top of page

గార్దభ ఆవేదన

#GardhabhaAvedana, #గార్దభఆవేదన, #గార్దభలహరి, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #పిల్లలకథలు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

గార్దభ లహరి - పార్ట్ 1


Gardhabha Avedana - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 10/06/2025

గార్దభ ఆవేదన - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


సృష్టిలో నాలుగు కాళ్ల జంతువుల్లో గార్దభం ( గాడిద ) శ్రమజీవి. గ్రామీణ ప్రాంతాల్లో రజకులు ( చాకళ్లు ) మురికి బట్టల్ని చాకిరేవుకి చేర్చడం, పట్టణ ప్రాంతాల్లో గృహనిర్మాణాలకు ఇటుకలు ఇసుక మన్ను మోయించడం, రెండుచక్రాల టైరుబళ్లకు కట్టి రవాణా సరుకులు చేర్చడం, పర్వత ప్రాంతాల పుణ్యక్షేత్రాల్లో డోలీలు కట్టి యాత్రికుల్ని మోయించడం వంటి పనులు చేయిస్తారు. 


ఎవరెన్ని పనులు చేయించుకున్నా బానపొట్టకు తగ్గ తిండి పెట్టక అర్దాకలితో కడుపు మాడుస్తారు. భాగవతంలో వసుదేవుడు గాడిద కాళ్లు పట్టుకున్నాడని గొప్పగా 

చెప్పుకున్నా నిజ జీవితంలో గార్దభాలకు అన్నీ కష్టాలే. 


 నిజానికి గార్దభం పుట్టినప్పుడు ఎంత ముద్దుగా ఉంటుందోవయసు పెరుగుతున్న కొద్దీ అందవికారంగా బండ గొంతుకతో జనాలు ఆట పట్టించే రీతిగా తయారవుతాయి. 

 

 భూమండలం మీదుండే గార్దభం మనసు ఆవేదనలో పడింది. మానవాళి భూమ్మీదుండే నాలుగు కాళ్ళ జంతువుల్లో మమ్మల్ని (గాడిదల్ని) చాలా అపహాస్యంగా చూస్తున్నారు. 


మా పుట్టుకలో ఎంత ముద్దుగా ఉంటామో వయసు పెరిగే కొద్దీ బానపొట్ట, చీపురు తోక, వికార ముఖం, అరటి డొప్పల చెవులు, ఏ జాతికి చెందని కాళ్ల గిట్టలు, భయంకర గొంతుక, పారపళ్లతో ఎబ్బెట్టుగా కనబడతాము. సృష్టిలో అటు అశ్వజాతికీ ఇటు జీరల గుర్రపు వర్గానికి కాకుండా చూసేవారికి నవ్వు కలిగించేలా జన్మనిచ్చాడు విశ్వ సృష్టికర్త బ్రహ్మదేవుడు. 


మానవాళి మా చేత బరువులు మోయిస్తూ బండచాకిరి చేయించుకుంటారు కాని కడుపు నిండా పట్టెడు మెతుకులు పెట్టరు. అర్దాకలితో మాడ పెడతారు. 


సృష్టి కర్త బ్రహ్మదేవుల వారు మా జాతి పట్ల అన్యాయం చేసారు. ప్రాణికోటిలో ప్రతి పక్షి, జంతువు ఏదో ఒక దేవతా వాహనంగా వినియోగించి గౌరవం, ఆదరణ కలగ చేసారు. మమ్మల్ని ఏ దేవుడు దేవతా తమ వాహనంగా పెట్టుకోరు. వికారంగా ఉండే మా కంఠం వింటే అందరూ నవ్వుకుంటారు. 


తన మనో వ్యథను సృష్టి కర్త బ్రహ్మ దేవునికి విన్నవించుకోడానికి బయలు దేరింది గార్దభం. మార్గమద్యలో నారదుల వారు ఎదురు పడి, "ఎక్కడికి బయలు దేరావు గానగంధర్వ గార్దభ రాజా ! " అని పలకరించాడు. గార్దభం తన గోడు చెప్పుకుంది. నారదుల వారు విశ్వకర్మ ఉనికిని తెలియ చేసారు. 


బ్రహ్మ గారు వేద పారాయణం చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. గార్దభం అక్కడికి చేరుకుని వినమ్రంగా ప్రణామం చేసి తన మనోవ్యథ చెప్పుకుంది. 


గార్దభ గోడు విన్న సృష్టి కర్త తను ప్రకృతిలో జీవకోటికి తలరాతలు రాస్తున్నప్పుడు మీ గార్దభ జాతి వంతు రాగా మీ పూర్వీకులు నా నాలుగు తలలకున్న గెడ్డాల వెంట్రుకలు చిందర వందరగా ఉంటే నోట్లోని పారపళ్లు బయటకు పెట్టి పక్కున నవ్వి అపహాస్యం చేసారు. అప్పుడు నాకు క్రోధం కలిగి మీ జాతి జంతువులు భూమ్మీద మానవాళిలో వికటంగా అపహాస్యంగా ఉంటారని శాపమిచ్చాను. 


అప్పటి నుంచి భూమ్మీద మీ గార్దభ జాతి అలాగే మనుగడ సాగిస్తోంది. నా శాపానికి నుదుట వ్రాతకీ తిరుగులేదు. ఈ జన్మలో మంచి కర్మ చేసుకుంటే వచ్చే జన్మలో మంచిగా పుడతారని తరుణోపాయం చెప్పి వెనక్కి పంపాడు బ్రహ్మ దేవుడు. 


 సమాప్తం


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


Comments


bottom of page