top of page
Original.png

దురాశ దుఃఖానికి చేటు


దురాశ దుఃఖానికి చేటు కథలో నిజాయితీగల సత్తెయ్య, దురాశతో ఎర్రచందనం చెట్లు నరికిన కోటయ్య

Durasa Duhkhaniki Chetu - Telugu Moral Story | Rallabandi Sangam Naidu

దురాశ దుఃఖానికి చేటు - తెలుగు నీతి కథ | రాళ్లబండి సంగం నాయుడు

Published in manatelugukathalu.com on 25/08/2026


“దురాశ దుఃఖానికి చేటు” రాళ్లబండి సంగంనాయుడు రచించిన చక్కని తెలుగు నీతి కథ. నిజాయితీ, కష్టపడి పనిచేయడం, పరుల సొమ్ముపై ఆశపడకపోవడం వంటి మంచి లక్షణాలు మనిషిని ఎలా ఉన్నత స్థితికి తీసుకెళ్తాయో సత్తెయ్య పాత్ర ద్వారా ఈ కథ వివరిస్తుంది. అదే సమయంలో, ఇతరుల విజయాన్ని చూసి దురాశకు లోనై అక్రమ మార్గంలో సంపాదించాలనుకున్న కోటయ్య చివరకు తన సంపదతో పాటు స్వేచ్ఛను కూడా కోల్పోతాడు. పిల్లలు, పెద్దలు అందరూ చదవదగిన ఈ కథ దురాశకు దూరంగా ఉండి నిజాయితీగా జీవించాలనే విలువైన సందేశాన్ని అందిస్తుంది.


అనగనగా ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో సత్తెయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతడు ధనంలో పేదవాడు గానీ గుణంలో ధనవంతుడు. కష్టపడటం తప్ప మరో దారి తెలియనివాడు. పరుల సొమ్ముకై ఆశపడనివాడు. నీతివంతుడు, నిజాయితీపరుడు. కట్టెలమ్ముకుని జీవించేవాడు. 


రోజూ అడవికెళ్లి కట్టెలు కొట్టి తెచ్చి అమ్ముకుని, వచ్చిన డబ్బులతో పూట గడుపుకునేవాడు. అతనికున్న ఆస్తేల్లా అతని ఇనుప గొడ్డలి. తన జీవనధారమైన గొడ్డలిని ప్రాణప్రదంగా చూసుకునేవాడు. కష్టజీవి కావడం వలన డబ్బులైతే సంపాదించలేకపోయాడు కానీ, రోజు నడవడానికి ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఇలా రోజులు హాయిగా గడుస్తున్నాయి. 


మామూలుగానే ఒకరోజు అడవికెళ్లి కట్టెలు కొడుతున్నాడు సత్తెయ్య. ఎన్నో సంవత్సరాల నుండీ కట్టెలు కొట్టడం వలన గొడ్డలి అరిగిపోయి విరిగి పోయింది. తన ప్రాణం, జీవనం అయిన గొడ్డలి విరిగిపోవటంతో సత్తెయ్య ఏడవడం మొదలెట్టాడు.


 సత్తెయ్య దుఃఖాన్ని చూడలేక వనదేవత బంగారు, వెండి గొడ్డళ్లు పట్టుకుని ప్రత్యక్షమైంది. వెండి, బంగారు గొడ్డళ్లను తీసుకోమని ప్రాధేయపడింది. పరుల సొమ్ము తనకొద్దని, కేవలం తన ఇనుప గొడ్డలి బాగుచేస్తే చాలన్నాడు. 


ఎన్నో ఏళ్లుగా సత్తెయ్య నిజాయితీ, ఆత్మభిమానం తెలిసిన వనదేవత సత్తెయ్య చెప్పినట్టే చేసింది. సత్తెయ్య నిజాయితీకి బహుమానంగా ఒక సలహా ఇచ్చింది. అదేమిటంటే, అడవిలో ఇంకొంచెం ముందుకు వెళ్ళమని వనదేవత అంతర్దానమైంది. 


ఆ తరువాత రోజు నుండీ వనదేవత చెప్పినట్టు అడవిలో కొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడన్నీ గుగ్గిలం, టేకు చెట్లు. ఇక ఆ రోజు నుంచి కట్టెలు కొట్టటం మానేసి టేకు, గుగ్గిలం చెట్లు కొట్టి ఇంటి కలప కింద అమ్మడం ప్రారంభించాడు. తక్కువ కాలంలోనే ఈ వ్యాపారంలో లక్షలు సంపాదించాడు. ఆ ఊర్లోనే డబ్బున్నోడు అయ్యాడు. సత్తెయ్య గురించి ఆ ఊరంతా గొప్పగా చెప్పుకోవడం మొదలెట్టింది.


అదే ఊరిలో సత్తెయ్య పొరుగుంటిలో కోటయ్య అనే బట్టల వ్యాపారి ఉండేవాడు. బట్టల వ్యాపారంలో బాగానే సంపాదిస్తున్నాడు. వ్యాపారం బాగానే నడుస్తోంది. సత్తెయ్య కథ ఎరిగిన తరువాత సత్తెయ్య వ్యాపారం మీద దురాశ పుట్టింది కోటయ్యకు. 


కోటయ్య కూడా అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్లి కావాలని గొడ్డలిని విరిచేసి దొంగేడుపు మొదలెట్టాడు. వనదేవత బంగారు, వెండి గొడ్డళ్లతో వస్తే ఆ రెండు గొడ్డళ్లు తనవేనని తీసుకున్నాడు. కోటయ్య దురాశకు వనదేవతకు కోపమొచ్చింది. అయినా కోటయ్యను ఏమీ అనలేదు. ఒక సలహా ఇచ్చింది. అడవిలో ఇంకా లోనికి వెళ్లకని వనదేవత మాయమైంది. 


ఆ క్షణమే వనదేవత మాట పక్కన పెట్టి అడవిలో బాగా లోనికి వెళ్ళాడు కోటయ్య. వెళ్లిచూడగా అక్కడంతా ఎర్ర చందనం చెట్లు. తన దశ తిరిగిందనుకుని ఆ చెట్లను నరికి వాటితో వ్యాపారం చేయడం ఆరంభించాడు ఆ రోజు నుండి. సంవత్సర కాలానికి కోటేశ్వరుడయ్యాడు. కోటయ్య ఆనందానికి అవధులు లేవు. 


కోటయ్య ఎర్ర చందనం చెట్ల వ్యాపార విషయం ఆ నోటా ఈ నోటా రాజుకు చేరింది. రాజు అనుమతి లేకుండా ఎర్ర చందనం చెట్ల వ్యాపారం నేరమని, ఆ నేరం కింద కోటయ్యను ఖైదు చేశారు. కోటయ్య ఆస్తి మొత్తం జప్తు చేశారు. కోటయ్య ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. చెరసాల శిక్ష అనుభవించాడు. కోటయ్య దురాశకు పోయి దుఃఖాన్ని కొని తెచ్చుకున్నాడు.


*** 


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.


మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.


రాళ్లబండి సంగం నాయుడు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రాళ్లబండి సంగం నాయుడు

రచయిత పరిచయం: రాళ్లబండి సంగం నాయుడు

వృత్తి :స్కూల్ అసిస్టెంట్ తెలుగు

హాబీస్ :కథలు గేయాలు, వ్యాసాలు, లేఖలు రాయడం

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page