'Kanuvippu- New Telugu Story Written By Baindla Gowthami
Published In manatelugukathalu.com On 21/10/2023
'కనువిప్పు' తెలుగు కథ
రచన: బైండ్ల గౌతమి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
అది చలికాలం.. విపరీతమైన మంచు కురుస్తుంది. అప్పుడప్పుడే కిరణాలు భూమిని తాకుతున్నాయి.. పచ్చని పంట పొలాల మధ్యలో, చలిలో వణుకుతూ, 70/ 80 కి మధ్య ఉండే సుబ్బయ్య, తన భార్య కనకవ్వ సమాధి ముందు ఏడుస్తూ, తాను పడుతున్న బాధల్ని, ఏకరువు పెడుతున్నాడు.. అలా చెప్పుకుంటే, తన దిగులు తగ్గుతుందని సుబ్బయ్యకు నమ్మకం..
కనకవ్వా, సుబ్బయ్యలకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు.. సుబ్బయ్యకు తండ్రి నుంచి వచ్చిన ఆస్తి ఏమీ లేదు.. సుబ్బయ్య తల్లిదండ్రులు కూలీ పని చేస్తూ, ఒక్కగానొక కొడుకు సుబ్బయ్యను పెంచి, చిన్నప్పుడే సుబ్బయ్య మరదలైన కనకవ్వను ఇచ్చి బాల్య వివాహం చేశారు..
కనకవ్వ, సుబ్బయ్యలు రోజు కూలి పని చేస్తూ, ఉన్న దాంట్లో సర్దుకుంటూ, ఉండగా రెండెకరాల పొలం కొని, ఉన్నదాంట్లో బాగానే బ్రతుకుతున్నారు.. వీళ్లు తమ పిల్లలు అయినా, గంగాధర్, శ్రీధర్, లక్ష్మి, రమాలను చదివించి, లక్ష్మీ రమలకు, సుబ్బయ్య చుట్టాల అబ్బాయి లను అల్లుళ్లు గా చేసుకున్నారు..
లక్ష్మి, రమల పెళ్లిళ్లు ఉన్నంతలో ఘనంగా చేశారు సుబ్బయ్య కనకవ్వలు.. గంగాధర్, శ్రీధర్ లకు పెద్దగా చదవు అబ్బలేదు. దాంతో తన కష్టార్జితం అయినా నాల్గు ఎకరాలను, చెరో రెండు ఎకరాలు ఇచ్చి, బంధువుల పిల్లల్ని కోడళ్లు గా చేసుకున్నారు.
వారం రోజులు బాగానే ఉన్నారు కొత్త కోడళ్లు.. వారం తర్వాత, అయినదానికి, కాని దానికి, చిన్న, చిన్న, వాటికి గొడవలు పెడుతున్నారు.. ఇద్దరు కోడళ్లు, ఉమ్మడి సంసారం కుదరదని, పేచి పెట్టి మరీ, వేరు కాపురం పెట్టారు. అయితే సమస్య అప్పటి నుంచే ప్రారంభమైoది. సుబ్బయ్య, కనకవ్వలు తమ కొడుకులకు బరువైపోయారు.. పెద్ద కొడుకు దగ్గర ఉంటే, చిన్న కొడుకు దగ్గర ఉండమని, చిన్న కొడుకు దగ్గరగా ఉంటే, పెద్ద కొడుకు దగ్గరుండమని, ఇద్దరు కోడళ్లు ఈసడించుకుంటున్నారు..
కోడళ్ళ వింత చేష్ట లను చూస్తూ ఉన్నారు కొడుకులు..
ఇది ఇలా ఉండగా, తోటను సుబ్బయ్య పేరు మీద ఉంచుకొని, సుబ్బయ్య మంచి పని చేశాడని, కనకవ్వ అంది. కోడళ్ళు వేరు కాపురం పెట్టిన వారం రోజుల్లో, తోటలోనే చిన్న గుడిసె లాగా వేసుకున్నారు సుబ్బయ్య కనకవ్వలు..
ఊరంతా ఉసూరు అంటున్నారు, కానీ సుబ్బయ్య కొడుకులు, కోడళ్ళు నిమ్మకు నీరేత్తిన్నట్టు, ఊరకవున్నారు..
కనకవ్వ, సుబ్బయ్యలు తమ మొదటి రోజులు గుర్తుకు తెచ్చుకుంటూ, మలిదశను ప్రారంభించారు. మళ్లీ కూలి పనికి వెళ్తూ, సుబ్బయ్య, కనకవ్వలు తమ జీవితాన్ని వెళ్లబుచ్చుతున్నారు.
ఇంతలో సుబ్బయ్య బీపీ ఎక్కువ అయ్యి, కింద పడ్డాడు. కనకవ్వ ఏం తోచకుండా, దిగాలు పడిపోయింది. ఆర్ఎంపీ డాక్టర్ కి చూయించింది. ఆర్ఎంపీ డాక్టర్, సుబ్బయ్య ఎక్కువ కష్టపడకూడదు, ఎండలో ఎక్కువ తిరగకూడదు, అని చెప్తూ, మందు బిళ్ళలు రాసిచ్చాడు..
