top of page

ధనం మార్చును గుణం

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #DhanamMarchunuGunam, #ధనంమార్చునుగుణం, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు, #SomannaGariKavithalu

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 73


Dhanam Marchunu Gunam - Somanna Gari Kavithalu Part 73 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 08/05/2025

ధనం మార్చును గుణం - సోమన్న గారి కవితలు పార్ట్ 73 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


ధనం మార్చును గుణం

----------------------------------------

ఎక్కువైతే డబ్బులు

తెచ్చిపెట్టును చిక్కులు

మార్చునోయి మనసులు

పాడు చేయును బుద్ధులు


పెరుగునోయి గర్వము

మనశ్శాంతి దూరము

ధనాపేక్ష కీడు!కీడు!

బంధాలగు వల్లకాడు


డబ్బు కొరకు లోకం

దాసోహం అనిశం

ధనాశ మితిమీరితే

దేనికైనా సిద్ధం


ధన దాహం హెచ్చితే

తప్పవు అడ్డ దారులు

రేపుతుంది ఆశలు

వాటిని తీర్చ పాట్లు


ధనార్చనే కీలకం

కారాదు జీవితాన

అదే తిష్ట వేయరాదు

అహర్నిశలు మదిలోన

ree













గురువు గారి సూక్తులు

----------------------------------------

ఉంటేనే ఉపాయం

తప్పుతుంది అపాయం

లేక ఆపద సమయాన

తప్పుదోయ్! అయోమయం


చేసిన ఉపకారం

ఊరికే పోదు! పోదు!

సరైన వేళల్లో

అందించును సహకారం


ఆశ్రయించిన వారికి

చేస్తే అపకారం

అధోగతే చివరికి

అది కాదు క్షేమకరం


మంచి పనులే మనిషికి

గొప్ప అలంకారం

మార్గమే నాశనానికి

మితిలేని అహంకారం

ree

















కలబడుదాం! నిలబడుదాం!

----------------------------------------

సముద్రంలో రాయి

గట్టిగా విసిరినా

కొండకేసి అరిచినా

నష్టం మనకేనోయి


సముద్రం చింతించదు

కొండైనా చలించదు

చిన్ని చిన్ని వాటికి

ఉదాహరణ నేటికి


కడలిలా నిండుగా

కొండలా గొప్పగా

ఉందామా! నేస్తం!

బ్రతుకున ధీమాగా


నలుగురికి స్ఫూర్తిగా

నిలుద్దాం! జగతిలో

కలబడుదాం! గెలుపుకై

నిలబడుదాం! మలుపుకై

ree









మద్యపానం చేటు

----------------------------------------

సేవిస్తే మద్యం

అనారోగ్యం తధ్యం

చేయును నవ్వులపాలు

చెరుపును కుటుంబాలు


మద్యపానం చేటు

వ్యక్తిత్వానికి వేటు

ఆదిలో త్రుంచాలి

ఆ చెడ్డ అలవాటు


బానిస కారాదు

దాని జోలి పోరాదు

త్రాగుబోతుల చెలిమి

ఎన్నడు చేయరాదు


ఒళ్ళంతా గుల్లగును

ఇల్లంతా మబ్బగును

విడిచిపెడితే రాజు

తగ్గించుకో మోజు

ree






కలకాలం నిలవాలి!

----------------------------------------

కోయిలమ్మ గానంతో

కోనంతా కడు సందడి

చిగురాకుల తాళంతో

తగ్గు మానసిక ఒత్తిడి


కోయిలమ్మ గొంతులోన

అమృతంబు ప్రవహించును

విన్న వారి మనసులోన

ఆనందం ఉదయించును


మావిచిగురు తినగానే

మత్తిల్లును కోయిలమ్మ

తన్ను తాను మరచిపోయి

పాడుతుంది కోయిలమ్మ


కాకిలా కాకుండా

కోయిలలా బ్రతకాలి

హృదయాలను కదిలించి

కలకాలం నిలవాలి


-గద్వాల సోమన్న


Comments


bottom of page