ఎండిన నేల - పండిన పంట
#PallaVenkataRamarao, #పల్లావెంకటరామారావు, #EndinaNelaPandinaPanta, #ఎండిననేలపండినపంట, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Endina Nela Pandina Panta - New Telugu Story Written By - Palla Venkata Ramarao Published In manatelugukathalu.com On 05/03/2026
ఎండిన నేల - పండిన పంట - తెలుగు కథ
రచన: పల్లా వెంకట రామారావు
“ఊరంతా కరువు… పంటలు ఎండిపోయాయి. కానీ ఒక రైతు పొలంలో మాత్రం పచ్చని పంట రెపరెపలాడుతోంది… అది ఎలా సాధ్యమైంది?” పల్లా వెంకట రామారావు గారి ఎండిన నేల - పండిన పంట కథలో ఆ కిటుకు తెలుసుకోండి. |
అది ఒకనాటి పల్లెటూరు. ఆకాశం నిప్పులు కురిపిస్తోంది, భూమి బీటలు వారుతోంది. ఎక్కడ చూసినా ఎండిన నేల, నిస్సారమైన జీవితాలు. ఈ దుర్భిక్షంలో కూడా ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం అందరినీ విస్మయానికి గురిచేసింది. అదే చంద్రయ్య పొలం. ఊరంతా ఎండిపోయి, పంటలు మాడిపోతుంటే, చంద్రయ్య పొలంలో మాత్రం పచ్చని మొక్కలు రెపరెపలాడుతున్నాయి.
పోయిన ఏడాది వరకు పరిస్థితులు ఇలా లేవు. మంచి సారవంతమైన భూములు. వానలు పడటంతోటే భూములు సస్యశ్యామలమయ్యేవి. ఈ ఏడు వర్షాభావంతో ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఒక రోజు, చంద్రయ్య మిత్రుడు సహదేవుడు అక్కడికి వచ్చాడు. అతని కళ్లలో ఆశ్చర్యం కనిపిస్తోంది.
"చంద్రయ్యా, ఇది ఎలా సాధ్యం? నీ పొలంలో పంటలు పండితే, నా పొలంలో ఎందుకు ఎండిపోయాయి?" అని అడిగాడు. ఆ మాటల్లో ఈర్ష్య కాదు, నిస్సహాయత కనిపిస్తోంది.
చంద్రయ్య తన పొలాన్ని చూసి గర్వంగా నవ్వాడు. "మిత్రమా! నువ్వు ఇప్పటికీ గతంలోనే బ్రతుకుతున్నావు. వర్షం కోసం ఆశగా ఎదురు చూస్తూ, నష్టం కోరి తెచ్చుకున్నావు. నేనేమి చేశానో తెలుసా? ఈ ఏడాది వర్షం రాదని నేను ముందుగానే ఊహించాను. నా పొలంలోని బావిని బాగా తవ్వి పూడిక తీయించాను, అందులోని నీటిని వృథా చేయలేదు. ముందుగానే నిల్వ చేసుకున్న విత్తనాలను వాడుకున్నాను. అదికూడా నీటిని తక్కువగా వాడే శనగ పంట వేశాను" అని చంద్రయ్య చెప్పాడు.
సహదేవుడు "నీ బావిలో నీరు ఎందువల్ల తగ్గలేదు?" అని అడిగాడు.
దానికి చంద్రయ్య చిరునవ్వుతో " నేను నా పొలం చుట్టూ ఉన్న పొదలను కత్తిరించలేదు. ఆ చెట్లు, పొదల వల్ల నీరు భూమిలోకి ఇంకింది. దాని వల్ల నా బావిలో నీరు తగ్గలేదు. వృధాగా పోయే నీటిని చిన్న కాలువ ద్వారా బావి చుట్టూ ఇంకిపోయేలా చేశాను. ఎండ వేడికి నీరు ఆవిరి కాకుండా బావి పైన మూత వేసాను" అని అన్నాడు.
