top of page

రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 1


'Raghupathi Raghava Rajaram Episode 1- New Telugu Web Series Written By Parupalli Ajay Kumar

'రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 1' తెలుగు ధారావాహిక ప్రారంభం

రచన: పారుపల్లి అజయ్ కుమార్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

రఘుపతి స్పెషల్ క్లాస్ తీసుకోవాలని ఉదయం ఎనిమిది గంటలకల్లా హీరో స్ప్లెండర్ ప్లస్ మీద కాలేజీకి వచ్చాడు.


బైక్ స్టాండ్ వేస్తుంటే గర్ల్స్ టాయిలెట్స్ దగ్గర పిల్లలు, పెద్దలు గుమిగూడి ఉండటం చూసాడు.


ఏమైందోనని ఆదుర్దాగా అటు నడిచాడు. సుమారు ఇరవై ఏళ్ళ యువతి నేలమీద బోర్లా పడివున్నది.


వంటి మీద బట్టలన్నీ చిరిగిపోయి అస్తవ్యస్తంగా చెదిరిపోయివున్నాయి.


దాదాపుగా అర్ధ నగ్నంగా కనిపిస్తున్న ఆమెను చూస్తూ ప్రక్కనున్న పెద్దమనిషి తలకు చుట్టుకొనివున్న తువ్వాలుని అడిగి తీసుకొని ఆమెపై కప్పాడు.


ఇంతలో పోలీసులు వచ్చారు.

గుంపును చెదరగొట్టి ఆ యువతి దగ్గరకు వెళ్ళారు.

ఒక కానిస్టేబుల్ ఆమె ముక్కు దగ్గర వేలు ఉంచి చూసాడు.


" సార్, ఈమె బ్రతికే వుంది. "

అన్నాడు SI తో.


SI వెంటనే 108 కు ఫోన్ చేసాడు.


పోలీసుల వెంట వచ్చిన కెమెరామెన్ ఆమెను ఫోటోలు తీస్తున్నాడు.


ఆ యువతిని ఎక్కడో చూసినట్లు అనిపించింది రఘుపతికి.

జ్ఞాపకం తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తూ SI దగ్గిరకు వెళ్ళి విష్ చేసాడు.


"SI గారూ ఈమెను ఇంతకుముందు ఎక్కడో చూసినట్లు గుర్తు" అని అన్నాడు.


"ఎక్కడ చూసారు?" SI అడిగాడు.


రఘుపతి రెండు నిమిషాలు ఆలోచిస్తున్నట్లు ఉండిపోయాడు.


" ఆ గుర్తొచ్చింది. మా వూరి రైతు సీతయ్య బావమరిదితో కనిపించింది రెండుసార్లు. పెట్రోలు బంక్ దగ్గర ఒకసారి కనిపించింది. నేను పెట్రోల్ పోయించుకోవటానికి వెళ్ళినప్పుడు సీతయ్య బావమరిది శేషగిరి పెట్రోల్ బంక్ వాడితో గొడవపడుతున్నాడు.


అప్పుడు ఈమె శేషగిరి బండిపైన కూర్చొని కనిపించింది. మాములుగా అయితే అంత గుర్తుండేది కాదు. కానీ శేషగిరి గొడవకు అటు చూసిన నాకు ఈమె కనిపించింది.

శేషగిరి భార్య నాకు తెలుసు. ఈమెను చూసి ఎవరో బంధువులో, తెలిసిన వారో అనుకున్నాను. శేషగిరి నన్ను గమనించలేదు. రెండు మూడు నిమిషాలపాటు పెద్దగా అరచి అక్కడినుండి బండి తీసుకుని వెళ్ళిపోయాడు ఈమెతో పాటుగా.


రెండవసారి సినిమా హాల్లో కనిపించారు. మా ముందు వరుసలో కూర్చున్నారు వీరిద్దరూ. ఊళ్ళో సీతయ్యకు, మాకు పొలం సరిహద్దుల గురించి కొద్దిగా గొడవలున్నాయ్. అందుకే శేషగిరిని చూసినా పలకరించలేదు" చెప్పాడు రఘుపతి.


