top of page

ప్రకృతి వింత


'Prakruthi Vintha' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally Published In manatelugukathalu.com On 13/10/2023

'ప్రకృతి వింత' తెలుగు కథ

రచన : సుదర్శన రావు పోచంపల్లి


సృష్టిలో ఎంత సూక్ష్మ జీవి ఐనా ఎంత దీర్ఘ జీవి ఐనా చాలావరకు పంచేంద్రియ ప్రభావముతొ బ్రతుకుతాయి- ఐతె పంచేంద్రియాలకు తోడు మానవునకు మెదడు అన్ని జీవాలకు మిన్నగా ఉంటుంది. దాన్ని సన్మార్గములో ఉపయోగించుకున్నవాడే మనిషి. ఏ జీవి దేహమైన ఒక యంత్రములాగ సృష్టిలో తీర్చబడింది. యంత్రము మనిషి చే చేయబడింది. అది మనిషి కదిలిస్తేనే కదులుతుంది- జీవికి ఆహారమెట్లో యంత్రానికి ఇంధనముంటేనే నడుస్తుంది.

జీవికి ఆలోచన అధికము - మానవేతర జీవులలో కూడా పగ ప్రతీకార ధోరణి ఉంటుంది- వాటి శరీరములొనే ఆయుధములాగ విషముంటుంది- ఉదాహరణకు క్రిమి జాతిలో అనగా తేలు, పాము, కందురీగ, తేనెటీగ - ఇవి పగ పట్టినవంటె కరిచిన దనుక వదులవు- ఇదంతా ప్రకృతి వింత-


మనిషిలొ కౄరత్వము, చౌర్య లక్షణము, కక్ష, కార్పణ్యము, కలగలుపుగా ఉంటాయి. అదే మనిషిలో దయాగుణము, ధార్మిక లక్షణాలు, ప్రేమ, అనురాగము, పెద్ద చిన్న తేడాలు గౌరవ భావము మున్నగు లక్షణాలు ఉంటాయి.

ఇక ప్రకృతిలో ప్రేమ అనునది స్త్రీ జాతికి అధికముగా ఉంటుంది అదీ గాక అన్ని జీవులలో ప్రేమ అనునది లేకపోతె ఏ జీవి వృద్ధి చెందదు.


మానవ జాతిలో మేధ అధికము కావడము చేత లోక కల్యాణార్థము కొత్త కొత్త పరిశోధనలతొ అవసరమైన పనిముట్లు, యంత్ర పరికరాలు, నూతనాన్వేషణ, భూచర, జలచర ఖేచర మార్గాలను కనుగొని తమ బ్రతుకును సుఖప్రదం చేసుకొనుచున్నాడు.


ఇక విశ్వాస మనేది ఒక మనుషులకేకాక, జంతువులు పక్షులలో కూడా కనబడుతాది. ఉదాహరణకు కుక్క విశ్వాసము గల జీవి. తన ప్రాణానికి లెక్కచేయకుండా యజమానిని కాపాడ పూనుకుంటాయి. పక్షులు ప్రేమను కనపరుస్తాయి- ఒక్క మనిషిషిలోనే మాయరోగం లేకుంటె ప్రపంచమంతా సుభిక్షంగా ఉండి అభివృద్ధి పథంలో నడుస్తుంది.


శాస్త్రజ్ఞులు విశ్వ రహస్యాలను తెలుసుకొన పూనుకొని సఫలీకృతులైనా దుష్ట మానవుని క్రూరత్వము మీద శోధనకు పూనుకొనడము లేదు. అదే జరిగి మనిషిలోని ఆ దుష్ట కణాలను తొలగించ గలిగితె ఇక మనిషి అర్థ రాత్రైనా నిర్భయంగా తిరుగగలడు-ఏ యింటికి తలుపులు బిగించుకోవలసిన పనిలేదు- ఇంట్లో కూడా అలమారాలకు తాళాలు అవసరముండదు- రక్షకభత వ్యవస్థనే అవసరము లేదు- అట్లనే న్యాయస్థానములు కూడా అనవసరమే.


ప్రకృతిలో మంచికి తోడు ఈ చెడుపు లక్షణాలెందుకున్నవో ఎవరికీ ద్యోతకము కాదు.

***

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


24 views0 comments

Comments


bottom of page