top of page

డిబ్బు.. చాలా గుర్తుకొస్తున్నావ్!


'Dibbu Chala Gurthosthunnav' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 24/10/2023

'డిబ్బు.. చాలా గుర్తుకొస్తున్నావ్!' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


ఇన్ని సంవత్సరాలైనా.. డిబ్బు ని మర్చిపోలేకపోతున్నాను. తనకీ.. నాకు మధ్య ఉన్న ఆ ప్రేమ అటువంటిది మరి! అప్పుడప్పుడు కలలోకి వస్తూనే ఉంటుంది. తలపు వచ్చినప్పుడు.. కంట్లో నీళ్ళు తిరిగుతూనే ఉంటాయి.


కాలేజీ లో చదువుతున్న రోజుల్లో ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ.. ఇంట్లో ఒక మంచి ఫ్రెండ్ ఉంటే బాగుంటుందని ఎప్పుడూ అనిపించేది. గర్ల్ ఫ్రెండ్ ఉండే అంత వయసు కాదు లెండి! అప్పుడే.. నా జీవితం లోకి వచ్చింది లక్ష్మి. అమ్మాయి కాదు.. ఒక బ్రౌన్ కలర్ పిల్లి.


చూసిన వెంటనే మంచి స్నేహ భావం తో నా కళ్ళలోకి చూసింది. అంతే, వెంటనే ఫ్రెండ్స్ అయిపోయాము. రోజూ.. మా ఇంటి దగ్గరకు వచ్చేది. లంచ్ టైం లో సెపరేట్ గా అన్నం కలిపి వేసేవాడిని. పెరుగన్నం అంటే, చాలా ఇష్టం లక్ష్మి కి. రోజూ ఒకే టైం కు వచ్చేది. రోజూ లంచ్ మా ఇంట్లోనే. అలాగ, కొన్ని రోజుల్లో తన ఫ్రెండ్స్.. బ్లాక్ పిల్లి, వైట్ పిల్లి ను కుడా తీసుకుని వచ్చేది. అందరికీ అన్నం వేసేవాడిని.


చాలా రోజుల తర్వాత, లక్ష్మి ఒక బుజ్జి పిల్లి పిల్ల ని పెట్టింది. దానిని మా ఇంట్లో నే ఉంచింది. అదే నా డిబ్బు. వైట్ కలర్ మీద బ్రౌన్ చారల తో చాలా ముద్దు గా, అందంగా ఉండేది. మా ఇంట్లో బయట.. మెట్ల కిందే పెరిగింది. రోజూ పాలు, పెరుగన్నం పెట్టేవాడిని. ఒక స్పెషల్ ఏమిటంటే, ఆకలేసినప్పుడు, ఇంట్లో తినడానికి ఏమీ లేకపోతే, ఒక అప్పడం కాల్చి పెట్టేస్తే, తినేసేది. తరువాత పాలు తాగి షికారుకి వెళ్ళిపోయేది.


డిబ్బు కొంచం పెరిగి పెద్దదయ్యింది. చలికాలం కావడం చేత, బయట ఉండలేక, తెగ అరిచేది.. అప్పుడు తలుపు తీసిన వెంటనే, ఇంట్లోకి వచ్చేసేది. ఉదయం చూసేసరికి.. మంచం మీద నా పక్కనే పడుకునేది. అంత క్లోజ్ ఫ్రెండ్‌షిప్‌ ఉండేది మా ఇద్దరికీ.


ఒకరోజు ఉదయం డిబ్బు ఇంటికి రాలేదు. దాని కోసం చాలా వెతికాను. పక్క ఇంటిలో ఒక బావి ఉంది. అక్కడనుంచి పిల్లి అరుస్తున్నదని పక్క వాళ్ళు చెప్పడం చేత, అక్కడకు వెళ్లి చూస్తే, పాపం డిబ్బు నీటిలో సగం మునిగి, బుర్ర బయటకు పెట్టి అరుస్తూ ఉంది. నా గుండె తరుక్కుపోయింది. బావి పై నుంచి చూస్తున్న నాతో.. కళ్ళలోకి చూసి.. "నన్ను కాపాడు ప్లీజ్ !" అని కళ్ళతోనే అడిగింది. వెంటనే, ఒక బకెట్ కు తాడు కట్టి.. బావిలోకి వదిలాను. వెంటనే, తాడుని పట్టుకుని బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన వెంటనే, మా ఇంటి డైనింగ్ టేబుల్ మీదకు వచ్చి అరుస్తుంది. వెంటనే, పాలు గిన్నెలో పోసి పెట్టాను. రాత్రి నుంచి అరవడం చేత గొంతు ఎండిపోయి ఉండడంతో.. వెంటనే తాగేసింది. డిబ్బు హ్యాపీ!.. నేనూ హ్యాపీ!


ఒకసారి, మా ఇంటి కాంపౌండ్ లోకి పాము వచ్చింది. మర్నాడు ఉదయం చూసేసరికి పాము కదలక పడి ఉంది. పక్కనే డిబ్బు కూర్చుని ఉంది. పాముతో ఫైట్ చేసి అందర్నీ కాపాడిందని అర్దమైంది. అప్పటినుంచి అది మా ఫ్యామిలీ కి కుడా చాలా క్లోజ్ అయిపోయింది.


కొన్ని రోజుల తర్వాత.. డిబ్బు మళ్ళీ ఒక ఉదయం ఇంటికి రాలేదు. డౌట్ వచ్చి మళ్ళీ బావిలో చూసాను, కానీ అక్కడ లేదు. కాలనీ లో అంతా వెతికాను. ఈల వేస్తే, ఎక్కడున్నా, నా దగ్గరకు వచ్చేసేది. ఆ రోజు ఎంత ఈల వేసినా, రాలేదు. ఆ రోజంతా ఇంటికి రాలేదు డిబ్బు.


మర్నాడు ఉదయం.. మా ఇంటి పనిమనిషి ఒక వార్త తీసుకు వచ్చింది. సందు చివర చెత్త కుండీ దగ్గర ఏదో పిల్లి పడి ఉందని. ఏమీ ఆలోచించకుండా.. వెంటనే పరిగెత్తి అక్కడకు వెళ్ళాను. అక్కడ చూసిన సన్నివేశం, నాకు పెద్ద షాక్. చూస్తే, ఆ కలర్.. అది నా డిబ్బు నే! ఏదో బండి గుద్దేసిందని అక్కడ అందరూ అన్నారు.


ఆ రోజు నుంచి.. చాలా రోజుల వరకు నేను సరిగ్గా భోజనం చేసినట్టు గానీ.. నిద్ర పోయినట్టు గానీ.. నాకు గుర్తు లేదు.


******

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ


38 views0 comments

Comments


bottom of page