ప్యాషన్!
- A . Annapurna
- Jun 10
- 4 min read

Fashion - New Telugu Story Written By A. Annapurna
Published in manatelugukathalu.com on 10/06/2025
ప్యాషన్! - తెలుగు కథ
రచన: ఏ. అన్నపూర్ణ
(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)
ప్రఖ్యాత సినీ నటుడు ప్రవీణ్ చాలా రోజులుగా వార్తల్లోకి రావడంలేదు. వాణిజ్య ప్రకటనల్లో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కనిపించే వ్యక్తి. టీవీ న్యూస్‌లో వినిపించే పేరు.. హఠాత్తుగా మాయమయ్యాడు.
కొందరేమో ఆరోగ్యం బాగాలేదు. అంతుపట్టని వ్యాధితో సతమతమవుతూ ట్రీట్మెంట్కి విదేశాలు వెళ్ళేడు, అని, కుటుంబంతో సెలవులు గడుపుతున్నాడు, తన సొంత సినిమాను ఆస్కార్ అవార్డు నామినేషన్ కోసం హాలీవుడ్లో ప్రయత్నం చేస్తున్నాట్ట.. అక్కడే తిష్టవేసి. ఇలా తలా తోకా లేని పుకార్లు వస్తున్నాయి. అసలు సంగతి తెలియడంలేదు. బంధువులను అడిగితె మాకు తెలియదు.. అన్నారు.
చివరికి ప్రవీణ్ సెక్రటరీని పట్టుకుంటే ''త్వరలో ప్రవీణ్ ప్రెస్ మీట్ పెడతారు. మీకు చెబుతాను''అన్నాడు.
మరికొన్ని ఊహాగానాలు కలబోసి వీడియోలు చేయడం మానలేదు పత్రిక, టీవీ రిపోర్టర్లు.
అలా కొద్దికాలం గడిచింది.
చివరికి ఒకరోజు అందరి ఆలోచనకు బ్రేక్ వేస్తూ ప్రెస్ మీటుకి పిలుపువచ్చింది అందరికీ. ప్రవీణ్ సెక్రటరీనుంచి. ప్రెస్ మీట్ రోజున అన్ని ఛానెల్స్, పత్రికా రిపోర్టార్లు వచ్చేసారు.
చెప్పిన టైముకి గంట ఆలస్యంగా ప్రత్యక్షమయ్యాడు ప్రవీణ్.
కొత్త హెయిర్ స్టైల్‌తో కొత్తగా గడ్డం పెంచి, కాస్మెటిక్ సర్జరీచేయించుకున్నరూపంతో.. గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. సన్నగా ట్రిమ్ముగా వున్నాడు. ఎవరో హాలీవుడ్ నటుడు మొహంమీద గాటుపడి అది కనిపించకుండా ఉండటానికే గడ్డం అడ్డుగా
పెంచుకుని మానేజ్ చేసాడు. అది ప్యాషన్‌గా అనుకుని అందరూ ఫాలో అయ్యారు.
ఇన్నాళ్లూ ఏమైపోయాడో ఎందుకు కనిపించలేదో అందరికీ అర్ధం అయిపొఇంది. ఏభైఏళ్లు వస్తుంటే శరీరంలోమార్పులు వస్తాయి. వాటిని కవర్ చేయడానికి విదేశాలకు వెళ్లి వస్తూ వుంటారు. అదేమీ శాశ్వత ట్రీట్మెంట్ కాదు. అయినా ఆశ! ఇంకా సినిమాలు చేయాలి. డబ్బు సంపాదించాలి. యంగ్‌మాన్ లా కనబడాలి.
అభిమానులు గుమిగూడాలి. తొక్కిసలాటలు జరగాలి. ఏమాత్రమూ ఈ హీరోకి ప్రజల్లో క్రెజ్ తగ్గలేదని హోరెత్తించి పబ్లిసిటీ ఇచ్చుకోవాలి. ఇదే ధ్యాస.