"శేషగిరిది ఏ వూరు?" అడిగాడు SI.


"గువ్వల పాలెం. ఎక్కువుగా అక్కగారింట్లో అంటే మావూరిలోనే ఉంటాడు. పిల్లలు లేరు. భార్య ఆ వూరిలో, ఇతను మావూరిలో.. జల్సా రాయుడని అందరూ అనుకుంటుంటే విన్నాను. అతనితో నాకు ఎక్కువ పరిచయం లేదు."


SI ప్రభాకర్ పోలీస్ స్టేషనుకు ఫోన్ చేసి వెంకటాయపాలెం, గువ్వలపాలెం లకు కానిస్టేబుల్స్ ను పంపించాడు.

శేషగిరి ఎక్కడున్నా పోలీస్ స్టేషనుకు తీసుకు రమ్మని.


108 వచ్చింది.


ఆ యువతిని పట్టుకొని లేపుతుంటే దగ్గరగా వెళ్ళి చూసాడు SI ప్రభాకర్. గొంతు నులిమినట్లుగా కంఠంపై కమిలిపోయిన గుర్తులున్నాయి.


వెంటనే వేలిముద్రల నిపుణుడుని ప్రభుత్వ హాస్పిటల్ కు రమ్మని ఫోన్ చేసి చెప్పాడు.


రఘుపతిని కూడా స్టేషనుకు రమ్మని అడిగాడు.

రఘుపతి, ప్రిన్సిపాల్ రాగానే సి. ఎల్. అప్లై చేసి పోలీస్ స్టేషనుకు వెళ్ళాడు.


శేషగిరి స్టేషనుకు రాగానే అతని వేలిముద్రలు తీసుకుని పరిశీలనకు పంపించారు.


శేషగిరి వెంబడి సీతయ్య కూడా వచ్చాడు. శేషగిరి తనకే పాపం తెలియదని ఒట్లు పెట్టుకున్నాడు. తననెవరో కావాలని యిందులో ఇరుకిస్తున్నారని బుకాయించాడు.


మధ్యాహ్నానికి హాస్పిటల్ నుండి డాక్టరు ఫోన్ చేసాడు స్టేషనుకు 'పేషేంట్ కు స్పృహ వచ్చిందని. '


అందరూ హాస్పిటల్ కు వెళ్ళారు.

మేజిస్ట్రేట్ ను కూడా పిలిపించారు.


ఆమె నెమ్మదిగా చెప్పసాగింది.


"నా పేరు కమల. నాది రామాపురం అనే చిన్న పల్లెటూరు.

నా చిన్నతనంలోనే నా తల్లితండ్రులు చనిపోతే మేనమామ దగ్గర పెరిగాను. నాకు వయసు వచ్చిన దగ్గరినుండి మేనమామ ప్రవర్తనలో మార్పువచ్చింది. నన్ను లోబరుచుకోవాలని శతవిధాల ప్రయత్నించేవాడు.


అత్తకు నా మీద ప్రేమ లేదు కానీ తన భర్త నా వలలో పడి తనను నిర్లక్ష్యం చేస్తాడోనని భయపడి నన్ను పట్నంలో ఒక మహిళాఆశ్రమంలో చేర్చింది.


అక్కడ కుట్టుపనులు, చేతివృత్తులు మొదలైనవి నేర్పేవారు.

నేను కూడా ఎంతో ఇష్టంతో మిషన్ పని నేర్చుకోసాగాను.

కొద్ది రోజులు పోయాక ఆ ఆశ్రమం నిజస్వరూపం తెలిసింది.


