top of page

ధనమూలం ఇదం జగత్'Dhanamulam Idam jagath' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 13/12/2023

'ధనమూలం ఇదం జగత్' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్సెల్ ఫోన్ రింగవుతుంటే నిద్రలో ఉన్న మేఘన ఫోన్ లిఫ్ట్ చేసింది. "హాపీ బర్త్ డే మేఘనా!" మధు విష్ చేశాడు. 


 "ధాంక్యు బావా !" అని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయింది మేఘన. 


మధు మేఘనకు మేనత్తకొడుకు. చిన్నప్పటినుండి ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ఇష్టము, వల్లమాలిన అభిమానము. వాళ్ల వయసుతో పాటే వాళ్ల మధ్య ఉన్న ఇష్టం ప్రేమగా చిగురులు తొడిగింది. మధు తండ్రి ఆనంద్ బెంగళూరులో వ్యాపారవేత్త. భార్య హైమవతి, కొడుకు మధుతో విలాసవంతమైన జీవనం గడుపుతున్నాడు. ఆయనకు చెల్లెలు సురేఖ అంటే వల్లమాలిన అభిమానం. 


హైమవతికి ఆడపడుచు సురేఖ అంటే చిన్నచూపు. ఆవిడ తన అంతస్ధు, హోదాకు తగదని భావన. సురేఖ భర్త సంతోష్ హైదరాబాద్ లో బాంకులో ఉద్యోగం చేస్తూ కూతురు మేఘనను చదివిస్తున్నాడు. మధు ఇంజనీరింగ్ పూర్తయి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మేఘన డిగ్రీ పూర్తయి ఉద్యోగ వేటలో ఉన్నది. 


 ఒకరోజున బాంకు నుండి వస్తున్న సంతోష్ స్కూటరును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనగా ఆ ప్రమాదంలో సంతోష్ అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయాడు. జరిగిన దారుణానికి గుండెలు పగిలేలా ఏడ్చారు సురేఖ, మేఘనలు. విషయం తెలిసి ఉన్నపళంగా కుటుంబంతో వచ్చి వాళ్లని ఓదార్చారు ఆనంద్ దంపతులు. 


పుట్టెడు దుఃఖంతో ఉన్న వాళ్ళిద్దరినీ ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. మధు కూడా వాళ్లకు ఎంతో ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు. జరగవలసిన కార్యక్రమాలను దగ్గరుండి జరిపించారు ఆనంద్ వాళ్లు. ఆయన అక్కడే కొన్నాళ్లు ఉండి సంతోష్ తాలూకు బాంకు నుండి రావలసిన డబ్బులు వగైరా సురేఖకు వచ్చేట్టు చేశాడు. 


సంతోష్ ఉద్యోగం అంతస్ధాయి కాకపోయినా అదే బాంకులో సురేఖకి ఒక ఉద్యోగం ఇచ్చారు బాంకు వాళ్ళు. కొన్నిరోజుల తర్వాత మేఘనకు ఒక కంపెనీలో ఉద్యోగం దొరికింది. ఆనంద్ సురేఖని, మేఘనను తమవద్దకు వచ్చి ఉండమన్నాడు. 


కానీ తన వదిన స్వభావం తెలుసు కనుక అభిమానవంతురాలైన సురేఖ తన అన్న మనసును నొప్పించకుండా వద్దని సున్నితంగా చెప్పింది. సురేఖ, మేఘనలు ఉద్యోగాలు చేసుకుంటూ నెమ్మదిగా తమ మనసును దిట్టవు చేసుకుని మామూలు జీవనంలోకి పడ్డారు. 


అప్పుడప్పుడూ ఆనంద్, మధులు వచ్చి వెళుతున్నారు. కొన్నాళ్ళకు మధుని కంపెనీ వాళ్లు 6 నెలల ఆఫీసు పనిమీద అమెరికాకు పంపారు. మధు, మేఘనల మధ్యన ఫోన్ సంభాషణలు జరుగుతున్నాయి. కాలం ఎప్పుడూ ఒకటిగా ఉండదు కదా ! డబ్బు ఎంతటి వాడి మనస్సు నైనా ప్రభావితం చేస్తుంది. 