"అదిసరే ఈ సారి కరువు వస్తుందని ఎలా ఊహించావు?" అడిగాడు సహదేవుడు.
"మా ఇంట్లో పూర్వకాలం నుంచి పంచాంగం చదవడం అలవాటు. గత కాలం నాటి పంచాంగం పుస్తకాలు ఉన్నాయి. పంచాంగం అనేది మన పూర్వీకులు మనకు అందించిన వెలలేని ఆస్తి. అందులో ఏ సంవత్సరం ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయో నమోదు చేసి ఉంటారు. ఉగాదినాడు ఆ సంవత్సరం పరిస్థితులు ఎలా ఉంటాయో పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవచ్చు.
ఇది మన పూర్వీకులు ఎంతో ముందు చూపుతో పెట్టిన ఆచారం. అలా నేను గత కాలం నాటి ఋతువులను గమనించి ఈ ఏడు కరువు రాబోతుందని తెలుసుకున్నాను. ప్రతి పన్నెండేళ్ళకోసారి అనావృష్టి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అది తెలుసుకుని దానికి తగినట్లు ఏర్పాట్లు చేసుకున్నాను" అని చెప్పాడు.
సహదేవుడు తల వంచుకుని "నాకు కూడా నీలా తెలివి ఉంటే బాగుండు" అని నిస్సహాయంగా అన్నాడు.
"మిత్రమా! బాధపడకు. మనం ఏ రంగంలో బ్రతుకుతున్నామో దానికి సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకోవాలి. ప్రతి పని ఒక విద్య. నిరంతరం అధ్యయనం చేస్తుండాలి" అని చంద్రయ్య చెప్పాడు. ఆ మాటలు సహదేవుడి హృదయంలో ఒక కొత్త ఆశను నింపాయి.
***************
పల్లా వెంకట రామారావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: పల్లా వెంకట రామారావు
Profile Link:
జన్మస్థలం: ప్రొద్దుటూరు, కడప జిల్లా.
జననం: 1974
తల్లిదండ్రులు:కీ.శే. శ్రీ రామయ్య, శ్రీమతి ఓబులమ్మ
చదువు: ఎం.ఎ (తెలుగు), టి.పి.టి, డిప్లమో (కంప్యూటర్స్) (జర్నలిజం)
ఉద్యోగం: స్కూల్ అసిస్టెంట్ (తెలుగు)
అభిరుచి: సాహిత్యం, దర్శకత్వం, నాణేల సేకరణ, యాత్రలు చేయడం(యూట్యూబ్ వ్లాగ్స్) travel India telugu
(యూట్యూబ్ చానల్ , Id:@travelIndia82)
రచనలు: 'ది అటాక్' నవల, పూలుముళ్ళు, (మినీ నవల) గేయం,
వచన కవితలు, హైకు, నాటిక, కథలు, పద్యం,
బాలల కథలు, జోక్స్, వ్యాసాలు, వంటివి. సాక్షి, ఈనాడు, వార్త,అల
ఉపాధ్యాయ వాణి, బాలభారతం, చంద్రబాల, సూర్య, బాలల
బొమ్మరిల్లు, ఆంద్రభూమి వంటి పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
సత్కారాలు: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, పండిత పరిషత్ వారిచే స్టేట్ అవార్డు,రాజుపాళెం
మండలం వారిచే ఉగాది పురస్కారం; అటా వారిచే , సాహితీ మిత్ర మండలి, యువ
కళావాహిని, కడప జిల్లా రచయితల సంఘం,రామరాజ భూషణ సాహితీ పీఠం, అనంతపురం జిల్లా
రచయితల సంఘం, తెలుగు కళా వేదిక,వేమన సాహితీ కళాపీఠం, కొని రెడ్డి ఫౌండేషన్ , తెలుగు రక్షణ
వేదిక, కర్ణాటక తెలుగు రచయితల సంఘం, మద్రాసు తెలుగు విశ్వవిద్యాలయం సంస్కృతి స్వచ్ఛంద సంస్థ వంటి సంస్థలచే సత్కారం.





Comments