top of page

చెదరని స్మృతులు


'Chedarani Smruthulu' - New Telugu Story Written By Goparaju Venkata Suryanarayana

'చెదరని స్మృతులు' తెలుగు కథ

రచన: గోపరాజు వెంకట సూర్యనారాయణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత మన్మధరావు హైదరాబాదు నగరం తిరిగి వచ్చాడు. నగరం లో డిగ్రీ చదువు పూర్తి అయిన తర్వాత.. పై చదువుకు ఉత్తర భారతం వెళ్ళిన మన్మధరావు.. ఉద్యోగ రీత్యా కూడా అక్కడక్కడే చేస్తూ.. ఇన్నాళ్ళకు తిరిగి.. సొంత రాష్ట్రం, .. అందునా.. హైదరాబాదుకు బదిలీ మీద చేరుకున్నాడు!


నివాసంలో కుదుట పడ్డాక.. కాలేజీ స్మృతులు వెంటాడగా.. సిటీలోని.. తెలిసిన తోటి కాలేజీ దోస్తులంతా కలిసారు. పాత జ్ఞాపకాలు సరదా ముచ్చట్లతో ఆనందాలు పంచుకుంటూ మరచిన ఎప్పటివో.. స్మృతులను నెమరు వేసుకున్నారు.

కాలేజీలో చదివే ఆ రోజుల్లో మన్మధరావు పేరుకు తగ్గ కులాసా పురుషుడు! అయిదున్నరడుగుల అందగాడు! గిరజాల జుట్టు.. అందమైన తలకట్టుతో ఆకర్షనీయమైన రూపం!.. స్ఫురద్రూపి!!


స్నేహితుల కులాసా ముచ్చట్ల సమయంలో.. ఒక జిగిరీ దోస్తు, .. 'అవునుగానీ.. మన్మధరావ్, .. నీ విశాలాక్షిని కలిసావా?'.. అని అడిగాడు.


'ఆ!.. ఏమిటీ?.. తను ఇక్కడే ఉందా?.. ఎడ్రసు తెలుసా?' అని ఆశ్చర్యంగా అడిగాడు మన్మధరావు.


'అవును ఇక్కడే జాబ్ చేస్తోంది! ఇప్పుడు ఎక్కడ

ఉంటోందో తెలియదుగాని.. ఫోను నెంబరు తెలుసు' అని ఫోను వివరాలు ఇచ్చాడు.. జిగిరీ!


మర్నాడు.. ఉండబట్టలేక.. ఫోన్ చేసాడు మన్మధరావు.

రింగు కాగానే 'హలో!.. విశాలాక్షీ!.. గుర్తు పట్టలేదా?' అన్నాడు ఆప్యాయంగా.


ఆ పిలుపుకు ఒకింత ఆశ్చర్య పోయింది కల్యాణి. వెంటనే తేరుకుని ఆ పేరుతో తనను సంభోదించేది ఒకే ఒక్కడని గుర్తుచేసుకుని, 'ఎన్నాళ్ళకెన్నాళ్ళకు!.. సోగ్గాడు.. శోభన్ వేనా?..'


'అవును నేనే!.. నీ వెలా ఉన్నావు?'


'బాగే.. కానీ, .. ఎప్పుడొచ్చావ్?..' అంటూ పలకరించుకుంటూ.. పాత స్నేహన్ని తిరగదోడుకుంటూ చాలా సేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. చివరగా.. ముఖాముఖి మరోసారి కలుద్దామని నిర్ణయించుకొని.. తాజ్ బంజారా హొటల్లో.. కార్నర్ టేబుల్, .. లంచ్ కు బుక్ చేసుకున్నారు.


కాలేజీలో చదివే రోజుల్లో కల్యాణికి కాలేజీ బ్యూటీ అనే ప్రఖ్యాతి కూడా ఉండేది. ఒకే ఏరియా నుంచి సిటీ బస్సులో.. కాలేజీకి.. రోజూ వస్తూ పోతూ ఉండటంతో పరిచయం కాస్తా.. క్రమంగా స్నేహంగా మారి, .. ఆకర్షణతో.. చనువుగా మాట్లాడుకునే.. స్థాయికి పెరిగింది!

