top of page

దసరా దండోరా


'Dusserah Dandora' - New Telugu Poem Written By Goparaju Venkata Suryanarayana

Published In manatelugukathalu.com On 22/10/2023

'దసరా దండోరా' తెలుగు కవిత

రచన: గోపరాజు వెంకట సూర్యనారాయణ


దసరా పండుగ వచ్చిందోయ్!

సరదా లెన్నో తెచ్చిందోయ్!!


చెడుపై మంచి సాధించిన విజయమే!

దసరా పండుగ సంబరం!!

దుష్ట శక్తులపై విజయ దుందుభే!

దసరా పండుగ సంకేతం!!


అంబరాన్ని తాకే ఆనందాల హేలే!

దసరా ఉత్సవ సందోహం!!


దసరా"


దుష్ట మహిషాసుర మర్దనం!

రావణాది రాక్షస సంహరం!

జగతి జాగృతికి సమర సంకేతం!!

ప్రగతి కాముకులకు సందేశం!!

జనావళికి దశా దిశా నిర్దేశం!!!


దసరా"


ఉప్పొంగే స్త్రీ శక్తి ఉత్తేజితం!

నవరాత్రి నవశక్తుల ప్రేరేపితం!!

పురుషాహంకార నిస్తేజ పూరితం!

అవనిపై శాంతిసౌఖ్యాల స్థాపితం!!


దసరా"


పాండవుల ఆయుధాల గుట్టు!

పదిలంగా దాచినట్టి జమ్మిచెట్టు!!

పూజలందె పుడమిపై పసిడి ఐనట్టు!!!

ఆకశాన రివ్వున ఎగిరే పాలపిట్ట!

స్వేచ్ఛను మెచ్చు ప్రతీకై నిలిచినట్టు!!

మానవాళి మనసుల్లో మెదలుతున్నట్టు!!!


దసరా"


ఇంటింటా పండుగకు అల్లుళ్ళ ఆగమనం!

పిల్లాపాపలతో కుటుంబాల సమ్మేళనం!!

బావ మరదళ్ళ చతురోక్తుల సమ్మిళితం!

ప్రతిఇంటా ఉల్లాస సందడి వాతావరణం!!

ఊరూవాడా సుఖసంతోషాల సమ్మోహితం!!!


దసరా"

***

గోపరాజు వెంకట సూర్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

ముందుగా మన తెలుగు కలు.కామ్ నిర్వాహకులకు నమస్కారం, అభినందనలు. మీరు తెలుగు కలను, కకులను ప్రోత్సహిస్తున్న తీరు ఈ మధ్యనే తెలిసింది!

నా పేరు: గోపరాజు వెంకట సూర్యనారాయణ, తల్లిదండ్రులు: గోపరాజు కృష్ణమూర్తి, అనసూయ దంపతులు. నివాసం: కూకట్ పల్లి, హైదరాబాదు.

వృత్తి రీత్యా M.Tech. Machine design చదివిన నేను, HMT Hyd. లో, దాదాపు ముప్పై ఏళ్ళు పైన పనిచేసి డిప్యూటీ జనరల్ మేనేజరు స్థాయిలో వాలంటరీ పదవీ విరమణ చేసిన ఇంజనీరును.

ఆ తర్వాత పేరున్న విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ప్రొఫెసర్ గానూ, మరికొన్ని ఇంజనీరింగు సంస్థల్లో డిజైన్ కన్సల్టెంటు గానూ పనిచేసిన అనుభవం.

ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ ను. స్వతహాగా సాహిత్యాభిమానిని, కళాభిమానిని. కలంటే బాగా ఇష్టపడతాను. ఈ మధ్యనే, రిటైర్మెంట్ తర్వాత స్వీయరచనా వ్యాసాంగానికి, స్వీయ పెయింటింగ్సు వేయడానికి సాహసిస్తున్నాను. పలు అంతర్జాల సమూహలకు, సంకలనాలకు కవితలు, చిన్నగా కలు రాస్తున్నాను, ప్రచురిస్తున్నారు, అభినందిస్తున్నారు!51 views0 comments

Commenti


bottom of page