top of page

దెయ్యాలు వస్తున్నాయి పక్కకు తప్పుకోండి!

( సంక్రాంతి సరదా కథ )


'Deyyalu Vasthunnayi Pakkaku Thappukondi' - New Telugu Story Written By Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 28/12/2023 

'దెయ్యాలు వస్తున్నాయి పక్కకు తప్పుకోండి' తెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



నిరంజనరావు.. అప్పారావు గురుశిష్యులు. 


 ఆరోజు ఆదివారం.. అమావాస్య.. రాత్రి 10 గంటలు!


నిరంజనరావు పేపర్ విలేఖరి.. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు స్మశానం లో ప్రవేశించి దెయ్యాల మీద పరిశోధన చేయడానికి అక్కడికి దగ్గరలో ఉన్న బ్రిడ్జి కింద పాడుపడిన బల్లమీద కూర్చుని వెయిట్ చేస్తు న్నాడు, తన శిష్యునితో సహా. 


''గురువుగారూ! మీకు క్రిస్మస్, న్యూ ఇయర్, భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు ఏక మొత్తంగా.. హోల్ సేల్ గా అందిస్తున్నాను తీసుకోండి 

సార్, '' అన్నాడు గురువుగారి వైపు చూస్తూ శిష్యుడు అప్పారావు. 


"సేమ్ టు యు రా అప్పారావు.. సరే కానీ, అరేయ్ అప్పారావు.. నీ మొఖం చూస్తుంటే నువ్వు కొంచెం

కంగారు పడుతున్నట్టు ఉన్నావ్ ఏంటి రా. రావద్దు అంటే వచ్చావు. 


నాకంటే చిన్నప్పటినుండి ఈ రాత్రి పరిశోధనలు అలవాటు.. నువ్వు తట్టుకోలేవు. ఎందుకన్నా మంచి దని నీ కోసం ఈ సీసాలో orsకూడా కలిపి తెచ్చా నులే.. నీరసంగా భయంగా ఉన్నా నన్ను అడుగు.. ఈ ఓ ఆర్ ఎస్ ద్రావణం ఇస్తాను.. తాగు కొంచెం బలంగా ఉంటుంది. 


పోనీ.. నీకు అంతగా భయమేస్తే ఓ పనిచెయ్. నేను సరిగ్గా దెయ్యాలు తిరిగే సమయం అర్ధ రాత్రి 12 గంటలకు స్మశానంలోకి వెళ్తాను. మళ్లీ తెల్లవారు జాము 4గంటలకు తిరిగి వచ్చేస్తాను. అప్పటి వరకు ఇక్కడే కూర్చో నువ్వు. 


నాతో పాటు లోపలకు వచ్చి కళ్ళు తిరిగి పడ్డా.. రక్తం కక్కుకున్నా.. నేను సమా ధానం చెప్పాలి మీ వాళ్లకి. మీ తాత అసలే మంచోడు కాదు రా.. నా తలమీద వెంట్రుకలన్ని లాగేసి ఊరంతా అల్లరి చేస్తాడు. " అంటూ తన శిష్యుడు అప్పారావుని ఒప్పించబోయాడు.. అయితే అప్పారావు అలా కుద రదు కుదరదు అన్నాడు. అప్పారావు తన గురువు చెప్పింది ఒప్పుకోలేదు. 


"గురువుగారు.. ఇంకెప్పుడు ఈ స్మశానపు రహస్య విషయాలు నేర్చుకొంటాను. కాస్త భయంగా ఉందిగాని పర్వాలేదు.. పోయిన నెల అమావాస్య ఆదివారం అర్థరాత్రి కూడా మీతో తిరిగాను కదా" అంటూ ధైర్యంగా మాట్లాడేడు.. అప్పారావు. 


ఎంత చెప్పినా శిష్యుడు తన మాట వినకపోవడంతో ఇంక తప్పదు.. అనుకున్నాడు గురువు. 


రాత్రి 12 గంటలకు అవుతుంది.. ఇద్దరూ స్మశానం లోపలికి ప్రవేశించారు.. అసలు ఈ దెయ్యాలు ఉన్నాయా లేదా అన్నది ఈ వేళా ఖచ్చితంగా తేల్చేసు కోవాలని వాళ్ళ ఉద్దేశం. 


