top of page

చీరలోని గొప్పతనం

#PittaGopi, #పిట్టగోపి, #Cheeralonigoppathanam, #చీరలోనిగొప్పతనం, #TeluguKathalu, #తెలుగుకథలు


Cheeraloni goppathanam - New Telugu Story Written By - Pitta Gopi

Published In manatelugukathalu.com On 01/07/2025

చీరలోని గొప్పతనం - తెలుగు కథ

రచన: పిట్ట గోపి


ఈ నూతన సమాజంలో అనేక నేరాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో ఒకటి మహిళల మీద జరిగే మానభంగాలు. కారణాలు అనేకమున్నా.. ఆడవాళ్లు వేసుకునే దుస్తులు విషయం కూడా ఒక కారణమని నేటికీ విశ్లేషకులు, మేధావులు అభిప్రాయపడుతూనే ఉంటారు. సనాతన సంప్రదాయాలకు, విలువలకు కట్టుబడి ఉండే మన భారతదేశంలో మహిళలు వేసుకునే దుస్తులపై ఎటువంటి వివాదాలు లేకపోయినా.. కొందరు మహిళలు తాము ధరించే దుస్తులు విషయంలో రాను రాను దిగజారిపోతుంటారు. ఈ విషయంలో సెలబ్రిటీలు ముందు వరుసలో ఉన్నప్పటికీ మిగతవారు కూడా తక్కువేం కాదు. అంతా ఫ్యాషన్ మహిమ. 


ఎంత పేదరికంలో ఉన్నా.. ! కోటీశ్వరులు అయినా.. ! ఆడది తన ఒంటిని పూర్తిగా కప్పుకునే దుస్తులు ధరించాలి. ఆ దుస్తులు పేరే "చీర". 


చీరలో ఉన్న గొప్పతనం, అందం, సౌందర్యం, సహజ ఆక్రృతి ఈ ప్రపంచంలో మరెక్కడా లేదని పిట్ట. గోపి అనే రచయిత ఎన్నో కవితలు రాశారు. 


ఒంటికి కప్పుకోలేని వస్త్రం వీధల్లా పరుచుకుని ఏం లాభం అని సమాజానికి ఒక సందేశం కూడా ఇచ్చారాయన. ఈ విషయాలేమి నాకు తెలియక ముందు జరిగిన ఒక సంఘటనను మీ ముందు పెడుతున్నాను. 


నా పేరు శ్రీదేవి. మన దేశంలోనే అతి పెద్ద ఆర్ధికవేత్తల్లో నా తండ్రి ఒకరు. ఆయన ప్రపంచ పర్యటనలు చేస్తుంటారు. ఆ కారణంతో పాటు నా చదువు అమెరికాలో సాగటంతో నాకు చీర అంటేనే లెక్కలేదు. మా అమ్మ భారత్ లో ఉన్నా కూడా ఏనాడు చీర ధరించినట్టు నేను చూడలేదు. 


భారత్ లో ఉన్నా.. అమెరికాలో ఉన్నా.. లండన్ లో ఉన్నా.. అసలు ఏ దేశంలో ఉన్నా.. నాకు తెలిసింది ఒక్కటే. నా అందాలు కనిపించేలా కాంతివంతమైన నా శరీరం పరులు చూసి పొగిడెలా లేదా ఆశ్చర్యపడేలా చేయటమే నాకు తెలుసు. నాకు రకరకాల ఫ్యాషన్ డిజైన్స్ అంటే ఇష్టం. నా ఖర్చులో సగం కంటే ఎక్కువ ఇలాంటి దుస్తులు కోసమే ఖర్చు చేస్తుంటా. వేసుకున్న దుస్తులే మళ్ళీ వేసుకోవల్సి వచ్చినప్పుడు.. అందంగా ఉన్నానా లేదా.. అనే నాలో నేను ప్రశ్నించుకుంటాను. 


అమెరికాలోనే నేను చదువుకున్న కాలేజీలో భారత్ కే చెందిన మాకు దగ్గర్లోనే నివాసం ఉండే అశోక్ అనే యువకుడు నాకు పరిచయం అయ్యాడు. చదువులో ఫస్ట్. ఆందంలో ఫస్ట్. చూడ్డానికి హ్యాండ్సమ్ గా ఉంటాడు, మంచి వ్యక్తిత్వం, అన్నీంటికి మించి అమ్మాయిల జోలికి వెళ్ళడు, అసలు వాళ్ళని పట్టించుకోడు. నాతో చాలా సరదాగా ఉంటాడు. బహుశా నాది కూడా భారత్ హే కదా అని నా అనుమానం. అంతే తప్ప మరో కారణం ఉండదనుకుంటా. నేను మాత్రం అశోక్ కి పడిపోయాను. అతడితో క్లోజ్ పెంచుకోవాలని చూస్తుంటాను. ఎలాగైనా అశోక్ ని పెళ్ళి చేసుకోవాలని నా ఆలోచన. నాన్నకు చెబితే ఏది కావాలన్నా తెచ్చి పెట్టే రకం. అందుకే తప్పకుండా ఈ విషయం నాన్నకు చెబితే అశోక్ నా సొంతం అవ్వటం ఖాయం అనుకున్నా. 


మా చదువులు పూర్తి అయిపోయాక అశోక్ భారత్ బయలుదేరుతున్నాడని తెలిసి నేను కూడా పక్కా ప్లాన్ తో అశోక్ ఫ్లైట్ కే టికెట్ బుక్ చేసుకున్నాను. అంతా అనుకున్నట్టు మేం ఇంటికి చేరిపోయాం. ఇక నా మనసు ఎంతకి ఆగకపోవటంతో అశోక్ విషయం నాన్నకు చెప్పాను. వెంటనే నాన్న అశోక్ తండ్రితో మాట్లాడ్డం అశోక్ తండ్రి ఒప్పుకుని నన్ను అడగటానికి మా ఇంటికి రావటం జరిగిపోయింది. 


