top of page

మేలుకొలుపు


'Melukolupu' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally Published In manatelugukathalu.com On 22/10/2023

'మేలుకొలుపు' తెలుగు కవిత

రచన : సుదర్శన రావు పోచంపల్లి


మేలుకొమ్ము సోదరా నిదుర చాలు ఇంక లేవరా

నీతి లేని జాతినింక నిలువకుండ జేయరా

మోసాలు దగాలు మోక్షమనే తక్షకులా

కూసాలు ఊడదీయ కూడరార తమ్ముడా


నీతి లేని రాజనీతి జాతికింక చేటురా

భీతి వదలి ముందుకెగసి నీతి నిలుప బూనురా

నీరు నీది, గాలి నీది, చెట్టు నీది, గుట్ట నీది

పంట నీది ఫలము నీది పండించే బలము నీది


పుడమి లోని పుట్టుకంత

ఇడుములన్ని పడెడు నీది

బీభత్సపు ప్రకృతికి

భీరువుగా కృంగకుండ

వృక్షాలే ఆత్మ రక్షణకు బూనుకొని

ఫలము లొసగె లక్ష్యాన్ని పట్టువదుల బోవురా


చెట్టులాంటి గట్టిదనపు

చేవ గలిగి మెలగరా

ఒళ్ళు మరచి నిదురబోక

కళ్ళు దెరచి చూడరా

దుష్ట జాతి కుళ్ళు గడుగ

కష్టమనక కదలరా

మంచి అనే మాట నమ్ము

మనం అనే మనసు గలిగి

ఒనగూడిన ఒనరులన్ని

మన అందరి సొత్తు అని

మది నెంచుచు బ్రతకరా-


స్త్రీ జాతిని గౌరవించు

శ్రీమంతపు ఆశ వదులు

కులం మతం కుమ్ములాట

కూడదనీ చాటరా

అక్షరాల లక్షణాన్ని

అందరికీ తెలుపరా

వ్యసనాల వ్యవహారం

పస లేని బ్రతుకని

పది మందితొ పలుకరా


మాతృభక్తికి మారు లేదు

మాతృ భూమిని మించి

ధాత్రి మరి ఎక్కడ లేదని

మరువకుండ జెప్పరా

మానవత్వం విలువలందె

దైవమనే పదార్థం దాగి ఉంది చూడరా


అవనిలోన దేవతంటె ఆడదేనురా

అమ్మ తనము స్వీకరించి

మనకంది వచ్చెరా

జన్మని స్థన్యమిచ్చి

ప్రేమ తోడ మనల

పెంచి పెద్ద జేసెరా


అమ్మ రుణం తీర్చితేనె

జన్మ ధన్య మౌను చూడరా-- మే.సో.


***

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


22 views0 comments

Comments


bottom of page