top of page

చిన్నారులు

#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #Chinnarulu, #చిన్నారులు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 85


Chinnarulu - Somanna Gari Kavithalu Part 85 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 09/06/2025

చిన్నారులు - సోమన్న గారి కవితలు పార్ట్ 85 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


చిన్నారులు

----------------------------------------

దేవుడిచ్చిన బహుమతులు

చిన్నారులు ఇంటిలోన

ప్రకాశించే తారకలు

చూడంగా మింటిలోన


విరబూసిన కుసుమాలు

వారు సదనవనంలోన

కాంతులీను కాగడాలు

ఈ విశాల జగతిలోన


కళకళలాడును గృహములు

పసి పిల్లల సందడితో

చిందులేయును మనసులు

తీపి వారి పలుకులతో


రేపటి భారత పౌరులు

భారతమ్మ వారసులు

దేశభక్తి నేర్పిస్తే

వారే కదా సైనికులు















కన్నవారి హితవు

----------------------------------------

నిర్భయంగా జీవించు

మనస్ఫూర్తిగా ప్రేమించు

నిజాయితీని చూపించి

హృదయాలనే జయించు


ఆలసత్వమే త్యజించు

అహర్నిశలూ శ్రమించు

సాహసమే ఊపిరిగా

విజయాలను సాధించు


సత్యాన్నే నినదించు

ముత్యంగా భాసించు

నిత్యమూ ఉద్యమిస్తూ

రవి కిరణమై ఉదయించు


తల్లిదండ్రులను సేవించు

అదృష్టంగా భావించు

విస్తారమైన దీవెనలు

జీవితాన స్వీకరించు















చినుకులు కురియంగా

-----------------

చినుకులే కురియగా

మనసులే మురియగా

నలుదిక్కులా పచ్చిక

చేయునోయి వేడుక


మొలకలే హాయిగా

కొండంత స్వేచ్చగా

కనువిందే చేయును

నాట్యమే చేయగా


ప్రకృతిలో పచ్చదనం

అంతటా చక్కదనం

చూపరులకు పండుగ

పుడమికేమో కానుక


చినుకులు పడితేనే

రైతన్న హర్షించును

పుడమితల్లి తలపై

పూలై వర్షించును












ఫాయిదా ఏముంది!

----------------------------------------

కాంతిలేని త్రోవలో

శాంతిలేని బ్రతుకులో

ఫాయిదా ఏముంది!

కన్నీటి లోయలో


పూలులేని వనంలో

ప్రేమలేని మనసులో

ఫాయిదా ఏముంది!

స్థిరత లేని పలుకులో


సుఖం లేని మేడలో

కలతలున్న వాడలో

ఫాయిదా ఏముంది!

కల్లోల కడలిలో


ఇంతిలేని ఇంటిలో

చూపు లేని కంటిలో

ఫాయిదా ఏముంది!

మనసు లేని మనిషిలో












అమ్మ ఒడి మెత్తన

----------------------------------------

అమ్మ ఒడియే మెత్తగా

పువ్వు వోలె విచ్చగా

నవజాత శిశువులకు

అగునోయి పాన్పుగా


అమ్మ తొలి గురువుగా

మాటలే నేర్పగా

గృహం గుడి బడిలోన

ప్రేమలే పూయగా


సంతసం గుండెలో

స్వర్గమే బ్రతుకులో

అమ్మ నడుపు పథమున

ఆహ్లాదం మనసున


అమ్మ ఒక అద్భుతము

జాలువారే అమృతము

ఆమె లేక శూన్యము

చూడ వనవాసము


-గద్వాల సోమన్న


Comments


bottom of page