
'Followers' - New Telugu Story Written By Pitta Gopi
'ఫాలోయర్స్' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
ఒకప్పుడు లాండ్ లైన్ తో ఇంటిల్లపాది ఒకరి తర్వాత ఒకరు సరదాగా ఫోన్ మాట్లాడితే
ఈ రోజుల్లో ఏ మనిషి వద్ద చూసినా.. ఫోన్ తప్పకుండా కనపడుతుంది. అసలు చదువుకున్నోడైనా..
చదువుకోని వాళ్ళైనా.. ఫోన్ వాడకం కామన్ పాయింట్.
అలా అలా... ఈ ఫోన్ ఇంటిల్లపాది పాకుతు ఇంట్లో ప్రతి ఒక్కరికి ఫోన్ ఉండేంత అవసరం ఏర్పడింది.
ఇక్కడితో ఆగక అటు వృద్ధులకు, ఇటు పిల్లలు కు కూడా పిచ్చెక్కించేలా తయారయింది ఈ ఫోన్.
ముఖ్యంగా పిల్లలు ఈ ఫోన్ కి బాగా అతుక్కుపోతున్నారు. అందుకు కారణం ఒకవైపు ఆన్లైన్ చదువులు కాగా, తల్లిదండ్రులే చిన్నప్పటి నుండి అలవాటు చేస్తున్నారు.
సరదాగా పిల్లలతో ఆటలాడుతు వారిని సాగనంపల్సింది పోయి ఇంట్లో తమ పనులుకు ఆటంకం కలగకుండా ఫోన్ ఆన్ చేసి మరీ ఇస్తున్నారు.
ఫోన్ వలన కొన్ని మంచి ఫలితాలు ఉన్నా...
దుష్పరిణామాలు ఎక్కువ అని అందరికీ తెలిసినదే.
రైలులో అందరూ తమ ఫోన్ లలో బిజి అయిపోయి చాలా సమయం గడిచాక మెల్లగా ఒక్కొక్కరు తమ ఫోన్లు కు విశ్రాంతి ఇచ్చి ఏదో ఆలోచించుకుంటున్నారు.
జనరల్ బోగీలో మరీ ఎక్కువ మరీ తక్కువ కాకుండా ప్రయాణీకులు ఉన్నారు. సమయం ఎంతవుతున్నా... ఒకే సీట్ల లో పక్కపక్కనే కూర్చుని ఉన్న సరళ, సంధ్య, స్రవంతి లు ఇంకా తమ పుస్తకాల్లో పేజీలు తిరగేస్తునే ఉన్నారు.
వాళ్ళు చూడ్డానికి చాలా ముచ్చటగా ఉన్నారు. ఎందుకంటే
వాళ్ళు ముగ్గురు ఒక వయస్సు వాళ్ళు కాదు. బహుశా తల్లి, తన కూతురు, తన మనుమరాల్లా ఉన్నారు.
అక్కడ ఎదురు సీటు లో కూర్చున్న కొందరు ఉండబట్టలేక సరళని ఇలా అడిగారు.
"మేడం ఇక్కడ అందరూ ఎక్కువ సమయం ఫోన్ తప్ప ఇంకొకటి వాడటం లేదు. అలాంటిది తమరు తమ బంధువులు పుస్తకం చదవటం చాలా అరుదుగా ఉంది. మరియు చాలా ముచ్చటగా ఉంది. "
సరళ చిన్నగా నవ్వి మరలా పుస్తకం చూసుకుంటుండగా
"మేడం! పరిక్షలు అయినపుడే తప్ప పుస్తకాలు ముట్టని పిల్లలను చూశాం కానీ... కాలక్షేపం కోసం పుస్తకాలు చదివే మిమ్మల్ని ఇప్పుడే చూస్తున్నాం.. మీ విషయాలు ఏమైనా చెప్తారని చూస్తున్నాం" అంటారు.