మందులు తెద్దామంటే, కనకవ్వ దగ్గర డబ్బులు లేవు. డాక్టర్ ఏమో మందు బిళ్ళలు తొందరగా తెప్పించమని, చెప్పాడు, . ‘ఏం చేయాలి? భగవంతుడా!’ అని ఏడ్చుకుంటూ, పెద్ద కొడుకు దగ్గరికి పరిగెత్తింది కనకవ్వ..
పెద్ద కొడుకు గంగాధర్ తో, అతని భార్య ‘మనకే ఎందుకు ఈ దరిద్రం వెంటాడుతుంది.. చిన్న కొడుకు దగ్గరికి వెళ్లొచ్చు కదా? చిన్న కొడుకు అంటేనే ఇష్టం కదా మీ అమ్మకి?’ అంటూ కనకవ్వ చెప్పిన మాటల్ని పట్టించుకోకుండానే, సూటి పోటి మాటలతో, పెద్ద కోడలు ఇంటి నుండి బయటకు పంపించింది..
అప్పుడు మళ్లీ చిన్న కొడుకు దగ్గరికి పరిగెత్తింది కనకవ్వ.. చిన్న కోడలు కూడా, పెద్ద కోడల్లాగే, ‘ఏముందని ? మాకేం మిగిలిచ్చారని మా ఇంటికి వచ్చారు? మా దగ్గరే డబ్బులు లేవని.. ఇoకా మావయ్య కి, ఏం ఇవ్వగలమనీ తిరిగి పంపించేసింది..
కనకవ్వ ఏడుస్తూ, నడుచుకుంటూ, ఏం పిల్లలో ఏమో.. తన ఇద్దరు కొడుకులు పుట్టినప్పుడు, ఎంతో సంతోషంగా, నొప్పులు అనుభవిస్తూ, తాను కడుపు మాడ్చుకొని కూడా తన కొడుకులకు ఏ లోటు లేకుండా,పెంచిన కనకవ్వ, సబ్బయ్యల కోసం, ఒక్క రూపాయి పెట్టలేని, తన ఇద్దరు కొడుకులు, కోడళ్ల ప్రవర్తనను, తలుచుకుంటూ, ఏ జన్మలో, ఏ పాపం చేసామొ? అనుభవిస్తున్నాము, అనుకుంటూ, పెద్ద కూతురు లక్ష్మికి జరిగిందంతా చెప్పింది ఫోన్ చేసి కనకమ్మ.
అప్పుడు లక్ష్మి, మీది మాటలకు, సానుభూతి వ్యక్తం చేసి, చివరికి డబ్బులు మాత్రం లేవమ్మా !అంటూ మెత్తగా కత్తి దూసింది..
ఇక చేసేదేముందనుకొని, చిన్న కూతురు రమకు ఫోన్ చేసి చెప్పింది.. ఎకరాల పొలాలు ఇచ్చిన నీ కొడుకుల దగ్గర, ఏమీ లేనప్పుడు, నా దగ్గర మాత్రం ఏముంటాయమ్మ? మాకే ఏం మిగలడం లేదు, అంటూ ఫోన్ పెట్టేసింది కంటూవుగా..
చివరకు తను పొలం పనికి వెళ్లిన, యజమాని దగ్గరికి వెళ్లి, కూలిపనుల డబ్బులు ఇవ్వాలని అడిగింది.. అప్పుడు అ యజమాని, ముందే చెప్పాను కదా! వారం రోజుల తర్వాత డబ్బులు ఇస్తానని.. ఇప్పుడొచ్చి, ఇప్పుడే ఇవ్వమని, అడిగితే, నేను ఏలా తెచ్చేది ?అని అన్నప్పుడు, కనకవ్వ జరిగిన విషయాన్ని చెప్పడంతో, వెయ్యి రూపాయలు ఇచ్చాడు కనకవ్వకు.. సంతోషంతో కనకవ్వ, సుబ్బయ్యకు మందులు కొని, తెచ్చి, టైం ప్రకారము, మందులు ఇచ్చింది.. మూడు, నాలుగు రోజుల్లో, సుబ్బయ్య కోలుకున్నాడు.. కానీ డాక్టర్ గారు చెప్పిన మాటలు, కనకవ్వ చెవిలో మారుమోగాయి..
సుబ్బయ్య కూలి పనికి వెళ్దాం పదా కనకవ్వ! అన్నప్పుడు, కనకవ్వ డాక్టర్ గారు చెప్పిన విషయాన్ని, చెప్పి, నేనొక్కదాన్నే పనికి వెళ్తానంటూ, నువ్వు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోమని, చెప్పి, కూలి పనికి వెళ్తూ, సుబ్బయ్యను పోషించుకుంటుంది కనకవ్వ..
