'Family Cricket' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 15/10/2023
'ఫ్యామిలీ క్రికెట్' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
క్రికెట్ సీజన్ అంటే.. ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆఫీస్ కు లీవ్ లు.. కాలేజీ కు డుమ్మాలు... ఇంట్లో అంతా అదే ఫీవర్ తో టీవీ కు అతుక్కుంటారు.
రాజారావు ది చిన్న ఫ్యామిలీ. తన భార్య రమ, కొడుకు సందీప్. అందరికీ క్రికెట్ అంటే మహా ఇష్టం. కానీ.. ఎవరూ బయట పడరు. అందరికీ ఫేవరెట్ అయిన పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ టైం వచ్చింది.
"అమ్మా! రేపు క్రికెట్ మ్యాచ్ ఉంది కదా! కాలేజీ కి వెళ్ళను. ఇంట్లోనే మ్యాచ్ చూస్తాను"
"అలా కుదరదు సందీప్!... కాలేజీ మానడం వద్దు అని గట్టిగా చెప్పింది తల్లి రమ. అక్కడే ఉన్న తండ్రి, అందుకుని... క్రికెట్ ఏమిటిరా?... కాలేజీ మానేస్తే, కాళ్ళు విరగ్గొడతాను"
"అలాగే నాన్నా!"
***
"రమా! ఓయ్ రమా!"
"ఏమిటండీ! ఏమైనా కావాలా?"
"సందీప్ కాలేజీ కు వెళ్ళాడు కదా!"
"అవును వెళ్ళాడు... ఎందుకు?"
"రేపు... రేపు.. ! రేపు ఆఫీస్ కు సెలవు పెడతాను.. ఏమంటావు?"
"ఎందుకో?"
"మ్యాచ్ ఉంది గా... చూడడానికి"
"ఆఫీస్ కు వెళ్ళండి.. అసలే సెలవులు లేవని చెప్పారు గా... వద్దండీ!"
"నువ్వే నయం రమా! ఇంట్లో ఉండి, ఎంచక్కా మ్యాచ్ చూస్తావు... "
"లేదండీ! మీరు ఈరోజు పేపర్ చూడలేదా! మన సిటీ లో అంతా రేపు పవర్ ఉండదంటా! ఏదో పెద్ద రిపేర్ వర్క్ అంటా!"
"మ్యాచ్ ఉన్నప్పుడే ఈ పవర్ కట్ ఉండాలా?"
"నేను ఎలాగో బయటకు వెళ్ళాలి లెండి!" అంది రమ
మర్నాడు ఉదయం... మొదట సందీప్ రెడీ అయి.. బ్యాగ్ వేసుకుని కాలేజీ కు వెళ్ళిపోయాడు.. తర్వాత రాజారావు రెడీ అయి ఆఫీస్ కు బయల్దేరాడు.
(అందరూ.. బుద్ధిగా నా మాట విని బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎంచక్కా నేను స్టేడియం కెళ్ళి మ్యాచ్ చూడొచ్చు.. అనుకుంది రమ)
"ఒసేయ్ గీతా! ఎక్కడ ఉన్నావు! మా ఆయనా, సందీప్ వెళ్ళిపోయారు.. నన్ను వచ్చి పికప్ చేసుకోవే!"
"అలాగే! వస్తున్నాను!"
"ఇంట్లో భలే మేనేజ్ చేసి వచ్చేసావే! నువ్వు గ్రేట్ రమా!"
"అవునే! లేకపోతే నాతో ఆడుకోరూ.. మా అయన, మా అబ్బాయి... "
"మొత్తం మీద స్టేడియం కు చేరుకున్నాం. క్రౌడ్ బాగా ఉన్నారే... మనకి లక్కీగా టికెట్స్ దొరికాయి" అంది రమ.
"ఇండియా బ్యాటింగ్.. తెగ రన్స్ కొడుతున్నారు కదే! ఫోర్లు.. సిక్స్ లు.. సూపర్... అవును! అక్కడ ఎవరా అబ్బాయి?.. భలే డాన్స్ చేస్తున్నాడే! చూస్తే, మీ సందీప్ లాగ ఉన్నడే... "
"మావాడు చాలా మంచి అబ్బాయి... కాలేజీ కు వెళ్ళాడు... ఇక్కడకు వచ్చే ఛాన్స్ లేదు!" అంది రమ.
"సరిగ్గా చూడవే!... ఆ డాన్సులు.. వాడు... నిన్ను ఇక్కడ చూసాడనుకో.. నీకు క్లాసు తీసుకుంటాడు మరి.. చూసుకోవే రమా!"
"ఒసేయ్.. చూసేసాడే... ఇక్కడకే వస్తున్నాడు... ఈ కోహ్లీ మాస్క్ వేసుకోవే.. నేను ఈ రోహిత్ మాస్క్ వేసుకుంటాను.. "
"ఇందాకల ఇక్కడే చూసానే... కొంచం మాస్క్ తీస్తారా కోహ్లీ అండ్ రోహిత్?" అడిగాడు సందీప్.
"మనం దొరికి పోయామే... తీసేయ్యవే మాస్క్"
"అమ్మా! నువ్వే కదా! ఇందాకలే చూసానులే... "
"అయినా నువ్వేంటి ఇక్కడ?" అడిగింది రమ.
"నువ్వెందుకు వచ్చావో... నేనూ అందుకే... మనం అంతా క్రికెట్ ఫ్యాన్స్ కదా!"
"నాన్న కు మాత్రం చెప్పకు రా ! తిడతారు"
"అలాగే అమ్మా! నాకు ఇంటికి వెళ్ళాక బిరియానీ చేసి పెట్టాలి మరి"
"కొంచం వెనుకకు చూడండి ప్లీజ్!"
ఎవరో అని తల్లీ కొడుకు చూస్తే.... అక్కడ రాజారావు ముఖానికి ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ పూసుకుని... గుర్తు పట్టకుండా అక్కడే ఉన్నాడు... అంతా వింటున్నాడు.
"అయ్యో! నాన్న! మీరూ ఇక్కడే ఉన్నారా!"
"అయితే అందరు క్రికెట్ ఫ్యాన్స్ ఇక్కడకే.... అందరూ దొరికిపోయాం... "అంది గీత.
"లెట్స్ సపోర్ట్ ఇండియా!"
******
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు తాత మోహనకృష్ణ
Comments