పగలంతామహిళాభ్యుదయానికే ఆ ఆశ్రమం నెలకొల్పామని చెప్పే ఆ ఆశ్రమ నిర్వాహకులు రాత్రిపూట అక్కడున్న స్త్రీలతో వ్యభిచారం చేయించేవారు. అక్కడున్న వారంతా సరియైన దిక్కూ మొక్కూ లేని వారే. తెగించి బయటకు చెప్పేవారు కాదు.


బయటకెళితే ఈ మాత్రం నీడ, కొద్దిపాటి రక్షణ కూడా ఉండడని భయంతో కాలం గడుపుతున్నారు. నేను క్రొత్త దాన్నని కొద్ది రోజులు నాజోలికి రాలేదు.


అప్పుడే అక్కడ వ్యభిచరించటానికి వచ్చిన శేషగిరి నన్ను చూసాడు. నా సంగతులు విని విచారం వెలిబుచ్చేవాడు.

రోజూ పగలు వచ్చి నన్ను పలకరించేవాడు. ఎన్నో మెరమెచ్చు మాటలు చెప్పేవాడు.


నా అందాన్ని పొగిడేవాడు. నన్ను ప్రేమించానన్నాడు.

తనకు నచ్చిన వారు దొరకక పెళ్ళి చేసుకోలేదని చెప్పేవాడు. అతని కల్లిబొల్లి మాటలు నేను పూర్తిగా నమ్మకపోయినా ఆ ఆశ్రమం నుండి బయటపడాలనే ఉద్దేశ్యంతో నేను అతని మాటలు నమ్మినట్లు నటించాను.


ఆశ్రమం వారికి ఏం చెప్పాడో తెలియదు నన్ను అక్కడి నుండి తెచ్చి ఈ వూరికి చివరవున్న ఒక పాకలో వుంచాడు.

ఊరివారితో పరిచయాలు చేసుకోవద్దని, నాలుగు రోజులపాటు గుట్టుగా ఉండాలని, అలా ఉండకపోతే నా గురించి ఆశ్రమ నిర్వాహకులకు తెలిస్తే ప్రమాదమని చెప్పాడు. నేనూ సరేనన్నాను.


అందుకే నా సంగతి ఎవరికీ తెలియదు. రెండువారాల పాటు బాగానే వున్నాడు. నేను పెళ్ళి చేసుకోమని అడిగేదాన్ని. ఇదుగోఅదుగో అంటూనే సమాధానాలు దాటేసేవాడు. మోజు తీరిన తరువాత రాకపోకలు తగ్గాయి. పెళ్ళి చేసుకోకపోతే

వారి వూరికి వచ్చి అందరిముందు గొడవ చేస్తానని బెదిరించాను.


నిన్న రాత్రి బాగా తాగివచ్చాడు. వస్తూ ఎవరో ఇద్దరు మగవాళ్ళను తీసుకొచ్చాడు.

వాళ్ళు రాత్రంతా నా శరీరాన్ని చిత్రహింసల పాలుచేస్తూ నన్ను అనుభవించారు. వాళ్ళు వెళ్ళిపోగానే లోపలికి వచ్చిన శేషగిరిని కోపంగా చూస్తూ పొద్దున్నే వెళ్ళి పోలీస్ స్టేషను లో ఈ విషయం చెపుతానన్నాను.

శేషగిరి ఆవేశంగా నా మెడను పట్టుకొని నొక్కేసాడు. తరువాత ఏమైందో తెలియదు. తెలివి వచ్చేసరికి ఇక్కడ వున్నాను."


కమల స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసుకొని ఆమె సంతకం తీసుకున్నారు. ఆశ్రమం నిర్వాహకుల దగ్గరకు, మేనమామ, దగ్గరకు పోలీసులను పంపించారు. కమల స్టేట్ మెంట్ ఆధారంగా శేషగిరిని అరెస్టు చేసి పోలీస్ దెబ్బల రుచి చూపించేసరికి మొత్తం ఒప్పుకున్నాడు.