"అరేయ్ అప్పారావు.. చెప్పేది జాగ్రత్తగా విను.. ఈ దెయ్యాలు మనకి తెలిసిన మనిషిలాగే వచ్చి మన భుజం మీద చెయ్యి వేసి మాట్లాడతాయి. తెల్లవారి వరకూ మనతో గడుపుతాయి.. తెల్ల వారితే కానీ మనకు తెలియదు.. మనం తెల్ల వార్లు ఓ దెయ్యంతో గడిపామని.. ఇలాంటి సంఘటనలు నాకు రెండుసార్లు జరిగాయి.. బీ కేర్ ఫుల్.. జాగ్రత్త.. " అంటూ హెచ్చ రించాడు గురువు నిరంజనరావు. 


"గురువుగారు, మీ మాటలతో నన్ను మరీ కంగారు పెట్టకండి అంటూ ఆయనను అనుసరించాడు శిష్యుడు అప్పారావు. 


"అదిగో.. ఆ మూలన చూడు మంటలు.. అవి నిజం మంటలు కాదురా దెయ్యాలు చేసే మ్యాజిక్ అన్నమాట.. !!!''.. నిరంజనరావు ఒక మూల వైపు చూపిస్తూ చెప్పాడు. 


అప్పారావు కొంచెం భయపడుతూనే తన గురువు వెనుక నడుస్తున్నాడు.. ఆ భయంకర దృశ్యాలు అన్నీ చూస్తూ. 


"మనం చేయవలసింది ఇక్కడ జరిగేవి అన్ని గుర్తు పెట్టుకుని.. రేపు నోట్స్ తయారుచేసి.. ఫోటోలతో సహా.. "భయంకరం" వెబ్ పత్రికకు మెయిల్ చేయాలి.. నచ్చిన ఆర్టికల్ కి లక్ష రూపాయలు ఇస్తాడట.. ఇస్తాడో చస్తాడో ముందు మనం చచ్చేలా ఉన్నాం. ".. అంటూ చెప్తున్నాడు కొంచెం నీరసంగా శిష్యుడికి నిరంజనరావు. 


అలా.. నిరంజనరావు అంటుండగానే పెద్ద శబ్దం రావడంతో గుండె గుభేల్ మంది.. నిరంజనరావు కు. పక్కనే ఉన్న మర్రిచెట్టు ఊడలు మీద భయపడి తూలి పడిపోయాడు.. చాలాసేపు లెగలేదు. 


శిష్యుడు అప్పారావు గురువు గారికి ధైర్యం చెప్పి గురువుగారు తెచ్చిన ఓఆర్ఎస్ ద్రావణం పేపర్ గ్లాసులో కాస్తంత కలిపి గురువుగారి చేతే కొంచెం పట్టించాడు. 


"వెరీగుడ్ రా అప్పారావు.. నీకోసం తెచ్చింది నాకు పట్టావ్.. అందుకనే నేను కూడా నిన్ను వదలలేక పోతున్నాను రా.. నాకు ఏదైనా రివార్డు వచ్చింది అనుకో.. సగం నీకు ఇచ్చే స్తాను.. 


ఓకే ఇలా చూడు.. రేయ్ అప్పారావు.. ఈ పక్కన చూడు. వీళ్లు మంత్రగాళ్ళు.. ఈ నిమ్మ కాయలు, మిరపకాయలు పసుపు కుంకుమతో ఏవో పిచ్చి పిచ్చి పనులు చేస్తారు.. వాళ్ల నమ్మకం వాళ్ళది. బ్రతకాలి కదా. వాళ్లను పట్టించుకోవద్దు.. అసలు మనం దెయ్యాల పరిశోధన చేయడానికి ఇక్కడికి వచ్చాము.. అని తెలిస్తే వాళ్లు మనల్ని కొట్టి చంపేస్తారు.. జర జాగ్రత్త.. సౌండ్ ఏ మాత్రం చేయకుండా ఈ చెట్లు మూల నుండి మనం అంతా కనిపెట్టాలన్నమాట.. 


