top of page
Writer's pictureA . Annapurna

ఏమి ఇవ్వాలి?


'Emi Ivvali' - New Telugu Article Written By A. Annapurna

Published In manatelugukathalu.com On 22/10/2023

'ఏమి ఇవ్వాలి' తెలుగు వ్యాసం

రచన: ఏ. అన్నపూర్ణ

(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)


నాకు, నీ (Knee) రీప్లేస్మెంట్ ఆపరేషన్ జరిగి ఇంటికి వచ్చాక తెలిసినవారు, బంధువులు ఫోన్ చేశారు.


''అదేంటి? ముందుగా ఒక్క మాట ఐనా చెప్పలేదు నీకు హెల్ప్గా ఉండేవాళ్ళం కదా !.. అని ఒకరు, ''మాకు తెలిసిన మంచి డాక్టర్ వున్నారు.. అక్కడ చాలా బాగా ట్రీట్ చేస్తారు”, అని ఇంకొకరు, “అసలు ఈ ఆపరేషన్ ను అనవసరంగా డబ్బుకోసం చేసేరేమో.. హోమియోపతీ, ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయని అవి వాడితే అన్ని నొప్పులు మాయం అని.. యూటూబ్లో వీడియోలు చూసాను..” అని మరొకరు, 'అసలు ఊపయోగం ఉందొ లేదో ఈ ఆపరేషన్ వలన' అని, ఒకటే సలహాలు చెప్పడం మొదలుపెట్టేరు.


దానితో ఇక ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం మానుకున్నాను.


మరీ దగ్గిర బంధువులు స్నేహితులూ చూడటానికి వస్తామని ఫోన్ చేస్తే, “సరే వచ్చేటప్పుడు మీరు ఏమి అనుకోకపోతే పళ్ళు, జ్యూస్ లాంటివి తీసుకురావద్దు. పెరుగు, రైస్ ఉంటాయి కనుక, కారంలేని, ఆయిల్ లేని కూరలు, చట్నీ తీసుకురండి, నాకు ఉపయోగిస్తాయి.. బయట కేటరింగ్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు. నేను మూడు నెలలు వంట చేయకూడదు అన్నారు డాక్టర్” అని చెప్పాను.

వాళ్ళు ''మంచి ఐడియా చెప్పేవు. నిజమే”, అని అలాగే తెచ్చి ఇచ్చేవారు. అలా నాసలహా నాకు బాగా ఉపయోగపడింది.


ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, మనం పెద్ద వయసు వారినో, హాస్పిటల్నుంచి వచ్చినవారినో చూడటానికి వెళ్లి నపుడు పొలోమని పళ్ళు, జూసులు కాకుండా ఆరోగ్యానికి పనికివచ్చే వంటకం చేసి తీసుకువెళ్లడం మంచిది. కొందరు దానిమ్మ పళ్ళు తీసుకు వెడుతూంటారు. అవి ఒలిచి గింజలు తీయడం పెద్ద వయసువారికి ఇబ్బంది. పనివాళ్ళు అందరికి వుండరు. అన్నిపనులు చేయరు. లేదా కొందరికి వారిచేత చేయిన్చుకోడం ఇష్టం ఉండదు. కనుక వారు తినడానికి సులువుగా ఉండేవి, లేదా కట్ చేసిన పండు

ముక్కలు ఇవ్వడం మంచిది.


కొందరు ఆడవాళ్లే ఐనా ఆలోచన ఉండదు. నోట్లో పళ్ళు లేని పెద్ద వాళ్లకి ఆల్మండ్స్, పీనట్స్, వాల్నట్స్, కేషు గట్టిగా వుండే గింజలు ఇవ్వడం ఎంత దారుణం! వాటిని కొంచెం పొడిలా చేసి ఇస్తే మంచిదికదా.. వాటిని నానబెట్టి తింటారు.. అంటారా.. పెద్దవయసులో నానబెట్టడమూ గుర్తు ఉండకపోవచ్చు. వారి వయసు పరిస్థితి తెలుసుకుని మనం కొంచెం ఆలోచించి తీసుకు వెళ్లడం అవసరం.


అలాగే ధరించే దుస్తులు కూడా మెత్తగా సౌకర్యంగా ఉండేవి ఫ్రాకుల్లాటివి, సులువుగా తొడిగేవి ఇప్పుడు పెద్దవారికి, జబ్బుపడినవారికి, అన్ని రకాలు దొరుకుతున్నాయి. వాటిని ఇవ్వడం అవసరం. పెళ్లి మరో ఫంక్షన్లో చీరలు ఇవ్వడం వృధా. ఎదో చవకలో కొంటారు. అవి ఎలాగా కట్టుకోరు. ఎంత ఖరీదులో కొన్నా, అందరికి నచ్చవుకదా, సెంటిమెట్ జోలికి పోకుండా దాని బదులు ఎదో ఒక వస్తువు ఇవ్వడం మంచిది. తాహతునుబట్టి ! అసలు ఏమి ఇవ్వకపోయినా ఫర్వాలేదు.. నన్ను అడిగితె.


