ఎలా కావాల్సి వస్తే అలా...!
- Kasivarapu Venkatasubbaiah

- 1 day ago
- 2 min read
#KasivarapuVenkatasubbaiah, #కాశీవరపువెంకటసుబ్బయ్య, #ElaKavaalsiVastheAla, #ఎలాకావాల్సివస్తేఅలా, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Ela Kavaalsi Vasthe Ala - New Telugu Poem Written By - Kasivarapu Venkatasubbaiah Published In manatelugukathalu.com On 07/12/2025
ఎలా కావాల్సి వస్తే అలా - తెలుగు కవిత
రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య
నీవు చీకటి ముసుగులోంచి చూస్తే
వికృతంగా కాక సకృతంగా ఎలా కనిపిస్తాను.
ముసుగు తీసి అన్నా అని పలుకరిస్తే
ఆత్మీయంగా ఆదరిస్తాను.
తమ్ముడా అని సంబోధిస్తే
నీ రక్షణ భారం నేనే వహిస్తాను.
నీవు అసహనంతో ద్వేషిస్తే
నేను ఉగ్రరూపమై జ్వలిస్తాను.
నీవు స్నేహ హస్తం చాచి మిత్రమా అన్నంతనే
కరిగి నీరై సహకరిస్తాను.
అనంత యుగాల నుంచి
స్త్రీకి రక్షా కవచంగా నిల్చి వస్తున్నవాణ్ణి.
నేను దేనిలోనూ దేనితోనూ
ఏ అస్తిత్వ సిద్ధాంతంతోనూ పేచిలేనివాణ్ణి.
రాయీరప్పా, చెట్టూచేనూ, పుట్టాగుట్టా
కడాఖరుకు శత్రువులోను
విశ్వబ్రహ్మాండంలోని సమస్తంలోను
దైవత్వాన్ని దర్శించే విశాల ఒరవడి నాది.
నన్ను అద్యాంతం పరికించి చూడు!
నేనెవరినీ నాలుగు గోడల మధ్య నిర్బంధించిన వాణ్ణి కాను.
పరమ సత్యాన్వేషణను నియంత్రించిన నియంతను కాను.
నన్ను వ్యతిరేకించేవాణ్ణి, నన్ను ద్వేషించేవాణ్ణి
నేనేప్పుడూ హత్యీకరించే ఫత్వా జారీ చేసినవాణ్ణి కాను.
విగ్రహాన్ని, అవిగ్రహాన్ని, సశేశ్వరాన్ని, నిశేశ్వరాన్ని
వైదికాన్ని, అవైదికాన్ని, ద్వైతాన్ని, అద్వైతాన్ని, బౌద్ధాన్ని జైనాన్ని, క్రైస్తవాన్ని, ఇస్లాంని
ఆపేక్ష భావంతో ఎదకు హత్తుకున్నవాణ్ణి.
నీవు ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టి రూపంగాను
ఏ తాత్విక కోణంతో చూస్తే ఆ తత్వంగాను
ఏ మూసలో పోస్తే పాత్రాకారాన్ని పొంది
నీకు ఎలా కావాల్సి వస్తే అలా అనుకూలించే వాణ్ణి.
నా వేదక్షోణి మహా గమనంలో
ఆవలింత కాలంలో
హూణులు, హీనులు, యవనులు
తుచ్చులు, ముచ్చులు, మ్లేచ్చులు
అప్రాచ్యులు, అహంకారజాత్యులు
శకులు, శాత్రపులు
నా కృతుల్ని, ఆకృతుల్ని, కళాకృతుల్ని
దహన ధ్వంసీకరించిన మరుక్షణమే
వారందరినీ సహనంతో సంస్కరించుకొని
నాలో నింపుకొన్న అపురూప నైజం నాది.
అగ్రజులు అధములుగా భాగిస్తున్న
మాయా విభాగాల్ని చెరిపేసి
అనేకత్త్వంలో ఏకత్వం సాధించి
సకల తత్వాలను, సమస్త మతాలను
అఖిల ధర్మమార్గాలను, సర్వ నీతి సూత్రాలను
నాలో సమ్మీళీకరించుకొని
ఏక మహా సమ్మిశ్రమ సమూహ సహా జీవన ప్రస్థానానికి
అగ్రభాగాన నిలవడమే నా తత్వం నా మతం.
ఆదిలోనే సర్వప్రాణి సమానత్వవాదాన్ని
ప్రవర్తీకరించుకున్న మహా సాంఘీకుణ్ణి నేను.
లౌకిక సామరస్య పరిపుష్టికి
ప్రత్యామ్నాయం నేనే - ప్రతిరూపాన్ని నేనే.
------
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
పేరు కాశీవరపు వెంకటసుబ్బయ్య.
పుట్టింది 1960లో.
చదివింది డిగ్రీ.
నివాసం ఉంటున్నది కడప జిల్లా ప్రొద్దుటూరులో.
అమ్మానాన్నలు - చిన్నక్క, వెంకటసుబ్బన్న.
భార్య - కళావతి.
సంతానం - రాజేంద్ర కుమార్ , లక్ష్మీప్రసన్న, నరసింహ ప్రసాద్ .
కోడలు - త్రివేణి. అల్లుడు - హేమాద్రి (సాగర్). మనుమరాలు - శాన్విక. తన్విక
మనుమడు - దేవాన్స్ విక్రమ సింహ
రచనలు - ఎద మీటిన రాగాలు' కవితా సంపుటి, 'తుమ్మెద పదాలు' మినీ కవితల సంపుటి,
'పినాకిని కథలు' కథల సంపుటి.
రానున్న రచనలు - 'చమత్కార కథలు' చిన్న కథల సంపుటి. 'పౌరాణిక పాత్రలు, చారిత్రక వ్యక్తులు' కథల సంపుటి.
సన్మానాలు సత్కారాలు - సాహితీమిత్రమండలి.
పెన్నోత్సవం 2004.
జార్జి క్లబ్ వారు,
ప్రొద్దుటూరు నాటక పరిషత్.
యువ సాహితీ. గాజులపల్లి పెద్ద సుబ్బయ్య అండ్ సుబ్బమ్మ గార్ల సేవా సమితి.
స్నేహం సేవా సమితి.
కళా స్రవంతి.
తెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ.
NTR అభిమాన సంఘం.
తెలుగు రక్షణ వేదిక
వండర్ వరల్డ్ రికార్డు కవి సత్కారం.
గోదావరి పుష్కర పురస్కారం.
కృష్ణా పుష్కర పురస్కారం.
స్వామి క్రియేషన్స్.
కృష్ణదేవరాయ సాహితీ సమితి.
భానుమతి స్వరం మీడియా.
కళాభారతి. కొలకలూరి ఇనాక్ జాతీయ కవితా పురస్కారం అందుకున్నాను




Comments