చేయాలోయ్!
- Gadwala Somanna
- Aug 5
- 1 min read
#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #Cheyaloy, #చేయాలోయ్, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 104
Cheyaloy - Somanna Gari Kavithalu Part 104 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 05/08/2025
చేయాలోయ్! - సోమన్న గారి కవితలు పార్ట్ 104 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
చేయాలోయ్!
----------------------------------------
మనసులోని భావము
ఉపయోగమవ్వాలి
పదిమందికి క్షేమము
ఇల కలుగజేయాలి
పేదోళ్లకు న్యాయము
అందాలోయ్! తప్పక
కష్టాల్లో సాయము
చేయాలోయ్! మానక
బహు గొప్పది దానము
కడు మంచిది ధ్యానము
చేయాలోయ్! విసుగక
ఏమాత్రం విడువక
అవసరాన మౌనము
మితిమీరిన స్వార్ధము
కలుగజేయు నష్టము
ఇది అక్షర సత్యము

అమ్మ అభిలాష
------------------------
మొక్కలా ఎదిగేస్తూ
చుక్కలా ప్రకాశిస్తూ
బ్రతకాలోయ్! లోకంలో
ముందుండాలి జ్ఞానంలో
మువ్వలా రవళిస్తూ
గువ్వలా విహరిస్తూ
సాగాలోయ్! స్వేచ్ఛగా
ప్రకృతిని ఆస్వాదిస్తూ
పువ్వులా పరిమళిస్తూ
దివ్వెలా ఉపకరిస్తూ
నలుగురికి ఆదర్శం
పంచాలోయ్! ఆనందం
వినయాన్ని ప్రదర్శిస్తూ
విజయాలు సాధిస్తూ
పదిమంది మనసుల్లో
ఉండాలోయ్! జీవిస్తూ

రత్నాల సరాలు
---------------------------------------
విలువైన జీవితాన్ని
తీసుకోకు తేలికగా
మెరుగైన సమాజాన్ని
నిర్మించు ఉన్నతంగా
పొరుగు వారి లోపాలను
చెప్పకు బాహాటంగా
పనికిమాలిన నిందలు
వేయకు అనవసరంగా
గాజులాంటి మనస్కులు
మాట్లాడకు హేళనగా
అందరూ సమానులే
చూడరాదు చులకనగా
నడవరాదు ఎప్పుడూ
న్యాయానికి విరుద్ధంగా
ఉపయోగం లేకుండా
బ్రతక రాదు వ్యర్థంగా

సజ్జనుల చెలిమి కలిమి
--------------------------------------
సజ్జనుల సాన్నిహిత్యము
చేకూర్చును పలు మేలులు
వారితో సల్లాపము
మానసిక ఉల్లాసము
మంచోళ్ళతో సతతము
కల్గియుండాలోయ్ స్నేహము
లేకపోతే మాత్రము
అపారమైన నష్టము
వెదికి వెదికి వారితో
పెట్టుకోవాలి పొత్తు
అవుతుంది ఖచ్చితంగా
బంగారం భవిష్యత్తు
భువిలో మహోపకారులు
బహు ఆదర్శమూర్తులు
సజ్జనుల మార్గంలో
జాలువారును శుభములు

అమ్మ చెప్పిన పాఠాలు
--------------------------------------
అద్దంలా ఉండాలి
నీడలా మారాలి
ఏ బంధమైననూ
మేడలా కావాలి
పాటలా సాగాలి
తోట మేలు చేయాలి
కోట వోలె ఉంటూ
మాట విలువ పెంచాలి
కలం చేత పట్టాలి
ప్రజల భుజం తట్టాలి
జలంలా మారిపోయి
గొంతు కాస్త తడపాలి
కన్నోళ్లను చూడాలి
దైవాన్ని వేడాలి
ధైర్యాన్ని పెంచుకుని
పిరికితనం వీడాలి
-గద్వాల సోమన్న
Comments