విదేశాల్లో ఎవరిని చూడటానికి వెళ్లినా ఫంక్షన్ కి పార్టీలకు వెళ్లినా ఫ్లవర్స్ ప్లాంట్స్ ఇస్తూవుంటారు. మరీ ముఖ్యమైనవారికి విలువైన గిఫ్ట్స్ ఇస్తారు. షోపీస్ లు కూడా ఇవ్వచ్చు. కొటేషన్స్ వున్న ఫ్రెమ్స్ వస్తున్నాయి.

అవికూడా చాలా బాగున్నాయి. తక్కువ ఖరీదులో మనసుకి నచ్చే బహుమానాలు ఇవ్వాలి అంటే జాగ్రత్తగా ఆలోచించి ఓపికగా వెతికి కొనాలి. స్టీల్, ప్లాస్టిక్ దేవుడు బొమ్మలు కూడా ఇవ్వకూడదు. చాలామంది ఇస్తారు.


పైగా అందరికీ ఓకే దేవుడు నచ్చడు. మనిషికోదేవుడు. ఇది పెద్ద తలనొప్పి. మరో ఇబ్బంది ఏమంటే ఎవరైనా చనిపోతే పురాణ గ్రంధాలు చనిపోయినవారి ఫోటో వేసి మరీ ఇస్తున్నారు. వీటిని అప్పటికే అందరూ చదివేసి వుంటారు. ప్రతీ ఇంట్లో ఉంటాయి, , , ఆ ఇంట్రెస్ట్ ఉన్నవారికీ.

దయచేసి అలా ఇవ్వొద్దు. వాటిని ఏమిచేయాలో తెలియక ఫోటో కట్ చేసి అపార్ట్మెంట్ మెట్లమీద పెట్టెను. కావాలంటే తీసుకుంటారని. కొన్నిరోజులు అలాగే వున్నాయి. చివరికి మా వాచ్మెన్ తూకానికి పేపర్స్ కొనే షాపులో అమ్ముకున్నాడు.


మరీ మరీ చెబుతున్న ఇలాంటి పిచ్చి ఎవరు మొదలుపెట్టేరో కానీ అతిలోకి వెళ్ళింది. రెండు మూడు ఇవ్వడం, వాటితోబాటు గ్లాస్లో చెంబో( రాగివి )ఇవ్వడం వృధా ఖర్చు.

ఇదంతా చూస్తే ఇదో వ్యాపారంగా మారిపోయి అందరినీ ఇబ్బంది పెడుతోంది. అవి ఎవరూ దాచుకోరు. బయట పడవేయడం తప్ప. చనిపోయిన బాధలోవున్నవారిని పిచ్చి నమ్మకాన్ని తలకి ఎక్కించి డబ్బు ఖర్చుపెట్టించడం కూడా వ్యాపారమే.


ఇలా వృధా ఖర్చు చేయకుండా మా బంధువు అనాధలకు ఆరోజు భోజనం పెట్టించారు. పేదలకు దుస్తులుపంచారు. ఇది మెచ్చుకోతగ్గ విషయం! అందరూ ఇలా చేయండి.

చనిపోయినవారి ఆత్మశాంతి ఇస్తుంది. వృథాఖర్చు చేస్తే ఇంకా బాధపడుతుంది జాగ్రత్త.


అలాగే పిల్లలకు, విద్యార్థులకు వారి వయసును బట్టి గిఫ్ట్స్ ఇవ్వాలి. లేదంటే గిఫ్ట్ కార్డ్స్ వున్నాయి. అన్ని షాపులకు సంబంధించి (. క్లోత్స్, టాయ్స్, బుక్స్ )లేదా కాష్.. ఇవ్వడం మంచిది. కొందరికి ఏది ఇవ్వాలో అర్ధంకాదు. కనుక కాష్ ఇవ్వడం మంచిది. ముఖ్యంగా సమయం- సందర్భం- వయసు -దృష్టిలో ఉంచుకోవాలి. కొందరు గిఫ్ట్స్ తీసుకురావద్దు అని కార్డులో ప్రింట్ చేస్తున్నారు.


అలా చేసినా చేయకపోయినా ఇవ్వక్కరలేదు. మహా ఐతే వాళ్ళు మనకీ ఇవ్వరు. సమస్యే లేదు. సరిపోతుంది. ఇద్దరికీ. ముఖ్యంగా నాదృష్టిలో 70 ఏళ్లవాళ్ళు గిఫ్ట్స్ ఇవ్వొద్దు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో జరిగే ఫంక్టయిన్స్ ఏమి వుండవు. నిజంగా పెద్దల ఆస్సీస్సులు కోరేవారు గిఫ్ట్ తీసుకువచ్చారా లేదా అని చూడరు.

********

ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.



రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ


నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)





26 views0 comments

Comments


bottom of page