top of page
Original_edited.jpg

చివరి కోరిక - పార్ట్ 4

  • Writer: Madduri Bindumadhavi
    Madduri Bindumadhavi
  • 2 hours ago
  • 3 min read

#MadduriBindumadhavi, #మద్దూరిబిందుమాధవి, #ChivariKorika, #చివరికోరిక, #TeluguWebSeries

ree

Chivari Korika - Part 4 - New Telugu Web Series Written By Madduri Bindumadhavi Published In manatelugukathalu.com On 18/11/2025

చివరి కోరిక - పార్ట్ 4 - తెలుగు ధారావాహిక

రచన: మద్దూరి బిందుమాధవి 

ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత

జరిగిన కథ:

'శాంతి మహిళా సేవా సంస్థ' వార్షికోత్సవం లో తన జీవిత గమనం గురించి చెబుతూ ఉంటుంది సుందరి. మెడికల్ చెకప్స్ లో ఆమె భర్త సత్యానికి ప్రాణాంతకమైన వ్యాధి ఉందని తెలుస్తుంది. సుందరికి ఆసరాగా ఉన్న మరిది విశ్వాన్ని దూరంగా ఉంచమంటారు బంధువులు. 

ఇక చివరి కోరిక - పార్ట్ 4 చదవండి.


సుందరికి ముప్పయ్యేళ్ళు నిండలేదు...ఆ వయసులో అన్ని సౌభాగ్యాలకి తనెందుకు దూరం కావాలి? పైగా ఆడపిల్ల పుట్టినప్పటినించీ పువ్వులు, గాజులు, కుంకుమ ధరించి కళ కళ లాడుతూ ఉంటుంది. అవి స్త్రీ జీవితం లోకి పెళ్ళితో వచ్చినవి కావు...భర్త చనిపోతే తీసెయ్యటానికి....అనేది సత్యం అభిప్రాయం. 


అందుచేత తను భౌతికంగా ఈ ప్రపంచంలో లేకున్నా... భార్య సౌభాగ్యానికి దూరం కాకూడదని..మంచి చీరలు కట్టుకుని, మొహాన బొట్టు పెట్టుకుని, తల్లో పువ్వులు పెట్టుకోవాలని సుందరి చేత ఒట్టేయించుకున్నాడు, సత్యం. 


క్యాన్సర్ తో బాధపడుతున్న సత్యం కాలం చేసి ఆరు నెల్లు అయింది. పుట్టినింటికి వెళ్లి నెల రోజులు ఉండి వచ్చేసింది. ఎప్పటికీ తమ దగ్గరే అట్టే పెట్టుకుని, కూతురిని ఆమె పిల్లలనీ పోషించే ఆర్ధిక స్థోమత, ధైర్యం ఆమె తల్లిదండ్రులకు లేదు. 

భర్త ఉన్నన్నాళ్ళు పిల్లల పనులు, బయటి పనులు అన్నీ తనే చూసేవాడు. 


ఇప్పుడు జీవన సమరంలోకి దూకక తప్పని సుందరి.. విశ్వం సాయంతో  బయటికెళ్ళి పిల్లల స్కూల్ అవసరాలు, ఇంటికి కావాసిన సరుకులు తెచ్చుకోవటం మెల్లిగా నేర్చుకుంటున్నది. అందు నిమిత్తమై విశ్వం తో స్కూటర్ మీద బయటికెళుతుంటే బయటివాళ్ళు సరే, అత్తగారు కూడా అదో మాదిరిగా చూడటం తట్టుకోలేకపోయేది సుందరి. 


తను బయటికి రావటం ఆలస్యం..తన ముఖం చూడవలసి వస్తుందనో ఏమో పక్కింటి వారు తలుపేసుకోవటం సుందరిని బాధించేది. బహుశా తన అందానికి.. చపలచిత్తులైన వారి మగవారు ఆకర్షితులౌతారనే భయం కూడా అంతర్లీనంగా వారికి ఉండచ్చు అనుకునేది సుందరి. 

పబ్బుల చుట్టూ తిరగడమే నాగరికతగా భావించే ఇరవై ఒకటో శతాబ్దపు అత్యంత నాగరికులు కూడా.. బతికి చెడిన ఒక స్త్రీ విషయంలో మాత్రం పదిహేనో శతాబ్దంలో లాగే ఆలోచించగలరు. అదే  దౌర్భాగ్యం. సుందరి ఒంటరిగా ఉన్నప్పుడు తన దురదృష్టానికి బాధ పడేది.


విశ్వం ఎప్పుడూ(తన వయసుతో నిమిత్తం లేకుండా) సుందరిలో ఒక వదిన్నే కాదు... అక్కని, తల్లిని అంతకు మించి ఒక దేవతని చూసేవాడు. "మనలో కల్మషం లేనప్పుడు ఎవరికీ భయపడక్కరలేదు. మనం భయపడుతున్నామని తెలిస్తే మన చుట్టూ ప్రపంచం మరింత భయపెడుతుంది" అని అశోక వనంలో సీతని ఊరడించిన "హనుమ" లాగా సమయం దొరికినప్పుడల్లా దగ్గర కూర్చుని ఓదార్చేవాడు. 

******

తెలిసీ తెలియని వయసులో చుట్టు పక్కల వాళ్ళు తన తల్లి -బాబాయి గురించి చెడుగా మాట్లాడుకోవటం విన్న రుద్ర నెమ్మదిగా తల్లి పట్ల ఏహ్య భావాన్ని పెంచుకున్నాడు. 

తల్లి ఏమైనా మంచి చెప్పటానికి ప్రయత్నిస్తే..."నా మంచేంటో నాకు తెలుసు. ముందు నువ్వు సరిగా ప్రవర్తించటం నేర్చుకో . నలుగురూ నీ  గురించి ఏమనుకుంటున్నారో ...ఎంత అసహ్యించుకుంటున్నారో తెలుసుకుంటే నాకు బుద్ధులు చెప్పే ప్రయత్నం చెయ్యవు" అని నోటికొచ్చినట్లు మాట్లాడేవాడు. 


విశ్వం తో చెప్పి బాధ పడేది. "ఇప్పుడు వాడిది చిన్న వయసు. పెద్దైతే వాడే తెలుసుకుంటాడులే వదినా" అని సర్ది చెప్పేవాడు. 

===============================================

                                                 ఇంకా వుంది..


                                      చివరి కోరిక - పార్ట్ 5 త్వరలో..

===============================================


మద్దూరి బిందుమాధవి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం :  ఎం బిందుమాధవి

నేను బ్యాంక్ ఆఫీసర్ గా 32 సం లు ఉద్యోగం చేసి, పదవీ విరమణ చేశాక దాదాపు అరవయ్యేళ్ళ వయసులో కథలు వ్రాయటం ప్రారంభించాను. సామెతలు, శతక పద్యాల మీద ఎక్కువ కథలు వ్రాశాను.

సరదాగా కాలక్షేపానికి ప్రారంభించిన వ్యాపకం.. ఇష్టంగా మారటానికి, ప్రచురణ కర్తల ప్రోత్సాహం, పాఠకుల స్పందనే కారణం. మీ ప్రోత్సాహం ఇలాగే కొన సాగగలదని ఆశిస్తూ.. మీ కందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.


ree



ree



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page