''ఇప్పుడు ఈ రంగులూ హంగులూ ఎన్ని చేసుకున్నా అసలురూపం వెలిసిపోయింది'' అని మనసులో అనుకుని, పైకి ''వెరీ స్మార్ట్.. మళ్ళీ మీరు సినీ రంగాన్ని మరోపదేళ్లు పరిపాలిస్తారు. మీరా మీ అబ్బాయా అని తికమక పడిపోయాము. అంట హ్యాండ్సమ్ గా వున్నారు ప్రవీణ్. '' అంటూ ఆకాశానికి ఎత్తేసారు. అతను ఇచ్చిన డబ్బు ఫోన్ పే లో చూసుకుని మురిసిపోయి.
'నా మొహం ! ఈయనగారికి అంత సీనేమీలేదని నాకు తెలుసు - మీకు తెలుసు.' అనుకున్నాడు సెక్రటరీ.
ప్రవీణ్క్ అభినందనలు శుభాకాంక్షలు బెస్ట్ విషెస్ చెప్పి అంతా వెళ్లిపోయారు.
మరో వారానికి నిర్మాతలు దర్శకులు విలేకరులను కొందరు మిత్రులను పిలిచి డ్రింక్ పార్టీ ఇచ్చాడు ప్రవీణ్, ఛాన్సులు ఏమైనా ఇస్తారని.
ప్రవీణ్ గడ్డం ఎందుకు పెంచాడు ? హాలీవుడ్ స్టార్లును చూసా ! వాళ్ళు తెల్లగా మెరిసి పోతూ వుంటారు. కనుక నల్లటి గడ్డం అందంగా ఉంటుంది. ఏ ఫ్యాషన్ ఎక్కువకాలం ఉండదు.. అక్కడ.
వాళ్ళు మార్చే టైముకి మనవాడు మొదలు పెట్టేడు. ఇకనుంచి ఈ పిచ్చి ఫాలో అవుతారు మన జనం.
ముసలి ముతక యువత మొదలు పెట్టేస్తారు.
అసలే కోవిద్ వచ్చినప్పటినుంచి సినీ ఫీల్డ్ నష్టాల్లో కొట్టుకుంటోంది. చిన్న సినిమాలు టీవీ సీరియల్స్ అయితే పెట్టుబడి అంతగా ఉండదు. వచ్చినా పోయినా నష్టం ఉండదు. ఇన్కమ్ టాక్స్ అయినా తగ్గుతుంది. ఈ ప్రవీణ్ ని బుక్ చేసి సినిమా తీస్తే అడుక్కోడానికి కూడా దారివుండదు. అని డిసైడ్ అయిపోయారు. ఫ్రీగా వస్తే వదులుకోని వాళ్ళు, సుష్టుగా డిన్నర్ లాగించి ఇళ్లకు పోయారు..
ఈ గడ్డం ఫ్యాషన్ ఎంతవరకూ వెళ్లిందీ అంటే పెళ్లిచూపులు వెడితే మొహం మీద ముడతలు ఉన్నాయో, మచ్చలు ఉన్నాయో యాక్సిడెంట్ దెబ్బలు ఉన్నాయో తెలియడంలేదు అమ్మాయిలకి.
ఇంతకీ ఈ ఫ్యాషన్ వలన గెడ్డాన్ని నీట్‌గా వుంచుకోడానికి చాలా శ్రమ ఖర్చు ఉంటుంది. కనుక సెలూన్ కి క్యూ కట్టేరు జనం. కొంతకాలం సెలూన్లు వర్ధిల్లేయి.. సెలూన్ వాళ్ళు డిమాండ్ పెరిగి ఖర్చు పెంచేశారు. రూ.. 500 నుంచి రూ 999 కి పెంచేశారు. ఇది చూసి ఇంట్లో తండ్రి వంద రూ: లకంటే ఇవ్వను. పిచ్చివేషాలు వేయద్దు అని చీవాట్లుపెట్టేడు. ఇక ఫ్యాషన్ మానుకోలేక అమ్మలనూ కాకా పట్టి రెడీమెడ్ గడ్డాలు అతికించుకున్నారు. వాటికి ఎలర్జీ వచ్చి డాక్టర్ బిల్లు తడిసిమోపెడు అవడమేకాదు ఏడాది బాధలు పడ్డారు. ఎవడో సినీ నటుడిని చూసి ఫాలో అయితే వచ్చే నష్టం తెలిసివచ్చింది.. జనాలకి.
