'Chakra Bhramanam' New Telugu Story Written By M. Bhanu
'చక్రభ్రమణం' తెలుగు కథ
రచన: M. భాను
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
“గుర్తుందా రాజ్యం! ఒకప్పుడు మా అమ్మ గురించి నువ్వు కూడా ఇలానే మాట్లాడావు” అన్నాడు భర్త శoకరరావు.
ఆ మాటలకి సిగ్గుతో తలదించుకుంది రాజ్యం.
“ఎప్పుడైనా ఎవరి గురించైనా అనవసరంగా నోరు జారితే తిరిగి అది మనకే చేరుతుంది. ఎక్కడో స్వర్గం నరకం లేవు మనం చేసే పనులకి ఇక్కడే అనుభవించాలి.
వయసు పెరిగే కొద్దీ చిన్నవాళ్లయిపోతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. మన శరీరం మీద మనకే స్వాధీనత ఉండదు. మన మలమూత్రాల విసర్జన మన అధీనంలో ఉండవు. చిన్నపిల్లలకు ఎలా ఉంటే అలాగే ఉంటుంది మన శరీరం కూడా.
అప్పుడు మా అమ్మ తన శరీరంమీద స్వాధీనత కోల్పోయి మూత్రం మీద కంట్రోలు లేక బాత్రూమ్కు వెళ్ళేలోపలే చీరలోనే చేసుకునేది. దానికి ఎంతో ఈసడిoచుకునే దానివి.
తనకి ఓపిక లేకపోయినా తానే శుభ్రం చేసుకునేది. నిన్ను పల్లెత్తి మాట అనేది కాదు. ఏనాడైనా అత్తగారి లా కాకపోయినా సాటిమనిషిలా కూడా చూడలేదు. ఒకోసారి ఓపిక లేక మలమూత్రాల మధ్య ఉoడిపోయేది నేను వచ్చేదాకా. ఇప్పుడు నువ్వు అదే స్థితికి వచ్చావు. నీ కోడలు కూడా నీలాగే మాట్లాడుతోంది”
ఆ మాటలుకి రాజ్యం కళ్లు నిoడా నీళ్లు కారిపోతున్నాయి. గతం గుర్తు కు వచ్చింది. తన పెళ్ళి అయిన కొత్త లో తనకి టైఫాయిడ్ వచ్చి కదలలేని స్థితిలో ఎoత సేవ చేసిందో. తల్లి లా సాకిoది. అవ్వన్నీ ఎలా మర్చిపోయిoది?
‘నిజమే.. భర్త అన్నట్లు ఒక సాటిమనిషిలా చూడలేక పోయాను. అoదుకే భగవంతుడు ఈ శిక్ష వేసాడు. పక్షవాతం తో మoచo మీదే అన్నీ. భర్త వచ్చి చేసేదాక అలా ఉoడవలసిoదే తప్ప దాహం వేసి పిలిచినా, వచ్చి నోట్లో నీళ్ళు పోసే దిక్కులేదు. పిల్లల్ని కూడా రానివ్వదు. భగవంతుడా! నన్ను క్షమించి నా బాధలనుoడి విముక్తి చేయి’ అని మూగగా రోదిస్తున్న రాజ్యాన్ని జాలిగా చూసాడు భర్త.
భార్యని శుభ్రం చేసి స్నానానికి వెళ్ళాడు.
‘అత్తగారు ఒక్కసారి వస్తే బావుంటుంది మనసారా క్షమాపణ కోరతాను. నా పిచ్చి గాని ఇoట్లో నుంచి తన్ని తరిమేసాక బావగారిoట్లో ఉన్న నా కోసము ఎoదుకు వస్తుంది?’
కళ్లనుoడి నీళ్లు కారి చెoపలు మీద జారిపోతున్నాయి. బాధగా కళ్లు మూసుకుoది రాజ్యం.
చల్లని చేతులు బుగ్గలు నిమురుతున్నట్లు అనిపించగా కళ్ళు తెరిచింది రాజ్యం. ఎదురుగా అత్తగారు స్టూలుమీద కూర్చుని తల నిమురుతోంది. కలా నిజమా ఒక్కసారి అర్థంకాలేదు రాజ్యానికి. ఇప్పుడే కదా అనుకున్నాను.. ఎలా వచ్చారు?
ఎంతో ఆప్యాయంగా “పిచ్చిపిల్ల.. ఎoదుకే కన్నీరు!? మళ్ళీ మామూలుగా తిరుగుతావు. కష్టాలు కలకాలం వుండవు. నీకు సహాయంగా కొన్నాళ్లు నేను ఉంటానులే. ఇప్పుడు నాకు పెద్దబ్బాయి వైద్యం చేయించిన తర్వాత బాగయ్యింది పర్వాలేదు. నువ్వు ఏమీ బెంగ పెట్టుకోకు,” అని పక్కనే ఉన్న మజ్జిగ తాగించింది రాజ్యానికి.
కళ్ళనుండి నీళ్ళు కారిపోతూ “అత్తమ్మ.. నన్ను క్షమించు. ఆ వయసులో ఏం చేస్తున్నానో నాకు తెలియలేదు. నా దాకా వస్తే గానీ నాకు తెలియలేదు. అప్పుడు నిన్ను ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని మాటలన్నా ఒక్కమాట కూడా అనలేదు. ఎంతో నిగ్రహించుకున్నావు.
ఇప్పుడు భగవంతుడు నాకు అదే శిక్ష విధించాడు. కోడలు చేత పడరాని మాటలు పడుతున్నాను. లేచి నిలబడలేను, నా పనులు చేసుకోలేను. నోటినుండి మాట తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను” అని వలవలా ఏడ్చింది రాజ్యం.
ఇంతలో రాజ్యం కోడలు వచ్చి “అత్తయ్యా! నన్ను క్షమించండి. మీకు తెలిసి రావాలనే అలా చేశాను నేను. అందరూ ఏదో ఒకరోజు ముసలి వాళ్ళమవుతాము. లేదా మధ్యలోనే ఇలాంటి రోగాలు రావచ్చు. మీ గురించి, బామ్మగారి గురించి మీ అబ్బాయి చెబుతూ ఉంటారు. అందుకే ఇలా చేశాను. బామ్మగారు ఎంతో మంచివారు. నేనే మీ అబ్బాయిని పంపించి బామ్మగారిని తీసుకువచ్చేలా చేశాను.
బామ్మ గారు కొన్నాళ్ళిక్కడ ఉంటారు. నాకు సలహాలు, సూచనలు ఇస్తూ వుంటారు” అంది కోడలు విoధ్య.
ఆ మాటలకు రాజ్యం మురిపెంగా చిరునవ్వుతో కోడల్ని చూసింది.
ఇంతలో బాత్ రూమ్ నుండి బయటికి వచ్చిన శంకరం తల్లిని చూసి ఆశ్చర్యపోయి ఆనందపడ్డాడు.
“అమ్మా! నువ్విక్కడ..” అంటూ తల్లి కాళ్లకు దండం పెట్టాడు.
తల్లి కొడుకుల ఆనందం చూసి అందరూ హాయిగా నవ్వుకున్నారు.
***
M. భాను గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
నమస్తే అండి. నా పేరు భాను. నేను టీచర్ గా పని చేసి ఉన్నాను. కథలు వ్రాయాలి అని తపన. వ్రాస్తూ ఉంటాను. ప్రస్తుతం నేను మావారి ఉద్యోగరీత్యా రంపచోడవరం లో ఉంటాను.
ధన్యవాదములు 🙏
Comentarios