ఒక విధంగా.. మన్మధరావు కల్యాణికి బాడీగార్డ్ గా ఉండే వాడారోజుల్లో. కల్యాణి విశాల నేత్రాలకు ఆకర్షితుడై.. విశాలాక్షీ!.. అనీ, .. నల్లటి కురులు ముంగురులను చూసి.. కృష్ణవేణీ!.. అనీ.. ముద్దు పేర్లతో పిలుస్తుండేవాడు.


అలాగే కల్యాణి కూడా అతడిని.. సోగ్గాడు, .. శోభన్!.. అని ఎద్దేవా చేస్తూ.. పిలుస్తుండేది. కాలేజీ చదువయ్యే వరకూ.. ఇదే వరస వారిది!


డిగ్రీ పరీక్షలు పూర్తవగానే వారి దారులు వేరయ్యాయి. మళ్ళీ వారి మాటామంతీ ఈరోజే!


ఆ రోజు.. తాజ్ బంజారా హోటల్లో.. బుక్ చేసుకున్న కార్నర్ టేబుల్ టైమ్ గడిచినా.. ఖాళీగానే మిగిలి ఉంది!


వేళకు తయారైన కల్యాణి.. అద్దంలో, .. తన ఇప్పటి రూపం చూసుకొని, .. కళ్ళ క్రింద ఏర్పడిన వలయాలు, నెరిసిన కేశాలతో, .. అతడి ముందుకు వచ్చే సాహసం చేయ లేకపోయింది.


అలాగే.. మన్మధరావు కూడా ప్రస్తుత తన బట్టతల, .. ముందుకు పెరిగిన స్థూలకాయంతో, .. ఆమె ముందుకు వెళ్ళి నిలిచే, .. ధైర్యం చెయ్యలేక పోయాడు.

పాతికేళ్ళ క్రితం వారి ఊహ రూపాల్ని, .. ఒకరికొకరు తమవారి మనసులలో.. అలాగే నిలుపుకోవాలని.. ఇరువురు నిశ్చయించుకున్నారు! మరెప్పుడూ వాళ్ళు కలుసుకోలేదు, మాట్లాడుకోలేదు!!


వారి కాలేజీ రోజుల స్మృతులు చెదరలేదు!


ఎప్పటికీ పదిలం!!

******************


గోపరాజు వెంకట సూర్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

ముందుగా మన తెలుగు కధలు.కామ్ నిర్వాహకులకు నమస్కారం, అభినందనలు. మీరు తెలుగు కధలను, కధకులను ప్రోత్సహిస్తున్న తీరు ఈ మధ్యనే తెలిసింది!

నా పేరు: గోపరాజు వెంకట సూర్యనారాయణ, తల్లిదండ్రులు: గోపరాజు కృష్ణమూర్తి, అనసూయ దంపతులు. నివాసం: కూకట్ పల్లి, హైదరాబాదు.

వృత్తి రీత్యా M.Tech. Machine design చదివిన నేను, HMT Hyd. లో, దాదాపు ముప్పై ఏళ్ళు పైన పనిచేసి డిప్యూటీ జనరల్ మేనేజరు స్థాయిలో వాలంటరీ పదవీ విరమణ చేసిన ఇంజనీరును.

ఆ తర్వాత పేరున్న విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ప్రొఫెసర్ గానూ, మరికొన్ని ఇంజనీరింగు సంస్థల్లో డిజైన్ కన్సల్టెంటు గానూ పనిచేసిన అనుభవం.

ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ ను. స్వతహాగా సాహిత్యాభిమానిని, కళాభిమానిని. కధలంటే బాగా ఇష్టపడతాను. ఈ మధ్యనే, రిటైర్మెంట్ తర్వాత స్వీయరచనా వ్యాసాంగానికి, స్వీయ పెయింటింగ్సు వేయడానికి సాహసిస్తున్నాను. పలు అంతర్జాల సమూహలకు, సంకలనాలకు కవితలు, చిన్నగా కధలు రాస్తున్నాను, ప్రచురిస్తున్నారు, అభినందిస్తున్నారు!
45 views0 comments
bottom of page