ఇలా రోజులు సాగుతుండగా, కొన్ని రోజులకు, రాత్రికి ఛాతీ లో మంటగా ఉందంటూ, నొప్పిగా ఉందంటూ, విల విలలాడి పోతుంటే, సుబ్బయ్యకు ఏం అర్థం కాలే? ఏం చేయాల? అని.. డాక్టర్ కి ఫోన్ చేసి, రమ్మని చెప్పగా, డాక్టర్ చూసి, కనకవ్వ నీకు అన్యాయం చేసిందంటూ, చెప్పి వెళ్లిపోయాడు డాక్టర్.. ఒక్కసారిగా కుప్పకూలి, లేవమంటూ పదేపదే అరుస్తున్నాడు.
అరుస్తున్నాడు కానీ, అది అరణ్య రోధన అయింది.. చుట్టుపక్కల ఎవరూ లేరు. కొద్దిసేపటి తర్వాత తమ కొడుకులు ఇద్దరికీ ఫోన్ చేసాడు.. అప్పుడు కోడళ్ళు, మీ నాన్నకి అసలు ఏమైందో? ఒకటే నస, అంటూ కాల్ కట్ చేశారు. ఫోన్ చేసి చేసి విసిగి పోయాడు. తెల్లవారుజామున, ఏమైంది కూలి పనికి రాలేదంటూ? అటుగా పొలం పనికి వెళ్తున్న, రామయ్య, సుబ్బయ్య దగ్గరికి, వచ్చేసరికి, చచ్చిపడి ఉన్న కనకవ్వ దగ్గర, సుబ్బయ్య ఏడుస్తూ, ఉన్నాడు.
ఇది చూసిన రామయ్య, జరిగిన విషయాన్ని, కొడుకుల కు చెప్పాడు.. కొడుకులిద్దరూ, జనాల మాటలకు భయపడి, కర్మకాండలు చేశారు. తోటలో సుబ్బయ్య ఒక్కడే, ఎలా ఉంటాడని? చెరొక నెల ఉంచుకోమని, ఊరి పెద్ద, సుబ్బయ్య కొడుకులకు చెప్పాడు. ఇది విన్న కోడళ్ళు, తోటను తమ పేరు మీద రాస్తేనే, చెరొక నెల ఉంచుకుంటామని, సుబ్బయ్యతో చెప్పారు. చివరి రోజుల్లో ఆస్తి తనకేం అవసరం ?అని ఇద్దరు కొడుకులు పేరుమీద, తోటను రాసిచ్చాడు సుబ్బయ్య, , ,
మొదటి నెల సుబ్బయ్య పెద్ద కొడుకు, దగ్గర ఉంటున్నాడు. పెద్ద కోడలు సుబ్బయ్యను, నాన్న చాకిరి చేపించు కుంటుంది. తన మామయ్యతో అంట్లు తోమించడం, బట్టలుతికించడం, పిల్లల పనులుతో పాటు, పొద్దస్తమానం, పొలం పనులు చెప్తూ, సద్ది కూడు పెడుతూ, ఉంటే.. నెల తర్వాత చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళాడు సుబ్బయ్య..
పెద్ద కోడలు లాగే, చిన్న కోడలు కూడా, పొలం పనులు, ఇంటి పనులు, పాడైపోయిన చద్ది కూడు పెడుతూ, ఉండగా.. ప్రతి రోజు, ఇంకా నేను ఎందుకు బ్రతికి ఉన్నానని???? దేవుని తిట్టుకుంటూ, తన బాధల్ని, తన భార్య సమాధి ముందు చెప్పుకుంటూ, ఉన్నాడు సుబ్బయ్య..
ఇది ఇలా ఉండగా, సుబయ్య మనవడు, పెద్ద కోడలు తో, “అమ్మా! సద్ధన్నం అంతా బాగుంటాదా??? రోజు తాతయ్య కి పెడ్తున్నవు???” అని అడిగితే, అప్పుడు పెద్ద కోడలు, “తాతయ్య ముసలివాడు కదా! అందుకే పెడ్తున్నం” అని చెప్పింది..
అప్పుడు, మనవడు “అయితె, నేను కూడా, మీరు ముసలి వారైతే, రోజు సద్ధన్నమే, పెట్టలన్నామాట!!!” అనగానే పెద్ధ కొడుకు, కోడలికి, గుండెల్లో గునపం దిగినట్టు అయింది..
ఒక్కసారిగ, వాళ్ల తప్పు తెలిసి వచ్చింది వాళ్ళకి.. ఆ రోజు నుంచి సుబ్బయ్య ని, కొడుకులు, కోడళ్ళు బాగా చూసుకుంటున్నారు..
***
బైండ్ల గౌతమి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
నా పేరు గౌతమి.
నేను ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నాను. మాది నిజామాబాద్
Comments