అదిగో ఆ మూలన సమాధి మీద దెయ్యం కూర్చు న్నట్టుంది చూడు.. అది దెయ్యం కాదు రా బాబు.. మన ఊరిలో తిరిగే పిచ్చి ప్రకాశం గాడు.. ఇక్కడైతే చల్లని గాలి లో పడుకోడానికి హాయిగా ఉంటుందని రాత్రి అయ్యేసరికి ఇక్కడకు వచ్చేస్తాడు అన్నమాట. సరే ఆ మూలకి వెళ్దాం పద.. వీడియో ఆఫ్ అవ్వకుండా అలాగే ఆన్ లో ఉంచి సీన్లు అన్ని రికార్డు చేసే బాధ్యత నీదే.. ఆ తర్వాత 'చూడలేదు గురువు గారు'.. అంటే కుదరదు.. "


అంటూ వివరంగా అన్ని చూపిస్తూ తన వాయిస్, స్మశానంలో వినిపించే రకరకాల వాయిస్లు రికార్డ్ చేయమని చెప్తూ.. మరోపక్క ముఖ్యమైన ఫోటోలు తీయమని హెచ్చరిస్తూ ముందుకు నడుస్తు న్నాడు నిరంజనరావు.. అలా అలా కొన్ని సమాధులను కొన్ని పుర్రెలను దాటుకుంటూ. 


 శిష్యుడు అప్పారావు ఆయనను అనుసరించి నడుస్తూ.. 


"గురువు గారు మీకు ఓ విషయం ఎప్పటి నుండో చెబుతాo అనుకుంటున్నానండి.. " అంటూ


చాలా నెమ్మదిగా అన్నాడు అప్పారావు. 


" చెప్పరా.. నిర్భయంగా అడుగు.. ఇక్కడ మనం స్మశానంలో ఉన్నట్టు దెయ్యాల మధ్య తిరుగు తున్నట్టు మనసులో పెట్టుకోకు ఫ్రీగా ఉండు. " ధైర్యం చెప్పి.. చెప్పమన్నాడు గురువు నిరంజన్ రావు. 


" ఏం లేదు గురువుగారు.. అసలు ఈ దెయ్యాలు చాలా మంచివండి బాబు.. వాట్ల మానాన అవి బ్రతుకుతూ ఉంటే.. ఈ మనుషులే.. అంటే "మనమే".. అనవసరంగా వాట్లను రెచ్చగొడుతున్నాము. 


 అని నా అభిప్రాయం.. మీరేమంటారు" చాలా తెలివిగా ప్రశ్నించినట్టు ఫోజు పెట్టాడు శిష్యుడు అప్పారావు. 


గురువు నిరంజనరావు కి.. ఎక్కడో.. కాదు.. అక్కడే మండినట్టు అనిపించింది. స్మశానం లో శవం మీది సగం కాలిన తుమ్మకఱ్ఱ తీసుకొని శిష్యుడుని దబదబా బాదెయ్యాలి అనుకున్నాడు.. ఇది సమయం కాదని కాస్త స్థిమిత పడ్డాడు. ఇంటికి వెళ్ళాక నీ పని చెప్తా అన్నట్టు శిష్యుడిని అదోలా చూశాడు


అప్పారావు వణుకుతూ, భయపడుతూ గురువు గారు ని అనుసరిస్తున్నాడు. 


"గురువుగారు నాకు మీరు అన్ని నేర్పాలి సార్ కోప పడకూడదు. " మళ్లీ అన్నాడు అప్పారావు. 


" నువ్వు నాకు శిష్యుడుగా వచ్చినప్పుడే నీ పిచ్చి ప్రశ్నలకు నాలో కోపం మొత్తం పోయింది.. వేపించు కుతినక.. అదేమిటో తొందరగా అడగరా?.. ? ప్రశాంతంగా అన్నాడు నిరంజనరావు.. అలా అలా నడుస్తూ. 