ఇంతకీ ప్రవీణ్ ఎందుకు గడ్డం ఫ్యాషన్ మొదలు పెట్టేడు అంటే చాలాకాలం మేకప్పులకోసం వాడిన కాస్మెటిక్స్ క్రీములు, కలర్స్ వాడటంవలన మొహం మీద చర్మ వ్యాధి వచ్చింది. అది తెలిస్తే జనాలు నాకు ఎదో జబ్బువచ్చింది అని ప్రచారం చేస్తారు. 'అసలే డిమాండు తగ్గింది. చిన్న కుర్రాళ్ళు తక్కువ రేటుకే పోటీగా వచ్చేసారు. ' అని వ్యాధిని నయం చేసుకోడానికి అమెరికా వెళ్ళేడు. జబ్బుకుదిరింది. కానీ మొహం వికారంగా తయారయింది. దానితో మొత్తం బాడీకి మరమ్మత్తు చేయిన్చుకున్నాడు.
అక్కడి డాక్టర్ “ఎంత రిపేరు చేసినా ఇక నీ రూపం ఇంతే. గణపతికి ఏనుగు తలా అతికించినట్టు నీకు గాడిద తలా- గుర్రం తలా అతికించాలి. ఎందుకువచ్చిన గోల సింపుల్ గడ్డం పెంచుకోండి. నెత్తిమీద విగ్గు, గెడ్డం దొరుకుతాయి. జీవితకాలం వాడుకోండి. కళ్ళు ముక్కు చెవులు పళ్ళు ఎలాగా
సర్జరీలు చేసి మార్చుకున్నవే ! మీ సంపాదనలో గెడ్డాలు విగ్గుల ఖర్చు ఎంత.. చాలా తక్కువ.” అని సలహా ఇచ్చారు..
అందుకే కొంతకాలం అమెరికాలో వున్నాడు. ఇలా ప్రవీణ్ అనే నటుడు ప్రణవ్ అనే పేరుతొ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అని అక్కడ పనిచేసే ఇండియన్ నర్సు తన మీడియా బాయ్ ఫ్రెండ్‌తో చెప్పేసింది.
ఇప్పుడు ఈ రంగు వెలిసిన హీరో ఎవరికీ కావాలి?
చవకగా వచ్చే కుర్రాళ్ళు వున్నారు. వాళ్ళతో సినిమాలు తీసుకుందాం అని నిర్మాతలు డిసైడ్ అయిపోయారు. పెద్ద హీరోలు అంతా కుటుంబ సభ్యులతో ఆట్టే ఖర్చులేకుండా సొంతంగా సినిమాలు తీసుకుని విదేశాల్లో షోలు వేసుకుంటున్నారు. డబ్బులు వచ్చినా రాకపోయినా మరో బిజినెస్ చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. గతకాల వైభవాన్ని వీడియోలు చేసుకుని యూట్యూబ్ లో ఎవడో తలమాసిన వాడిని పిలిచి నా అనుభవాలు అంటూ చెప్పి మురిసిపోతున్నారు.
నీతి: కాలమూ వయసూ ఆగవు. ఎవరైనా తల వంచాలి. గడ్డాలు విగ్గులు యవ్వనముకోసం ఆపరేషన్లు.. అన్నీ దండగ! ఉపయోగముండదు.
*******************
ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ
నాగురించి పరిచయం.
నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లుగారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంధకర్త. ''వారురాసిన మహర్హుల చరిత్ర'' టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. దానిమీద నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథవారి ''ఏకవీర '', శరత్ బాబు, ప్రేమ్ చంద్, తిలక్, భారతీ మాసపత్రిక. నాన్నగారు రాసిన వ్యాసాలూ ప్రింట్ అయినా తెలుగు -ఇంగిలీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్నా ;;ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ'' కి వచ్చే పిల్లల పత్రికలూ, వారం మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటు అయింది. పెళ్లి అయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు.
చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపుల తో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చారు. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమసంస్థ లో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను.. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే
వెళ్ళివస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, సాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనేవున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి అనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్ట్‌లలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,
ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.
(writing for development, progress, uplift)

Comments