top of page
Original.png

తెలంగాణం


కాకతీయ కళాతొరణం, గోల్కొండ కోట, సమ్మక్క-సారక్క పోరాటస్ఫూర్తి, పోతన మరియు దాశరథి సాహిత్య వారసత్వం, తెలంగాణ జానపద సంస్కృతిని ప్రతిబింబించే కళాత్మక దృశ్యం.
కాకతీయ కళాతొరణం, గోల్కొండ కోట, సమ్మక్క-సారక్క పోరాటస్ఫూర్తి, పోతన మరియు దాశరథి సాహిత్య వారసత్వం, తెలంగాణ జానపద సంస్కృతిని ప్రతిబింబించే కళాత్మక దృశ్యం.

Telanganam - Telugu Poem on Mother's Day |  Chandrakala Deekonda

Published in manatelugukathalu.com on 30/05/2026

తెలంగాణం - మదర్స్ డే తెలుగు కవిత | చంద్రకళ దీకొండ


తెలంగాణ అనేది కేవలం ఒక రాష్ట్రం కాదు, చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, పోరాటాల సమ్మేళనం. కాకతీయుల వైభవం నుంచి సినారె గజళ్ల వరకు ఎన్నో విశిష్టతలను ఈ నానీ కవిత ఆవిష్కరిస్తుంది. తెలంగాణ భాష, ఆత్మీయత, మతసామరస్యం, జానపద సంపదను స్మరింపజేస్తుంది. తెలంగాణ గర్వకారణాలను సంక్షిప్తంగా, అందంగా పరిచయం చేసే కవిత ఇది.


తెలంగాణం

ప్రక్రియ:నానీ


కాకతీయ శిల్పకళ

గోలుకొండ కోట

అశ్మిక జానపదం

తెలంగాణ!


ఆత్మీయతా పిలుపులు

భాషల అలైబలై

మతసామరస్యం

తెలంగాణ!


పోతన భాగవతం

దాశరథి శతకం

గోపన్న కీర్తన

తెలంగాణ!


రుద్రమ్మ పాలనాయుక్తి

సమ్మక్క పోరాటశక్తి

పోరుగడ్డ

తెలంగాణ!


సినారె గజళ్ళు

గోరేటి పాట

పాలపిట్ట పరుగుల

తెలంగాణ!


=======================================

పిల్లలను ప్రేమగా హత్తుకున్న తల్లి, వెనుక ఎవరెస్టు పర్వతం, భావోద్వేగ తెలుగు కవితా వాతావరణం
పిల్లలను ప్రేమగా హత్తుకున్న తల్లి, వెనుక ఎవరెస్టు పర్వతం, భావోద్వేగ తెలుగు కవితా వాతావరణం










Amma Prema Mundu Everest Saitham Talavanchu - Telugu Poem on Mother's Day | Chandrakala Deekonda

Published in manatelugukathalu.com on 10/05/2026

అమ్మ ప్రేమ ముందు ఎవరెస్టు సైతం తలవంచు - మదర్స్ డే తెలుగు కవిత | చంద్రకళ దీకొండ


తల్లి ప్రేమ… అది మాటల్లో చెప్పలేని మహత్తరమైన అనుభూతి.

గర్భంలో మోసి, కన్నీళ్లతో కాపాడి, జీవితమంతా పిల్లల సంతోషానికే అంకితం చేసే తల్లి గొప్పతనాన్ని ఈ కవిత ఎంతో భావోద్వేగంగా ఆవిష్కరిస్తుంది. ప్రతి పాదంలో మమత, త్యాగం, ప్రేమ పరిమళించే ఈ సరళ శతకం ప్రతి హృదయాన్నీ కదిలిస్తుంది.


ప్రక్రియ :సరళ శతకం

శీర్షిక : అమ్మ ప్రేమ ముందు

ఎవరెస్టు సైతం తలవంచు

🌷🌷🌷🌷🌷🌷🌷🌷


నీ హృదయ స్పందనకు కారణమై

నీ గుండె లయతాళాలే జీవనగానమై

నవమాసాలు నిను గర్భాన మోయు

అమ్మ ప్రేమ ముందు ఎవరెస్టు సైతం తలవంచు!