"గురువుగారు మొన్న ఒక పుస్తకంలో చదివాను కొంతమంది అసలు దెయ్యాలు లేవు అంటున్నారు మన ఈ ప్రయత్నం వేస్ట్ అంటారా.. ??అదీ నా ప్రశ్న. ''


" చాలా తెలివైనవాడివి రా చాలా మంచి ప్రశ్న వేశావు. నా శిష్యుడు అనిపించుకున్నావు.. 


ఇలా నడుస్తూ నాతో రా నేను సమాధానం చెపుతాను విను.. ఇప్పుడు " మంచి" ఉంటే "చెడు" కూడా ఉంటుంది.. అవును కదా.. "


" అవును గురువుగారు అది కరెక్టే.. "


" అట్లాగే.. " దేవుడు".. అంటూ ఉంటే.. "దెయ్యం".. ఉండి తీరుతుంది రా.. ఉండాలి కూడా.. "


" భలే చెప్పారు గురువుగారు నాకు చాలా బాగా అర్థమైంది.. అంతెందుకు గురువుగారు.. దెయ్యాలు లేకపోయినా.. మన మనుషుల్లోనే దెయ్యాల కన్నా ఎక్కువగా పీక్కుతినే దెయ్యం మనుషులు కొంతమంది ఉన్నారు.. 'మనం'.. అంటే.. 'మనుషులo'.. ప్రతిరోజు మనిషి దెయ్యాలతో కలిసే జీవనం సాగిస్తున్నాo కదా.. అలాంటప్పుడు మనకు ఇంకా ఈ దెయ్యాల మీద పరిశోధన ఎందుకు గురువుగారు.. ?" గొప్ప లా పాయింట్ లాగినట్టు అడిగాడు అప్పారావు తల ఆడిస్తూ.. అప్పారావు. 


" నువ్వు నా కన్నా రెండు ఆకులు ఎక్కువ చదివినట్టు ఉన్నావు రా.. వేదాంతం కూడా మాట్లాడేస్తు న్నావు.. అబ్బో ఏ జన్మకైనా నువ్వే నా శిష్యుడు గా ఉండాలి. " అన్నాడు ఆనంద పడుతూ నిరంజ నరావు. 


"గురువుగారు నాదొక.. మరొక.. చిన్న చిట్టచివరి సందేహం.. మీరు నాకు ఈ సందేహం తీర్చాలి సార్. ".. ఖచ్చితంగా అడిగాడు.. అప్పారావు. 


"ఇది.. ఇలా ఉండాలి రా "శిష్యుడు".. అంటే.. ఏ అనుమానం వచ్చిన.. వెంటనే అడిగేయాలి. 


అడుగు.. దెయ్యాల విషయంలో అసలు సందేహాలు ఉండకూడదురా. అలా ఉంటే మన పరిశోధన ముందుకు వెళ్ళదు. మనకు డాక్టరేట్ రావాలి కదా. చిన్నదైనా పెద్దదైనాసందేహం సందేహమే! నెమ్మదిగా అడుగు. ఎందుకంటే మన అలికిడి వింటే దెయ్యాలు పారిపోవచ్చు లేదా మనల్ని ఆట కట్టించవచ్చు. " అన్నాడు నెమ్మదిగా నిరంజన రావు.. శిష్యుడు ని చూసి తెగ ఆనందిస్తూ. 


"అదే సార్ దెయ్యాల లోఎన్ని రకాలు ఉంటాయి సార్.. ?".. ప్రశ్నించాడు అప్పారావు


" నువ్వు సినిమాలు చూడవా.. చాలారకాలు.. భయపెట్టే దెయ్యం.. కామెడీ చేసే దెయ్యం.. శృంగారం చేసే దెయ్యం.. చంపేసే దెయ్యం.. స్నేహం చేసే దెయ్యం.. ఇంకా కనపడకుండా ఏడిపించే దెయ్యం.. "


" వద్దండి.. గురువుగారు.. వద్దండి.. వద్దు బాబోయి వద్దు.. బాగా అర్థమైంది. ఒక్కమాట లో ఈ మను షుల్లో ఎన్నిరకాలు ఉన్నారో అన్ని రకాల దెయ్యాలు ఉన్నాయని చెప్తే సరిపోతుంది కదా.. ! నా శ్రాద్ధం నా పిండాకూడు.. మీరే నన్ను ఇలా భయపెడితే ఎలాగండి గురువు గారు.. నా కాళ్ల మధ్య తడి ప్రవహించేలా ఉంది''.. అన్నాడు అప్పారావు. 


