top of page

క్రికెట్ పిచ్చోళ్ళు


'Cricket Pichhollu' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 16/11/2023

'క్రికెట్ పిచ్చోళ్ళు' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


నాలుగేళ్ళకు ఒకసారి వచ్చే వరల్డ్ కప్ కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు.. ఆ సమయం రానే వచ్చేసింది. ఎప్పుడూ ఆడినట్టుగానే చాలా బాగా ఆడుతోంది ఇండియా. ఇంకా చెప్పాలంటే, చాలా చాలా సూపర్ గా ఆడుతోంది ఇండియా..


రాధా, రోజా ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అంతకు మించి, క్రికెట్ కి వీర అభిమానులు. ఎప్పుడూ టీవీ లో ఏ మ్యాచ్ వచ్చినా, అదే పని గా టీవీ కి ఇద్దరు అతుక్కుపోతారు. ఇంట్లో వారు ఎన్ని మాటలు అన్నా, పట్టించు కునేదే లేదన్నట్టుగా క్రికెట్ ని చూస్తారు. మధ్యలో టైం పాస్ స్నాక్స్, డ్రింక్స్, కాఫీ అన్నీ మాములే. క్రికెట్ మ్యాచ్ లో డ్రింక్స్ బ్రేక్ వస్తే, ఇక్కడ వీళ్ళు కుడా డ్రింక్స్ బ్రేక్ తీసుకుంటారు. అందుకే, ఫ్రిజ్ నిండా, డ్రింక్ బాటిల్స్ ఉండాల్సిందే మరి!


ఇండియా మ్యాచ్ ఉన్నప్పుడైతే... దేవునికి కొబ్బరికాయి కొట్టడము, పూజలు చెయ్యడము, భీకరంగా గోల చెయ్యడం షరా మాములే. పాపం.. మ్యాచ్ స్టేడియం లో చూడడానికి మాత్రం, ఇంట్లో 'నో' చెప్పేవారు. నాలుగేళ్ళకొకసారి వచ్చే వరల్డ్ కప్ కి అయితే పూనకాలే ఇద్దరికీ. పందాలు వేసుకుని మరీ క్రికెట్ చూస్తారు. ఓడినవారు, మర్నాడు మొత్తం స్నాక్స్ స్పాన్సర్ చెయ్యాలనే రూల్ పెట్టుకున్నారు.


ఇంట్లో... పెళ్ళి చేస్తే.. దారిలోకి వస్తారేమో అనుకున్నారు. పెళ్ళి సంబంధాల వేట మొదలెట్టారు. పెళ్ళికి.. రాధా ఇంకా రోజా ఇద్దరూ ఇంట్లో ఒక కండిషన్ పెట్టారు. 'పెళ్ళి కొడుకు క్రికెట్ ప్లేయర్ కానవసరం లేదు గానీ, పిచ్చి క్రికెట్ ఫ్యాన్ అయి ఉండాలి... భార్య తో పాటు క్రికెట్ ని పిచ్చి పిచ్చి గా చూసి ఎంజాయ్ చెయ్యాలి!'


ఎన్ని సంబంధాలు చూసినా, క్రికెట్ అంటే అభిమానించే అబ్బాయిలు ఉన్నారు గాని, పిచ్చిగా ప్రేమించేవారే దొరకట్లేదు. తమ పిల్లలకి పెళ్ళి అవదేమో నని.. తల్లిదంద్రులకి బెంగ పట్టుకుంది.


"రాధా! మా ఇంట్లో చాలా బెంగ పెట్టుకున్నారు.. నా పెళ్ళి గురించి. మనకి కావాల్సిన క్రికెట్ పిచ్చోళ్ళు ఎక్కడా దొరకట్లేదంట!.. "


"రోజా! మా ఇంట్లో కుడా అదే పరిస్థితి.. "


"ఎందుకంటావు రాధా?"


"మనమేమైనా అప్సరసలమా చెప్పు! అబ్బాయిలు వెంటనే ఒప్పుకోవడానికి! ఇంకొకటి మగవాళ్ళలో చాలా మంది సంపాదనలో పడితే, మునుపు వారికి ఈ క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇప్పుడు ఉండదే!"


"పెళ్ళైతే, అది ఇంకా తగ్గుతుందేమో?" అడిగింది రోజా


"మనం తగ్గనిస్తామా చెప్పు! మొగుడిని మన చుట్టూ తిప్పుకోమూ.. అప్పుడు వాళ్ళే చచ్చినట్టు మనతో క్రికెట్ చూస్తారు.. క్రికెట్ ఆడమన్నా అడతారు!... ఏది చెయ్యమంటే అది చేస్తారు.. అదే పెళ్ళానికి ఉన్న పవర్ కదా!"


"అవుననుకో!"


"పేరెంట్స్ కోసం మనం తొందరిగా పెళ్ళి చేసుకోవాలే రాధా!"


"ఒక పని చేద్దాం... మనమే నచ్చిన అబ్బాయిలకు ఇంటర్వ్యూలు పెట్టి... ఓకే అయితే.. వాళ్ళని సెలెక్ట్ చేసి పెళ్ళి చేసుకుందాం.. "


"అలాగే కానీ... తొందరగా.. పెళ్ళి చేసుకుని... ఆ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ మాత్రం మొగుడితో స్టేడియం లో చూడాలి... !"


"నీ టేస్ట్ సూపరే రోజా!"


పెళ్ళి చూపులలో క్రికెట్ మీద అప్పటివరకు అయిన వరల్డ్ కప్ కు సంబంధించిన ప్రశ్నలు తయారు చేసి.. పెళ్ళి చూపులలో అబ్బాయిని అడిగి సెలెక్ట్ చేసుకున్నారు.. ఇద్దరు ఫ్రెండ్స్"


"మీరు నాకు బాగా నచ్చారు.. మీకు కుడా నా లాగే క్రికెట్ అంటే పిచ్చి అని తేలిపోయింది. కానీ, నాకొక కోరిక ఉంది" అడిగింది పెళ్ళికొడుకుని


"చెప్పండి మిస్ రోజా!"


"మా ఫ్రెండ్ రాధా కి మన లాగే క్రికెట్ అంటే పిచ్చి. దానికి మీలాంటి అబ్బాయి తోనే పెళ్ళి ఫిక్స్ అయ్యింది. మా ఫ్రెండ్స్ ఇద్దరమూ.. మా పెళ్ళిళ్ళు అయిన తర్వాత... భర్తలతో కలిసి.. వరల్డ్ కప్ క్రికెట్ టూర్స్ చెయ్యాలని అనుకున్నాము!"


"అలాగే!"


"అయితే! ఇప్పుడు జరుగుతున్న వరల్డ్ కప్ తోనే మన టూర్ స్టార్ట్ చేద్దాం మరి!"


*****

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ


57 views0 comments
bottom of page