సరళ తన పుస్తకం మూసివేసి
“ఈమె సంధ్య.. నా కూతురు, ఈమె స్రవంతి.. నా మనుమరాలు. మా వద్ద కూడా ఫోన్ లు ఉన్నాయి కాకపోతే వాటిని ఎప్పుడు వినియోగించాలో అనేది మాకు తెలుసు" అంది.
"చేతిలో. ఫోన్ ఉన్నప్పటికీ మీ పిల్లలు మీరు చెప్పినట్లు ఎలా పుస్తకాలు చదువగలుగుతున్నారు... ? ఈ ప్లాన్ ఏదో మాకు చెప్తే మా పిల్లలు కు చెప్పుకుంటాం" అన్నారు వాళ్ళు.
అప్పుడు సరళ "చూడండి.. పిల్లలు మనం చెప్తే వినరు కానీ మనల్ని ఫాలో అవుతారు. నేను నా కూతురికి ఏమి నెర్పలేదు. తనే నన్ను ఫాలో అవుతు, తనంతట తాను అన్ని నేర్చుకోగల్గింది. ఏ అలవాటు అయినా.. ఒకసారి వస్తే అది మన నుండి పోవటం కష్టం. అందుకే మనం మన పిల్లలు కోసం, వారి భవిష్యత్ కోసం కొన్ని మంచి పనులు అలవాటు చేసుకోవాలి. అది మన బాధ్యత.
నేను నా అలవాట్లు కారణంగా నా కూతురుని ఇలా తయారు చేసుకోగల్గాను.
నా కూతురు ఏ వస్తువుకు బానిస కాదు. తాను అవసరానికి దేన్నైనా, ఏ పనైనా చేస్తుంది. ఓ ప్రభుత్వ ఆఫీసు లో కంప్యూటర్ ఆపరేటర్ కూడాను.
అయినా మనం నేర్చుకున్న మంచి అలవాట్లు మనకు ఎప్పుడు నష్టం కలిగించవు. మనం ఏం చేస్తే అదే చేయటానికి ప్రయత్నం చేస్తారు పిల్లలు.
ఇకపోతే నన్ను ఫాలో అయి ఈ స్థాయికి వచ్చిన నా కూతురు తాను కూడా తన కూతురు స్రవంతి కోసం పద్దతిని కొనసాగించింది.
దీంతో నా మనుమరాలు కూడా నా కూతురు ని ఫాలో అవుతుంది. అందుకే మొదట నేను కాలక్షేపం కోసం నాకిష్టమైన పుస్తకం తీయగా వాళ్ళు వాళ్ళకిష్టమైన పుస్తకాలు తీసుకుని చదువుతున్నారు.
పిల్లలని మనం మార్చాలంటే ఎవరి తరం కాదు...
అది కూడా ఈరోజుల్లో అంటే సాధ్యం కాని పని.
తల్లిదండ్రులకు తెలియకుండా మోసం చేస్తు ‘లవ్ యు మమ్మి’, ’లవ్ యు డాడీ’ అంటూ స్టేటస్ పెట్టుకునే పిల్లలు చాలామంది ఉన్నారు.
ఏది ఏమైనా పిల్లలు పెద్దలు చేసే పనులను తప్పక అనుసరిస్తారు. వారి కోసం మనం తప్పకుండా కొన్ని అలవాట్లు కొనసాగించాలి.
పిల్లలకు నష్టం కలిగించే పనులు ఏవైనా ఉంటే వారికి తెలియకుండా, వారు చూడకుండా జాగ్రత్త పడాలి.
ఎందుకంటే మీ నుండే వారికి భవిష్యత్ సక్రమిస్తుంది కనుక " అని ముగించింది సరళ.
తాను అనుసరించటమే కాక తాను చేసిన పని ఉన్నది ఉన్నట్లు చెప్పిన సరళ మాటలకు అక్కడ వారందరూ చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తపరిచారు.
***
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం
Profile:
Youtube Playlist:
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
కథ బావుంది