వ్యాపార విస్తరణతో కోట్లకు పడగలెత్తుతున్న ఆనంద్ కి అహంకారం, గర్వం చోటు చేసుకుంది. ఆయనకు ఇప్పుడు తన స్టేటస్, డబ్బు, హోదా ముఖ్యం. ఆయన సురేఖతో అప్పుడప్పుడు ఫోనులో మాట్లాడుతున్నాడు. హైమవతికి కూడా కావల్సింది అదే కనుక భర్త తీరుకు మనసులో చాలా సంతోషిస్తోంది. 


కొన్ని రోజులకు సురేఖ మేఘనని తీసుకుని ఆనంద్ ఇంటికి వచ్చింది. సమయం చూసుకుని తన అన్న, వదినల వద్ద మేఘనని కోడలిగా చేసుకోమని తన మనసులోని ఉద్దేశ్యాన్ని బయటపెట్టింది. పైగా పిల్లలిద్దరూ ఈడూజోడుగా ఉన్నారు. వాళ్ల మనసులు కూడా కలిశాయి అన్నది. బావతో తన పెళ్లి గురించి ప్రస్తావన కనుక సిగ్గుతో చాటునుండి వాళ్ళ సంభాషణ వింటోంది మేఘన. 


 చెల్లెలి మాటలకు ఆనంద్, హైమవతి లు ఒకరి ముఖాలొకళ్ళు చూసుకున్నారు. కాసేపటికి ఆనంద్ "మాకు ఆ అభిప్రాయం లేదు. మా అంతస్థెక్కడ? మీ అంతస్ధెక్కడ? మధు అమెరికా నుంచి వచ్చాక మా స్ధాయికి తగ్గ సంబంధం చూసి అతనికి పెళ్లి చేస్తాము. ఈలోగా నీ కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయి. అందుకు అవసరమైతే కాస్త ధన సహాయం కూడా చేస్తాను " అన్నాడు. 


అన్నగారి మాటలకు ఒక్క సారిగా తన కాళ్ళ క్రింద భూమి కదిలిపోతున్నట్లు, అందులో తను, తన కూతురు పడిపోతున్నట్టు మనసు విలవిల లాడింది సురేఖకి. మామయ్య నోటి నుంచి విషయం విన్న మేఘన ఒక్క సారిగా కృంగిపోయింది. తను ప్రాణంగా భావించే బావ మధు పైన కోటి ఆశలతో అందమైన జీవిత సౌధాన్ని కట్టుకుంది. ఇప్పుడీ సౌధం కూలిపోతున్నట్టనిపించి మనసు వ్యధచెందింది. మేఘన వెంటనే వాళ్ల ముందుకు వచ్చి తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, మీ ఇద్దరి అంగీకారంతో పెళ్లి చేసుకుని ఒకటవ్వాలనుకుంటున్నట్లు చెప్పింది. 


 అందుకు వాళ్లు కుదరదనీ, తన కొడుకు తన మాటను కాదనడనీ నిర్మోహమాటంగా చెప్పి సురేఖను, మేఘనను నిందించారు. 


జరిగిన అవమానానికి బాధపడుతూ దాన్ని మనసులోనే దిగమింగుకుని పెట్టె సర్దుకుని కూతుర్ని తీసుకుని తమ ఊరికి బయలు దేరింది సురేఖ. 


"కోటీశ్వరుడయ్యేటప్పటికి తన అన్నకు కళ్లు నెత్తికెక్కి చెల్లెలన్న మమకారం, ప్రేమ చచ్చిపోయింది. ఔరా! ధనం మనిషిని ఎంతగా మార్చేసిందో కదా ! ఇంక తనకు ఆభగవంతుడే దిక్కు. అయినా మధుతో ఉన్న చనువుకొద్దీ అతనిని ఒకసారి అడుగుతాను. ఆపైన దైవనిర్ణయం ఎలా ఉంటే అలా అవుతుంది. " అనుకుంది సురేఖ. 


మేఘన మాత్రం "తన బావ చాలా మంచివాడు. తన మాటను కాదనడు. ఇంటికి వెళ్లాక బావతో వివరంగా పెళ్లి విషయం మాట్లాడాలి. తన బావే తనకు కాబోయే భర్త " అనుకుని బావను గురించిన తలపులు, అతనితో గడిపిన మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుంది. 


వాళ్ళిద్దరి మనసులు కలిశాయి కనుక త్వరలో మధు, మేఘనలు దంపతులు అవ్వాలని ఆశిద్దాము. 

***

***

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


 మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

Profile Link:

Youtube Play List Link:


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి  బిరుదు పొందారు"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏


69 views0 comments

Comments


bottom of page