దేశం కోసం
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- Jun 3
- 3 min read
#DesamKosam, #దేశంకోసం, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #పిల్లలకథలు, #TeluguChildrenStories, #సైనికకథ

Desam Kosam - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 03/06/2025
దేశం కోసం - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
అమ్మా ! నేషనల్ డిఫెన్స్ అకాడమీ సెలక్షన్ కి యు. పి. యస్. సి నోటిఫికేషన్ వచ్చిందే. నా గ్రాడ్యుయేషన్ అయిపోయిందిగా. నేను తాతయ్య, నాన్నలా ఆర్మీలో చేరి దేశసేవ చేస్తాను. గత సంవత్సరం దేశ సరిహద్దు లడాక్ గాల్వాన్ లోయ వద్ద చైనా సైనికులతో ఘర్షణలో నాన్న అతి దారుణంగా చంపబడి అమర వీరుడిగా ఇంటికి వచ్చారు. సైనిక లాంఛనాలతో ఎంతో గౌరవం కలిగింది ఆయనకు. ఆ సంఘటన ఇప్పటికీ నా మనసులో మెదులుతోంది.
1962 సం. లో స్నేహమంటూనే దేశ సరిహద్దుల్లో చైనా సైన్యం దాడిలో తాతయ్య కాలు పోగొట్టుకుని వికలాంగుడిగా సైన్యం నుంచి పదవీ విరమణ చెయ్యవల్సి వచ్చింది. ఉన్న ఒక్క కొడుకును చదువు లేనందున కింది స్థాయి సైనికుడిగా ఆర్మీకి పంపితే నాన్న హవల్దార్ ర్యాంక్ వరకు చేరుకున్నారు. నన్ను డిగ్రీ చదివించి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేర్పించి సైనిక ఆఫీసర్ హోదాలో చూడాలనుకునే వారు. నేను ఆయన కళ్ల ముందే సైనిక కుటుంబ వాతావరణంలో పెరిగిన వాడిని. నాకూ ఆర్మీలో ప్రవేసించి దేశసేవలో జీవితం గడపాలని ఉండేది. నాకు ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. తాతయ్య, నాన్నలా నా కర్తవ్యం కొనసాగిస్తాను" గౌతంకుమార్ తల్లికి తన కోరిక చెప్పేడు.
"వద్దురా బాబూ, మిలిటరీ జీవితమంటేనే భయమేస్తోంది. దిన దిన గండం ఎప్పుడు చావు ముంచుకొస్తుందో తెలియదు. దేశ సరిహద్దుల్లో పోస్టింగు అయినందున మీ నాన్న శలవులో వచ్చి మనతో గడిపి డ్యూటీకి వెళ్లిన కొద్ది రోజుల్లోనే ఆయన శత్రు సైనికుల కాల్పుల్లో చనిపోయారన్న పిడుగులాంటి వార్త వినవల్సి వచ్చింది. ఉన్న ఒక్కడివి నువ్వూ ఆర్మీకి పోతానంటే దిగులుగా ఉంది. " అమర జవాను మాజీ హవల్దార్ వేణుగోపాల్ భార్య దేవకి కొడుకుతో అంది.
"అమ్మా, నాన్న గారి కోరిక నెర వేరుస్తాను. ఆర్మీలో చేరి ఆఫీసర్ గా దేశసేవ చేస్తాను. సైనికుడంటేనే సాహసం. చావు ఎక్కడైనా రావచ్చు. చావుకు భయపడితే దేశ రక్షణ దళాల్లో ప్రవేసించే దెవరు? నన్ను ప్రోత్సహించి ఆశీర్వదించు " తల్లిని వేడుకున్నాడు గౌతంకుమార్.
చేసేది లేక దిగులుగానే ఒప్పుకుంది దేవకి. ఆనవాయితీ ప్రకారం అప్లికేషను నింపి ఇంటర్వ్యూకి అటెండై అన్ని ఎగ్జామ్స్ లో పాసయి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ప్రవేశం పొందాడు గౌతంకుమార్.
ముందుగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఖడక్ వల్స(పూణె) లో మిలిటరీ ట్రైనింగ్ పూర్తయి ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ లో గ్రాడ్యుయేషన్ పొంది అన్ని ఈవెంట్స్ లో బెస్టు కేడెట్ గా ఆర్మీ జనరల్ చేతుల మీదుగా షీల్డ్ తీసుకున్నాడు ఆర్మీ లెఫ్టినెంట్
గౌతంకుమార్.
మాజీ హవల్దార్ వేణుగోపాల్ భార్య వీరనారి దేవకిని ఎంతో ఆదరణగా వి. ఐ. పి ల గ్యాలరీలో కూర్చోబెట్టి ఘనంగా సత్కరించారు ఆర్మీ అధికారులు.
తన కొడుకును హోదా గల ఆఫీసర్ గా చూసి మురిసి పోయింది దేవకి.
' మేరా భారత్ మహాన్'
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
Commentaires