" మరి.. నేర్చుకుంటాను అన్నావుగా నేర్చుకో. అప్పారావు.. నువ్వు భయపడకుండా ఉంటా నంటే.. ఓ చిత్రం చూపిస్తాను రా.. పర్వా లేదా??" ప్రశ్నించాడు నిరంజనరావు. 


పర్వాలేదన్నట్టు తల ఊపాడు అప్పారావు. 


"ఇదిగో మన వెనకాల చూడు.. ఈవేళ వుష్ కాకి అయిపోయి ఇక్కడకు వచ్చి సమాధి అయిపోయిన ఒక మనిషి తలలోని మెదడు తినడం కోసం.. నక్కలు గొయ్యి తవ్వేస్తున్నాయి.. భయ పడుతున్నావా. 


.. ఆ ors నువ్వు కూడా కొంచెం తాగరా. ".. అందించాడు నిరంజనరావు. 


" సరే కానీ గురువుగారు ఆ విషయం అలా ఉంచండి గురువుగారు.. గేటు తోసుకుని లోపలికి ఎవరో వస్తున్నారు అది దెయ్యం ఏమో అని నా అను మానం.. "


"చూద్దాం ఇంత అర్థరాత్రి మనుషులు రారు కదా అది దెయ్యమే అయి ఉంటుంది. అదిగో దగ్గరకు వచ్చే స్తుంది.. నా భుజం పట్టుకో.. నిన్ను అసలు 'రావద్దు' అన్నాను.. ప్యాంటు తో పాటు ముడ్డి కూడా తడుపు కొన్నట్టున్నావు.. నీ దగ్గర వెధవ కంపు వస్తుంది. ".. 

ముక్కు మూసుకుంటూ అన్నాడు నిరంజనరావు


"గురువుగారు.. ఇలాంటప్పుడు కామెడీ ఏంటండి బాబు. అది దెయ్యం కాదండీ.. అంగర వారి వీధిలో తిరిగే.. పిచ్చి పెంచలమ్మ. "


" అవునా.. నేను అలాగే.. అనుకున్నాను. "


"గురుగారు.. నాకు దెయ్యాల మంత్రాలు నేర్చు కోవాలనుంది గురువు గారూ.. " తన కోరిక బయట పెట్టాడు అప్పారావు


" నోర్ముయ్.. ఇంకా నయం.. దెయ్యాన్ని పెళ్లాడతా ననలేదు.. అయినా ఈ భయంకర సమయంలో, 


 ఇంత అర్థరాత్రి.. ఇదేమి కోరిక రా బడుద్దాయి. " చిరాకు పడ్డాడు నిరంజనరావు. 


""గురువుగారు లాస్ట్ అండ్ ఫైనల్ చిన్న విన్నపం గురువుగారు.. "


"గురువుగారు గురువుగారు అంటూ గోకేస్తున్నావు.. త్వరగా అడిగి తగలడు. "


ఇంకాస్త చిరాగ్గా అన్నాడు నిరంజనరావు. 


" ఏం లేదు గురువుగారు నాకు.. దెయ్యాలకు సంబం ధించి.. అన్ని విషయాలు పూర్తిగా చెప్పారు నాకు కూడా అర్థం అయిపోయాయి.. ఇప్పుడు నాకు ప్రమోషన్ కావాలి సార్.. " చేతులు నలుపు కుంటూ అడిగాడు అప్పారావు. 


" అంటే.. ".. ఆశ్చర్యంగా అన్నాడు నిరంజనరావు. 


"ఏం లేదు గురువుగారు నాకు "గురువు".. గా ప్రమోషన్ ఇవ్వండి.. ".. భయపడుతూ అడిగే సాడు అప్పారావు. 


" అప్పుడు నీముఖానికి ఎవరు శిష్యులు దొరకరు. 

