top of page

వారం వారం బహుమతులు జూలై 2023


Weekly Prizes - Vijayadasami 2023 Story Competition And Ugadi 2024 Serial Novel Competition By manatelugukathalu.com

మనతెలుగుకథలు.కామ్ వారి వారం వారం బహుమతులు జూలై 2023, విజయదశమి 2023 కథల పోటీలు ఇంకా ఉగాది 2024 నవలల పోటీలు

విషయ సూచిక

1 .బహుమతులకు సహకరిస్తున్న వారు ( Contributors To Prizes )

2. విజయదశమి 2023 కథల పోటీలు

3. ఉగాది 2024 నవలల పోటీలు

4. July 2023 NON STOP PRIZES ( జూలై 2023 వారం వారం బహుమతులు ) విజేతల వివరాలు

5. రచయితల ప్రొఫైల్స్

6. కొత్త రచయితల సమాచారం కోసం...


1 .బహుమతులకు సహకరిస్తున్న వారు:

వారం వారం ఒక కథకు బహుమతి చొప్పున నెలకు నాలుగు కథలకు బహుమతులు అందించాలనేది మా ఉద్దేశం. కానీ ఎక్కువమంది రచయితలను ప్రోత్సహించాలనే ఆశయంతో, చక్కటి కథలు ఎక్కువగా రావడంతో నిర్వహణ వ్యయం అధికమవుతున్నా దాదాపు ప్రతి నెలా చాలా కథలను బహుమతులకు ఎంపిక చేస్తున్నాము. బహుమతుల వితరణలో భాగస్వాములు దొరికితే ఈ బహుమతుల సంఖ్యను, బహుమతుల మొత్తాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుంది. మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే ప్రతి కథకు బహుమతి అందేలా చేయాలన్నదే మా సంకల్పం.


రూ: 3000/- చెల్లించడం ద్వారా ఒక సంవత్సరం పాటు ప్రతి నెలా ఒక కథకు బహుమతిని మీరు స్పాన్సర్ చేయవచ్చు. విజేతను మీరే ఎంపిక చేయవచ్చు.


వివరాలకు story@manatelugukathalu.com కి మెయిల్ చేయండి.

ఈ విషయంగా మేము గతంలో చేసిన విజ్ఞప్తికి స్వచ్చందంగా ప్రతిస్పందించిన వారి వివరాలు తెలియజేస్తున్నాము.


*శ్రీ బివిడి ప్రసాద రావు గారు ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.

*శ్రీమతి పెండేకంటి లావణ్య కుమారి గారు తమ దివంగత మాతృమూర్తి శ్రీమతి పెండేకంటి లక్ష్మీపద్మావతమ్మ గారి జ్ఞాపకార్థం ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.


2. విజయదశమి 2023 కథల పోటీలు:

విజయదశమి 2023 కథల పోటీ బహుమతుల వివరాలు :

ఏకైక ప్రథమ బహుమతి రూ: 5000 /-

ఐదు ప్రత్యేక బహుమతులు ఒక్కొక్కటి రూ: 500 /-

మీరు నూతన రచయితలయినా, లబ్ద ప్రతిష్ఠులైన రచయితలైనా బహుమతులు పొందడానికి సమాన అవకాశాలు వున్నాయి. బహుమతుల ఎంపిక నిష్పక్షపాతంగా జరుగుతుంది. బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొనబడతాయి.

పూర్తి వివరాలకు, నియమ నిబంధనలకు క్రింది లింక్ క్లిక్ చేయండి.

https://www.manatelugukathalu.com/post/vijayadasami-2023-kathala-potilu-1662

3. ఉగాది 2024 సీరియల్ నవలల పోటీలు

ఏకైక ప్రథమ బహుమతి రూ: 15000 /-

మూడు ప్రత్యేక బహుమతులు ఒక్కొక్కటి రూ: 1000 /-

మీరు నూతన రచయితలయినా, లబ్ద ప్రతిష్ఠులైన రచయితలైనా బహుమతులు పొందడానికి సమాన అవకాశాలు వున్నాయి. బహుమతుల ఎంపిక నిష్పక్షపాతంగా జరుగుతుంది. బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొనబడతాయి.

పూర్తి వివరాలకు, నియమ నిబంధనలకు క్రింది లింక్ క్లిక్ చేయండి.

https://www.manatelugukathalu.com/post/ugadi-2024-telugu-serial-novel-competition-2005

4. July 2023 NON STOP PRIZES ( జులై 2023 వారం వారం బహుమతులు ) విజేతల వివరాలు:

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల మరిన్ని కథలను బహుమతులకు ఎంపిక చేశాము. రచయితలకు మా అభినందనలు తెలియజేస్తున్నాము.

( కథ చదవడానికి ఆ కథ పేరు మీద క్లిక్ చేయండి. రచయిత ప్రొఫైల్ చూడడానికి రచయిత పేరు మీద క్లిక్ చేయండి )

విజేతలను అభినందిస్తూ మెయిల్ చేశాము. e - ప్రశంసా పత్రాలు పంపించాము.

బహుమతి మొత్తాన్ని 22/08/2023 లోగా అందజేస్తాము.

4. రచయితల ప్రొఫైల్స్

రచయితలందరినీ వారి ప్రొఫైల్ లో లాగిన్ కమ్మని కోరుతున్నాం.

