top of page

డ్రెస్ కోడ్'Dress Code' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 30/12/2023

'డ్రెస్ కోడ్' తెలుగు కథ

రచన: పిట్ట గోపిహైదరాబాద్ మహా నగరంలో జుబ్లీహీల్స్ లో ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై రాంప్రసాద్ కి, కానిస్టేబుల్ సురేందర్ కి, పై అదికారుల నుండి నోటీసులు అందాయి. 


నడిరోడ్డుపై కాలేజీ విద్యార్ధినిని ఇద్దరు ఆకతాయిలు అల్లరి చేస్తున్నా, బాధితురాలు కాపాడండని పిలుస్తున్నా, అటువైపు వెళ్తున్న వీళ్ళు చూసిచూడనట్టు వెళ్ళిపోయారని, దీని పై వివరణ ఇవ్వాలని, ఆ నోటీసు సారాంశం. 


ఎస్సై రాం తో పాటు బాధితురాలు, మరియు ఆమె తల్లిదండ్రులకు కూడా ఈ నోటీసులు అందటంతో వారు కూడా తమ తమ వివరణ ఇవ్వటానికి అధికారుల వద్దకు వచ్చారు. 


ముందుగా ఎస్సై

"సార్.. మన దేశంలో ఇప్పటితో పోలిస్తే ఒకప్పుడు మనం ధరించే వస్త్రాలపై ఎలాంటి విమర్శ లేదు. 


రానురాను కాలచక్రంలో వచ్చిన మార్పు, మనం వేసుకునే వస్త్రాలపై కూడా పడింది. ఆగ మగ తేడ లేదు. ఎవరికి ఏ దుస్తులు నచ్చితే ఆ దుస్తులు ధరించటం పరిపాటిగా మారింది. ఈ విషయంలో ఎలాంటి నిబంధనలు లేవు కదా మరి. 


 ఆనాడు పంచెకట్టు, పట్టుచీర కట్టుకునే ఎవరినైనా భారతీయులు అని ఇట్టే చెప్పవచ్చు. వస్త్రదారణలో అంతటి గొప్ప కీర్తి మన దేశానికి ఉంది. అలాంటి గొప్ప సంస్కృతి, సంప్రదాయం కలిగిన దేశం మనది. 


ఇక అసలు విషయానికి వస్తే, నగరంలో ఈమధ్య ఆడవారిపై అకృత్యాలు విపరీతంగా పెరిగాయని, మీ నుండి స్పష్టమైన ఆదేశాలు వచ్చాక నివారణ చర్యల కోసం రెండు నెలలుగా రౌడిషీటర్లకు, లారీడ్రైవర్స్ కు, ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇస్తూ, అనుమానస్పద వ్యక్తులపై నిఘా ఉంచుతూ.. 


ప్రతి పాఠశాల, కళాశాలలో విద్యార్ధినులకు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వచ్చాం. అయినా కొంతమందిలో మార్పు రావటం లేదు. 


ముఖ్యంగా ఆడపిల్లలు ధరించే దుస్తులు మరీ దారుణంగా ఉన్నాయి. ఏమని అడిగితే మా ఇష్టం అంటూ దురుసుగా మాట్లాడుతున్నారు. 


నిజమే. డ్రెస్ కోడ్ పై వారికి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఎటువంటి నిబంధనలు లేవు. స్వేచ్ఛ ఉంది కదా అని వివరించటానికే చెప్పలేని విధంగా ఉంటే తానంతట తన దారిన పోయే మగవాళ్ళు సైతం వీళ్ళని ఏడిపించక ఇంకేం చేస్తారు. 


నిజంగా సభ్య సమాజం మంచిదైతే, ఆడపిల్లలు ఏ దుస్తులు వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. చదువుకున్న వాళ్ళు, ఇంగిత జ్ణానం లేకుండా ఇలా మరీ దారణమైన దుస్తులు ధరిస్తూ చదువుకోటానికి రావటం కొందరు మంచివాళ్ళకి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అంతెందుకు.. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు సైతం మంచిచెప్తున్నా.. వినిపించుకోవటం లేదు. 


ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా సినిమాల ప్రభావం కూడా ఉంది. కానీ అంతకు ముందు వరుసలో సెలబ్రిటీలు ఉంటారు. వారు తమ దుస్తులు ఒంటికి కప్పుకునేది తక్కువ, ఈడ్చుతూ పోయేది ఎక్కువ. 

ఒంటికి కప్పుకోని వస్త్రం వీధల్లా పరుచుకుని ఏం లాభం.. ? 


వాళ్ళు సెలబ్రిటీలు. వారి చుట్టూ పెద్ద వలయం ఉంటుంది. వారి వస్త్రధారణ ఫాలో అయితే వీళ్ళకి అలాంటి వలయాలు ఉంటాయా.. ?


ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వచ్చే ఆపద నుండి ఎవరైనా రక్షించటానికి అవకాశం ఉంటుంది. 

మళ్ళీ మళ్ళీ ఇలాంటి దుస్తులు వేసుకుంటారు కానీ ఒకసారి తప్పు జరిగితే జీవితాలు నాశనమవుతాయని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు.. " అధికారులకు వివరణ ఇచ్చాడు ఎస్సై. 


ఆ మాటలకు ఆమె తల్లిదండ్రులు అక్కడే ఆమెని తిడుతుండగా,

ఎస్సై అడ్డుకుని. 


"ఇదే మందలింపుని మీ పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు చెప్తే బాగుంటుంది. మీకు తెలియకుండా మీ పిల్లలు ఇలా చేయరు కదా.. ! 


అసలు ఇలాంటి దుస్తులు కొనుక్కుని ధరిస్తుంటే ఆపలేని మీకు ఇప్పుడు దండించే అధికారం ఉందా.. ? ఆలోచించండి. 


తల్లిదండ్రులారా.. ! మీ పిల్లలకు సభ్యత, సంస్కారం నేర్పించకుండా రేపటి రోజున వారి నుంచి ఇలాంటివి ఆశించటం ఎంత వరకు సమంజసం.. ?


స్వేచ్ఛ ఉంది కదా అని ఎల్లవేళలా ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న మాకే..  

‘మా ఇష్టం’ అంటూ ఎదురు చెప్పటం సమంజసమా.. 

మీరు మాకు సహకరించండి. 


ఎవడు అఘాయిత్యాలు చేస్తాడో మేము చూస్తాం. మేము ఉన్నది మిమ్మల్ని రక్షించటానికే" అని చెప్పగా అధికారులు ఎస్సై రాం ప్రసాద్ ని మెచ్చుకుని నోటీసులు ఇచ్చినందుకు క్షమాపణలు చెప్పి గౌరవంగా పంపారు. 


బాధితురాలు డ్రెస్ కోడ్ విషయంలోనే కాదు. ఆడపిల్లగా బుద్దిగా, సక్రమంగా ఉంటానని మాట ఇవ్వగా ఆమెకి కౌన్సెలింగ్ ఇచ్చి, తల్లిదండ్రులతో పంపారు అధికారులు. 


సమాప్తం.


పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం

Profile:

Youtube Playlist:

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
42 views0 comments

Comments


bottom of page