నన్ను శిష్యుడిగా ఉండమంటావా???".. కోప్ప డుతూ అక్కడ ఉన్న ఖాళీ కుండతో అప్పారావు నెత్తిమీద కొట్టబోయాడు. 


 దెయ్యాలు పిశాచాలు భూతాలు కలిపి ఒక్కసారే గట్టిగా నవ్వేసినట్టు గట్టిగా నవ్వేసాడు. అప్పారావు


నిరంజనరావు కూడా అలాగే నవ్వేశాడు.. అదేమిటో వాళ్లిద్దరూ ఆగకుండా సరదాగా నవ్వుకుంటుంటే స్మశానంలో దయ్యాలు నవ్వుతున్నట్టే ఉంది అక్కడ వాతావరణం. 


" గురువుగారు నాకు కాళ్ళు పీకేస్తున్నాయి.. ఎంత సేపు తిరిగిన దెయ్యం కనిపించడం లేదు. ఇక ఆపేద్దాం గురువుగారు.. మళ్లీనెల ఆదివారం అమావాస్య అర్ధరాత్రి వద్దాము.. కోడి కూసింది.. తెల్లవార బోతుంది.. అదిగో మనుషుల అలజడి. ఇంకా ఇక్కడ ఈ పరిశోధన చేయడం బాగుండ దేమో.. ఇంటికి వెళ్ళిపోదాం గురువుగారూ. ఇక్కడ ఈరకంగా నా ఫ్రెండ్స్ చూస్తే నాతో స్నేహం కట్టరు"


. బాగా కంగారుపడుతూ అన్నాడు అప్పారావు. 


" సరే అలాగే చేద్దాం రా.. నువ్వు పూర్తి మబ్బులో ఉన్నావు. మానవ ప్రపంచంలో ఉండి మానవుడిగా ఫీల్ అవుతున్నావు. ముందు కిందకు వంగి నీ పాదాలు చూసుకో.. "


" అదేమిటి గురువుగారు.. చిత్రంగా ఉంది.. నా రెండుపాదాలు కూడా వెనక్కి తిరిగే ఉన్నాయి.. 


అబ్బో.. మీ రెండు పాదాలు కూడా వెనక్కే తిరిగి ఉన్నాయి.. ఇంత విచిత్రమా.. " ఏదో మహా విచిత్రం చూపిస్తున్నట్లు అన్నాడు అప్పారావు


" ఏడిచావ్.. యాక్సిడెంట్లో మనిద్దరం చచ్చి.. వారం అయింది.. నువ్వు ఏదో మనిషిగా మాట్లాడుతూ కామెడీ చేస్తున్నావని నేను కూడా నీతో సమానంగా మనిషిగా మాట్లాడి కామెడీ చేశాను అన్నమాట ఇంతసేపు. 


మనం వెళ్ళేది ఇంటికి కాదు రా.. ఇదిగో.. ఈ మర్రి చెట్టు మీదకే.. " గుర్తు చేస్తూ అన్నాడు గురువు దెయ్యం నిరంజనరావు. 



 శిష్యుడు దెయ్యంఅప్పారావు బుర్ర విదిలించు కున్నాడు. " అవును నేను కూడా ఒక దెయ్యమేగా.. " గుర్తొచ్చినట్టు తల ఆడించాడు. 


'' గురువుగారు మనం ఈ ఊరిలో ఉంటున్నాం కనుక ఈ ఊరి ప్రజలందరికీ న్యూ ఇయర్.. సంక్రాంతి శుభాకాంక్షలు చెబుదామా?''


 సరే అలాగే. '' అంటూ గురుశిష్యులైన ఆ రెండు దయ్యాలు కనపడకుండా ఆ ఊరి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేసాయి. 



వెంటనే.. గురుశిష్యులు అయిన ఆ రెండు దెయ్యాలు స్మశానం లో ఉన్న మర్రిచెట్టు మీదకు వెళ్లిపోయాయి. 

ఆ తెల్లవారు జాము నాలుగు గంటలకు!''. 


****

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు


 




102 views0 comments
bottom of page