ఆ రోజు అశోక్ ని నా దుస్తులతో ఎలాగైనా ఆకర్షించాలని నా శరీరం కనపడేటట్లు తెల్లని శరీరానికి అమెరికా ఫ్యాషన్ మోడల్ నల్లని దుస్తులు ధరించి వచ్చాను. 


ఏమైందో ఏమో అశోక్ నన్నే కాదు అక్కడ ఉన్నవాళ్ళందరికి షాక్ ఇచ్చేలా మా వంట గదిలో ఉన్న పనిమనిషిని చేసుకుంటాను అన్నాడు. నా గుండె పగిలింది. నా పరువుపోయింది. ఇన్నాళ్లు ఎంతో అందగత్తెనని రోజుకో డ్రెస్ కోసం కోట్లు ఖర్చు చేసిన నేను నాకు కాబోయే మొగుడికి ఆకర్షించలేకపోయానే అని బాధ 


ఆ రాత్రి నేను భోజనం చేయలేదు. నా ఆలోచన అంత నన్ను రిజెక్ట్ చేశాడనే బాధ కంటే పనిమనిషిని ఇష్టపడిన విధానం. తెల్లారింది ఏనాడు వంటగదిలోకి వెళ్ళని నేను వంటగదిలోకి వెళ్ళాను. పనిమనిషి వంట చేస్తుంది. ఆమెను తదేకంగా చూశాను. పనిమనిషే అయినా.. నల్లగా ఉన్నా.. చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది. కారణం ఆమె చీర కట్టుకుంది. చింపిరిగా ఉన్న జుట్టు, మెకప్ లేని ముఖం, అయినా ఆ ఒక్క చీరే ఆమె అందాన్ని విరజిమ్ముతుంది. అందుకే బహుశా అశోక్ నన్ను రిజెక్ట్ చేశాడని బలంగా నమ్మాను. 


ఇక ఆలస్యం చేయకుండా మంచి మంచి చీరలు కొని ఇంటికి తెప్పించి అందులో ఒకటి సెలక్ట్ చేసుకొని, వేసుకొని అశోక్ ఇంటికి వెళ్ళాను. చీరలో నన్ను చూసిన అశోక్ కళ్ళార్పకుండా చూడటంతో నా ఆనందానికి అంతే లేదు. ఏనాడూ అమ్మాయిల వైపు అదో రకంగా చూడని అశోక్ వేగంగా మెట్లు దిగి వచ్చి స్వారి చెప్పాడు. నిన్ను చూడ్డానికి మళ్ళీ వస్తాం మీ అమ్మానాన్నకు చెప్పమని చెప్పాడు. 


అంతే.. ఇన్నాళ్లు ఫ్యాషన్ మోజులో బంగారంలాంటి చీరను మర్చిపోయా. అమెరికాలో కూడా ఈ చీర ధరించి ఉంటే ఎంత బాగున్నో.. అని నా మనసులో అనుకున్నాను. ప్రతి ఆడదానికి అందం ఆస్తులు, అంతస్తుల్లో ఉండదు చీరలోనే ఉంటుంది. నాన్న వ్యాపార కార్యక్రమంలో అయినా.. ఇంకెక్కడా అయినా.. నేను చీరనే ధరించి వెళ్తున్నాను. నా అందం చూసి ఎప్పుడు నైటీలు, చూడీదర్ లు వేసే అమ్మ కూడా చీరలు కడుతుంది. ఇప్పుడు మెకాప్ కాస్త తగ్గించాను. ఎందుకంటే సహజంగా చీర తెచ్చిన అందం ఉంది కనుక. పెళ్లి అయినాక చీరలో గొప్పతనం అమెరికాలో చెప్పటానికి, చూపించటానికి రెండు నెలలు ఉండి వద్దామని అశోక్ కి చెప్పాను. నా దేశం, మగువ గొప్పతనం చీరలోనే ఉంది. చచ్చినా.. చీరను మిస్ కాను. 


 ***** ***** ***** ***** *****


పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )

Profile:

Youtube Playlist:

నా పేరు పిట్ట.గోపి నేను శ్రీకాకుళంలో అంబేద్కర్ యూనివర్సిటీలో ఎం ఏ సోషల్ వర్క్ పూర్తి చేశాను. నాకు సమాజాన్ని,సమాజంలో మనుషులను గమనించటం అలవాటు. ముఖ్యంగా సమాజంలో జరిగే ఏ చిన్న మంచి-చెడులనైనా.. మంచి కథలుగా మలచటంలో నాకు నేనే సాటి.వ్రృత్తిరిత్య నేను వ్యవసాయ కుటుంభంలో మద్యతరగతికి చెందిన వ్యక్తిని.ఇప్పటికే నేను రాసిన కథలు 90కి పైగా మన తెలుగు కథలు డాట్ కామ్ వెబ్సైట్ లో ప్రచూరితం అయ్యాయి.అలాగే ప్రతిలిపిలో కూడా నా కథలు అచ్చయ్యాయి. నా కథలు బహుమతులుకు ఎంపికకాకున్నా..(లాప్టాప్ లేదు) ఫోన్ లోనే టైపింగు చేయాలన్నా కథలు పంపాలనే ఆశక్తి తగ్గిపోతుంది. కానీ..! సమాజంలో జరిగే సంఘటనలకు అక్షరరూపం ఇచ్చి పదిమందికి తెలపాలనేదే నా అభిలాష. నా కథల్లో మంచి చెడులను పాఠకులు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం


Comments


bottom of page