top of page
Original.png

చిరు నవ్వుల తొలకరి

#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ChiruNavvulaTolakari, #చిరునవ్వులతొలకరి, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 102


Chiru Navvula Tolakari - Somanna Gari Kavithalu Part 102 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 31/07/2025

చిరు నవ్వుల తొలకరి - సోమన్న గారి కవితలు పార్ట్ 102 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


చిరు నవ్వుల తొలకరి

----------------------------------------

చిరు నవ్వుల చినుకుల్లో

రోజు రోజు తడవాలి

అవి రువ్వే సొగసుల్లో

దివ్యంగా వెలగాలి


పదిమందిని నవ్విస్తూ

ఆయుష్షును పెంచాలి

అనారోగ్యం తరిమేస్తూ

ఆరోగ్యం పంచాలి


ఒక వరం దరహాసము

జీవితాన మధుమాసము

నవ్వు విరియని ముఖములు

చమురు లేని దీపములు


ఖర్చు లేనివి నవ్వులు

గుబాళించే పువ్వులు

పోయేది ఏమీ లేదు

నవ్వు లేక వెలుగురాదు

వదన వనములు తావులు


ree



















నిజమైన స్నేహితుడు

------------------------

జీవితాన భరోసా

అడుగునోయి కులాసా

అతడే అతడే మిత్రుడు

అందరి కన్నా ముఖ్యడు


ఆపదలో సహకారం

అహర్నిశలు మమకారం

చూపువాడే స్నేహితుడు

తలపెట్టడు అపకారం


వెన్నంటి ఉండువాడు

అనారోగ్యం వేళలో

కన్నీరు తుడుచువాడు

కష్టనష్టాల కొలిమిలో


అవకాశవాది కాడు

వెటకారమే చేయడు

మిత్రునికి మించినోడు

విశ్వంలోనే లేడు


తనకున్న దానిలోనే

సహాయం చేయువాడు

కష్టం విన్న వెంటనే

క్రొవ్వొత్తిలా కరుగువాడు


బాధల్లో భాగస్వామి

మేలి గుణమున్న అసామి

నిజమైన స్నేహితుడు

వెన్నుపోటే పొడవడు

ree




















నిప్పు కణికలు

---------------------------------------

ఎదుటి వారి తప్పులను

క్షమించగలవాడు

అత్యంత బలవంతుడు

మేటి గుణమున్నోడు


భ్రమించే మనసును

జారిపోయే మాటను

అదుపులో ఉంచువాడు

చూడంగా వీరుడు


అదుపు తప్పు తలపులను

హేయమైన గుణములను

సరిచేసుకున్నవాడు

మహిలో మహనీయుడు


మితిమీరిన వాంఛలను

పనికిమాలిన పనులను

మానుకున్న వాడే!

జీవితాన రేడే!

ree















విలువైనది జ్ఞానము

--------------------------------------

జీవితాన జ్ఞానము

ఎంతైనా ముఖ్యము

పరికింప వెలలేనిది

ఇల అమూల్యమైనది


లేకుంటే జ్ఞానము

చూడంగా శూన్యము

తెస్తుంది గౌరవము

తరుము అంధకారము


ఘనమైనది జ్ఞానము

ఇవ్వాలోయ్ ప్రథమము

ఎక్కించును అందలము

మార్చుకోయ్ జీవితము


అంతులేని జ్ఞానము

ఆర్జించుము అమితము

నిలబెట్టును నామము

ఇచ్చును అగ్ర స్థానము

ree















సాటిలేని స్నేహము

--------------------------------------

వెలలేనిది స్నేహము

కలనైనా మరువకు

బలమైనది తెలుసుకో

ఫలభరితం చేసుకో


కలిమి కన్న గొప్పది

చెలిమి చాలా మంచిది

తెలివి కల్గి మసలుకో

విలువ ఇవ్వ నేర్చుకో


సాటిలేని స్నేహము

దేవుని బహుమానము

చేయరాదు మోసము

స్మరించుకో సతతము


సృష్టిలోనే అందము

పరిమళించు గంధము

ఘనం మైత్రి బంధము

అక్షరాల సత్యము


-గద్వాల సోమన్న

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page