు

వినయమే కంఠహారము

తెలుసుకొమ్ము ఈ సత్యము


గర్వంతో నాశనము

పాడగును ఆరోగ్యము

విజయానికి సోపానము

అమూల్యమైన వినయము


ఆదిలోనే వదిలేస్తే

వినయాన్ని వెంబడిస్తే

జీవితమే సుఖాంతము

తొంగిచూచును ఆనందము

ree













చదువు విలువ తెలుసుకో!

--------------------------------------

చదువులేని జీవితము

కాదు వర్ణ శోభితము

చూడ అతలాకుతలము

కాలినట్టి కాగితము


చదువుతోనే గౌరవము

ఎక్కిస్తుంది అందలము

అదే అన్నింటికి మూలము

చేయవలదు నిర్లక్ష్యము


వేస్తుంది ప్రగతి బాట

విజ్ఞాన విరుల తోట

ఆశ్రయిస్తే ఘన కోట

తరిగిపోని సిరి మూట


ఉన్నతంగా చదువుకో

ఎవరెస్టులా ఎదిగిపో

చదువులేని జీవితాలు

కొరగానివని తెలుసుకో


చదువు ద్వారా వికాసము

జీవితాల్లో వినోదము

పెంచుతుంది విజ్ఞానము

త్రుంచుతుంది అజ్ఞానము


చదువంటే అతిముఖ్యము

చేసుకోకు ఇక దూరము

కష్టపడి చదివితేనే

సుఖమయమే జీవితము


-గద్వాల సోమన్న

Comments


bottom of page