శారీరక మానసిక ఒత్తిడులెన్నో అనుభవించి

రోయక ఎన్నో సేవలొనర్చి

పెంచి పెద్ద చేసి విద్యాబుద్దులెన్నో నేర్పు

అమ్మ ప్రేమ ముందు ఎవరెస్టు సైతం తలవంచు!


ఆమె హృదయమొక మమతల కోవెల

క్షమ ప్రేమలే ఆమె గుండె 

లబ్ డబ్ లు

ప్రేమ త్యాగాల ప్రతిరూపమైన

అమ్మ ప్రేమ ముందు ఎవరెస్టు సైతం తలవంచు!


చెప్పకుండానే నీ ఆకలి తెలుసుకుంటుంది

అడగకుండానే అవసరాలు తీరుస్తుంది

పెదవి విప్పకుండానే నీ మనసు తెలుసుకునే

అమ్మ ప్రేమ ముందు ఎవరెస్టు సైతం తలవంచు!


నీ బాధకు తాను తల్లడిల్లుతుంది

నీవే లోకంగా భావిస్తుంది

ఎల్లవేళలా నీ క్షేమాన్నే కాంక్షించు

అమ్మ ప్రేమ ముందు ఎవరెస్టు సైతం తలవంచు!


విసుక్కున్నా సహిస్తుంది

ఎదురుతిరిగినా భరిస్తుంది

నీవు ఒడి చేరితే అమితంగా మురిసే

అమ్మ ప్రేమ ముందు ఎవరెస్టు సైతం తలవంచు!


నీ ఆశలకు తాను పల్లకై

నీ ఆనందాలకు వారధై

నీ ఆలోచనలకు సారథి అయిన

అమ్మ ప్రేమ ముందు ఎవరెస్టు సైతం తలవంచు!


చెడు పనులను వారిస్తుంది

నీతులను ప్రథమగురువై బోధిస్తుంది

నీ పొరపాట్లను వెనకేసుకొచ్చే

అమ్మ ప్రేమ ముందు ఎవరెస్టు సైతం తలవంచు!


ఎవరు నిన్ను తూలనాడినా తాళలేదు

విమర్శలతో గేలిచేస్తే ఊరుకోదు

ప్రపంచాన నీవే మిన్న ఎన్ని

లోపాలు నీకున్నా అనే

అమ్మ ప్రేమ ముందు ఎవరెస్టు సైతం తలవంచు!


ఎవరికీ ఏ లోటూ రానీయక

ఇంటిలోని వారందరి 

శ్రేయస్సుకై పాటుపడుతూ

తన గురించి తాను

ఆలోచించుకునే ఆలోచన రాని

అమ్మ ప్రేమ ముందు ఎవరెస్టు సైతం తలవంచు!


***

చంద్రకళ దీకొండ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


 ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: చంద్రకళ దీకొండ

పేరు:చంద్రకళ.దీకొండ,

స్కూల్ అసిస్టెంట్,

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా.

రెండు జాతీయ స్థాయి పొటీలలో ప్రథమ,ప్రోత్సాహక బహుమతులు అందుకున్నాను.పలు కవితా సంకలనాలలో 

నా కవితలు ప్రచురించబడ్డాయి.పలు ప్రముఖ అంతర్జాల మరియు వారపత్రికలలో నా కవితలు అనేకంప్రచురించబడినవి.

విహంగభూమిక* మానవి*మనోహరి*వంటి మహిళా ప్రత్యేక  పత్రికలలోనూ నా కవితలు ప్రచురించబడినవి. సున్నితం చంద్రికలు అను లఘుకవితా ప్రక్రియలో రచించబడిన 250 కవితల సంపుటి మరియు 100 కవితల సంపుటి సాహితీచంద్రికలుప్రచురించబడినవి.

తానా వారు అమృతోత్సవ్ సందర్భంగా నిర్వహించిన గేయ,కవితల పొటీలలో ఎంపిక కాబడి, కవి సమ్మేళనంలోపాల్గొని,

ప్రశంసాపత్రాలను అందుకున్నాను.*తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్* లో మూడు సార్లు మరియు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఒకసారి నమోదు అయ్యాను.*GATA* వారు సిరివెన్నెల గారి స్మృతిలో నిర్వహించిన కవితల పొటీలలో మూడవ బహుమతిగా 2000 రూపాయలను స్వీకరించాను.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page