వారి వారి ప్రొఫైల్స్ ను తమ సన్నిహితులకు షేర్ చేసి ఫాలో కమ్మని కోరమని అభ్యర్థిస్తున్నాము. అందువల్ల మీ రచనలు పబ్లిష్ అయినప్పుడు అనుసరించిన వారికి నేరుగా సమాచారం అందుతుంది. కామెంట్ చెయ్యడం కూడా సులభమవుతుంది.

మీ కథలకు సంబంధించి మేము పంపే లింక్ లను వాట్సాప్ ద్వారా, మీ వ్యక్తిగత బ్లాగ్ ల ద్వారా మీ సన్నిహితులకు షేర్ చేసి వారి కామెంట్స్ కోరండి.

ప్రచురించే ప్రతి కథకు సంబంధించిన పోస్ట్ పేస్ బుక్ లో ఉంచుతున్నాము. మీ కథకు సంబంధించిన పోస్ట్ ను మీ పేస్ బుక్ పేజీ లో షేర్ చెయ్యండి.

అలాగే సాటి రచయితల ప్రొఫైల్స్ ను ఫాలో చెయ్యమని కోరుతున్నాం.

మనతెలుగుకథలు.కామ్ కి తరచుగా రచనలు పంపేవారు అరవై మందికి పైగా ఉన్నారు.

అప్పుడప్పుడు రచనలు పంపేవారు వంద మందికి పైగా ఉన్నారు.

రచయితలు సాటి రచయితల కథలను వీలునుబట్టి చదివి కామెంట్స్ పెడుతూ వుంటే వారికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

అన్ని రచనలు చదువుతూ, కామెంట్ చేసి ప్రోత్సహిస్తూ ఉన్న వారికి (ఉదాహరణకు పిట్టా గోపి, శ్రీపతి లలిత, సిరిప్రసాద్, పాండ్రంకి సుబ్రమణి మొదలైన వారికి ) మా అభినందనలు.

ఇప్పుడు రచయితలే కాక, పాఠకులు కూడా తమ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని లాగిన్ కావచ్చును.

5. కొత్త రచయితల సమాచారం కోసం...

కథల పోటీ కోసం ప్రత్యేకంగా రచనలు పంపనవసరం లేదు.

మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే కథలనుండి ప్రతి వారం కనీసం ఒక కథను ఉత్తమ కథగా ఎంపిక చేస్తాము.

అలా ఎంపిక చెయ్యబడ్డ కథలనుండి ఉగాది/విజయదశమి పోటీలకు బహుమతి కథ సెలెక్ట్ చేస్తాము.

అక్టోబర్ 2022 నుండి మార్చ్ 2023 వరకు ప్రచురితమై, వీక్లీ ప్రైజ్ కి ఎంపికైన కథలనుండి ఉగాది 2023 బహుమతులు ఎంపిక చెయ్యబడతాయి.

అలాగే ఏప్రిల్ 2023 నుండి అక్టోబర్ 2023 వరకు ప్రచురింపబడి, వీక్లీ ప్రైజ్ కి ఎంపికైన కథలనుండి విజయదశమి 2023 బహుమతులు ఎంపిక చేయబడతాయి.

ప్రతి నెల వారం వారం బహుమతులకు ఎంపికైన కథల వివరాలు మనతెలుగుకథలు.కామ్ లో మరుసటి నెల 15 వ తేదీ ప్రచురిస్తాము.

ఉగాది కథల పోటీ 2023 గడువు 20 /03 /2023 తో ముగుస్తోంది.

కాబట్టి 21 /03 /2023 నుండి మాకు చేరే కథలు విజయదశమి 2023 కథల పోటీకి పరిశీలింపబడతాయి.

కేవలం మేము పంపే లింక్ ల ద్వారానే మనతెలుగుకథలు లో కథలు చదవాల్సిన అవసరం లేదు.

మీ బ్రౌసర్ లో www.manatelugukathalu.com అని టైపు చేస్తే మా వెబ్ సైట్ చేరుకోవచ్చు. మీకు నచ్చిన కథలు ఉచితంగా చదువుకోవచ్చు.

ప్రచురింపబడే అన్ని కథలను మా యూట్యూబ్ ఛానల్ లో ఉంచుతున్నాము.

మా యూట్యూబ్ ఛానల్ ఉచితంగా సబ్స్క్రయిబ్ చేసుకొని ఆ కథలను వినవచ్చు.

https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


మీ రచనలు మాకు పంపవలసిన చిరునామా story@manatelugukathalu.com

మనతెలుగుకథలు.కామ్ రచయితల కోసం మేము ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ లో చేరడం ద్వారా ప్రతి పోస్ట్ తాలూకు లింక్ లు తెలుసుకోవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ పాఠకులకు, రచయితలకు మరొకమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.

వెబ్ సైట్ లింక్

www.manatelugukathalu.com

మా ఫేస్బుక్ పేజీ లింక్

https://www.facebook.com/ManaTeluguKathaluDotCom

మా యూట్యూబ్ ఛానల్ లింక్

https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

రచనలు పంపవలసిన మెయిల్ ఐ డి

story@manatelugukathalu.com

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


82 views1 comment
bottom of page