పక్కింటి అమ్మాయి నవ్వింది..

'Pakkinti Ammayi Navvindi' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 14/10/2023
'పక్కింటి అమ్మాయి నవ్వింది' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
అమ్మాయి నవ్వితే... పౌర్ణమి నాడు వెన్నెలంత చల్లగా ఉంటుందని, మా గురువుగారు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. అది అక్షరాలా నమ్ముతాను నేను. అలా.. నవ్వుతో నన్ను ఆకట్టుకునే అమ్మాయి కోసమే.. నా అన్వేషణ. కానీ ఇంతవరకూ.. నా నవ్వుల రాణి జాడ లేదు.
నా పేరు కళ్యాణ్.. సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు పెళ్లి సంబంధాలు ఎన్ని చూస్తున్నా... అమ్మాయి నవ్వు బాగోలేదని రిజెక్ట్ చేస్తూనే ఉన్నాను. ఇలా కాదని.. మా నాన్న నన్నే నచ్చిన అమ్మాయిని చూసుకోమన్నారు...
మేము ఉండే ఫ్లాట్ నుంచి లిఫ్ట్ వరకు చేరుకోవాలంటే... పక్క ఫ్లాట్ దాటుతూ వెళ్ళాలి... సాఫ్ట్వేర్ జీవితం అంతా హడావిడి మయమే. రోజూ ఉదయం హడావిడిగా బయల్దేరుతున్నప్పుడు, ఆ ఫ్లాట్ వైపు దృష్టి వెళ్తుంది. అక్కడ ఒక ఆంటీ అంకుల్ ఉంటారు. పిల్లలు ఫారిన్ లో ఉంటారు. వాళ్ళకే అమ్మాయి ఉంటే, నా లక్ కోసం ట్రై చేసేవాడిని.
అలా.. ఒక రోజు హడావిడి గా ఆఫీస్ కు వెళ్తున్నప్పుడు.. పక్కింటి తలుపు తీసి ఉంది.. ఒక అందమైన నవ్వు నన్ను ఆకర్షించింది... ఎవరా! అని వెనుకకు వచ్చి మరీ చూసాను. నీట్ గా రెడీ అయిన ఒక అందమైన అమ్మాయి, తెగ నవ్వుతోంది. ఆమె డోర్ లోంచి బయటకు చూసి నవ్వుతుంది. ఏదో అనుకుని పెద్దగా పట్టించుకోలేదు. మర్నాడు ఉదయం ఎందుకో... మెల్లగా పక్కింటి అమ్మాయి కోసం చూసాను. మళ్ళీ అదే నవ్వు.. ఈసారి ఆ నవ్వు చూస్తే... ఆమె నా కోసమే పక్కింటికి వచ్చిందని అనిపించింది.
ఇలా రోజూ... నవ్వుతో నా మనసు దోచుకుంది ఆ అమ్మాయి. వెంటనే ఈ విషయం ఇంట్లో చెబుదామని అనుకున్నాను.
"అమ్మా! మన పక్కింట్లో ఎవరో అమ్మాయి కొత్తగా వచ్చింది. నన్ను చూసి తెగ సిగ్నల్ ఇచ్చేస్తుంది... రోజూ ఆ నవ్వుతో, నా మనసు దోచేసింది"
"అయితే ఏమంటావు?
"వెళ్ళి మాట్లాడండి ప్లీజ్!"
"అలాగే రా! నీ కోసం.. సాయంత్రం మాట్లాడడానికి వెళ్తాము"
సాయంత్రం కళ్యాణ్ అమ్మ నాన్న పక్కింటికి వెళ్లారు. కళ్యాణ్ ఎంతో ఆత్రుతగా ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. కానీ ఫోన్ రాలేదు. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే అడిగేసాడు తల్లిని.
"నువ్వు ఆ అమ్మాయిని మర్చిపో రా కళ్యాణ్!"
"ఎందుకు?"
"చెప్పింది విను!"
"ఏమైందో చెప్పకుండా ఏమిటి ఈ సస్పెన్స్?"
***
మేము ఎంతో ఆశ తో వెళ్ళాము. లోపలికి పిలిచి కూర్చోమన్నారు. నువ్వు అన్నట్టు, ఆ అమ్మాయి ఎదురుగా సోఫా లోనే కూర్చుంది... ఆ అమ్మాయి నవ్వుతూనే ఉంది... చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాము...
"ఎవరండీ ఈ అమ్మాయి? చాలా లక్షణంగా ఉంది!"
"నా తమ్ముడి కూతురు.. ఈ మధ్యే వచ్చింది!"
"ఏమీ అనుకోక పొతే... ఒక విషయం. మీ అమ్మాయి మా అబ్బాయికి బాగా నచ్చింది.. మీరు ఒప్పుకుంటే, తర్వాత విషయాలు మాట్లాడుకుందాం!"
"మా అమ్మాయి మీ అబ్బాయి తో మాట్లాడిందా?"
"అవునండీ... నవ్వుతూ... ఉందంట చూసినప్పుడల్లా!"
"మా అమ్మాయి అలా నవ్వుతూనే ఉంటుంది... అదే దానికి ఉన్న అనారోగ్యం"
"అనారోగ్యమా?"
ఇదొక వింత జబ్బు అని డాక్టర్ చెప్పారు. ఒకసారి స్కూటీ మీద వెళ్తుంటే, కింద పడి... అలాగ అయిపోయింది... ఆమె ఎప్పుడు ఏడిస్తే, అప్పుడు ఈ జబ్బు తగ్గుతుందని డాక్టర్స్ చెప్పారు... ఎప్పుడు ఏడుస్తుందా!.. అని చూస్తున్నాము.
"అయ్యో పాపం! అంతా బాగా అయిపోతుంది లెండి.. మేము ఇంక వెళ్తాం. ఏమైనా అవసరమైతే అడగండి... !"
***
"అమ్మా! ఇంక చాలు... నేను పడుకోవడానికి వెళ్తున్నాను... " అని క్లీన్ బౌల్డ్ అయిన బ్యాట్స్‌మన్ లాగ.. వెళ్ళిపోయాడు కళ్యాణ్.
******
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
https://www.manatelugukathalu.com/profile/mohanakrishna
Youtube Play List Link:
https://www.youtube.com/playlist?list=PLUnPHTES7xZqBiHIEhQgw3iQJWx6Vverc
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు తాత మోహనకృష్ణ