ఆరాత్రి తాగిన మైకంలో కమల గొంతు పిసికాడు. ఆమె తల వాల్చేసేసరికి చనిపోయిందని భావించి ఆమెను వూరి చెరువులో పడేద్దామని ఆమె బాడీని తీసుకుని బయలుదేరాడు.


కాలేజీ పరిసరాల్లోకి రాగానే ఏదో వెహికిల్ చప్పుడు వినిపించి గేటు తీసుకుని కాలేజీలోకి వెళ్ళాడు. కాలేజీలో ఒక మూలన ఆమెను పడేసి వెళ్లిపోయాడు.


కమల గురించి ఆ ఊళ్లో ఎవరికీ తెలియదు, ఆ శవం గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు అని అనుకున్నాడు. ఆశ్రమం వాళ్ళు కానీ, మేనమామ కానీ కమల గురించి ఆరా తీయరులే అని అనుకున్నాడు.


కానీ రఘుపతి తనను, కమలను చూశాడని, కమలను గుర్తుపట్టి పోలీసులతో చెపుతాడనేది అతని ఊహకందని విషయం.


పోలీసులు శేషగిరి మీద FIR ఫైల్ చేసి మరసటి రోజు కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల కోరిక మేరకు నిందితుడు శేషగిరికి మూడు రోజుల పోలీసు రిమాండు కు ఆదేశాలిచ్చారు మేజిస్ట్రేట్ గారు.


మూడు రోజుల్లో కేసుకు సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలను పొలీసులు కోర్టులో ప్రవేశ పెట్టవలసి ఉంటుంది. ఆరోజు కూడా కాలేజీకి సెలవు పెట్టి

రఘుపతి కూడా కోర్టుకు హాజరయ్యాడు.


బేడీలు వేసి తీసుకెళ్తున్న శేషగిరిని చూస్తూ ఆవేశంతో రగిలిపోయాడు సీతయ్య. అక్కడే వున్న రఘుపతి వైపు కోపంగా చూస్తూ


"రఘుపతీ, నీవల్లే నా బామ్మర్ది పట్టుపడ్డాడు. నాలుగు రోజుల్లొ వాడిని బెయిల్ మీద తీసుకురాపోతే నా పేరు సీతయ్యే కాదు. ఏదో ఒకరోజు నీ సంగతి చూస్తా. సీతయ్య అంటే ఏంటో తెలియచేస్తా.." చూపుడువేలు ఊపుతూ బెదిరిస్తూ గట్టిగా అరిచాడు.


రఘుపతి సీతయ్య బెదిరింపులను ఏ మాత్రం లెక్క చేయకుండా నవ్వుతూ కోర్టు ఆవరణలో పార్కింగ్ చేసి వున్నతన బైక్ దగ్గిరకు నడిచాడు.


========================================================================

ఇంకా వుంది..


========================================================================

పారుపల్లి అజయ్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నా పేరు పారుపల్లి అజయ్ కుమార్ ...

పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుడుని ...

ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణ వాసిని ...

సాహిత్యం అంటే ఇష్టం .... కథలు,

నవలలు చదవటం మరీ ఇష్టం ...

పదవీ విరమణ తరువాత నా సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మం లో

"పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట - చావా రామారావు మినీ రీడింగ్ హాల్ " పేరిట ఒక చిన్న లైబ్రరీని మా ఇంటి క్రింది భాగం లో నిర్వహిస్తున్నాను ..

షుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి .

నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు ..

రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు ...

ఉచిత లైబ్రరీ ....

మంచినీరు ,కుర్చీలు ,రైటింగ్ ప్యాడ్స్ ,వైఫై ,కరెంటు అంతా ఉచితమే ...

ఉదయం 6 A M నుండి రాత్రి 10 P M దాకా ఉంటారు ...మనసున్న

మనిషిగా నాకు చేతనైన సాయం నిరుద్యోగ మిత్రులకు చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి.

28 views0 comments
bottom of page