top of page
Original.png

హాని కలిగించే కల్తీలు


హాని కలిగించే కల్తీలు
హాని కలిగించే కల్తీలు

Hani Kaliginche Kaltheelu - Telugu Article | A. Annapurna

Published in manatelugukathalu.com on 03/05/2026

హాని కలిగించే కల్తీలు - తెలుగు వ్యాసం | ఏ. అన్నపూర్ణ | ఉత్తమ అభ్యుదయ రచయిత్రి


కాలం, వాతావరణంతో పనిలేకుండానే పళ్ళు, పానీయాలు, ఆహార పదార్థాలు క్షణాల్లో ఇంటికి చేరే సదుపాయాలు ఈరోజు ప్రతి ఊరిలోనూ లభిస్తున్నాయి.


ఇది బయటకు వెళ్లలేని వృద్ధులకు, ఉద్యోగాలు చేసేవారికి, తరచుగా ప్రయాణాలు చేసేవారికి ఎంతో సదుపాయంగా ఉన్నమాట నిజం. అంతేకాకుండా వాటిని చేరవేసే వారికి జీవనోపాధి.


ఏదైనా అనారోగ్యంతో ఉన్నవారికి సహాయకారి. వేరే పని మనుషులు, వంట మనుషులు అవసరం లేకుండా ఖర్చులేని సహాయకారి.


అయితే వీటికి డిమాండ్ పెరగడం వలన వ్యాపార అభివృద్ధికి అడ్డదారిగా కూడా మారడమే ప్రమాదం ముంచుకొస్తోంది. స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణం వదిలి నగరాలకు వచ్చేవారు పెరగడం వలన వ్యాపార సంస్థలు బాగుపడుతున్నాయి.

అయితే ప్రజలు వారి ఆరోగ్యాన్ని చేజేతులా పాడుచేసుకుంటున్నారు.


శారీరక శ్రమ తప్పింది. కదలకుండా ఉద్యోగాలు చేయడం వలన కాళ్ళ నొప్పులు, నడుం నొప్పి, తలనొప్పి లాంటి ఇబ్బందులు పెరిగాయి. దానికితోడు అన్నింటిలో కల్తీ. స్వయంగా వండుకోడానికి సమయం ఉండదు. మా తరంలో కూడా చదువుకుని ఉద్యోగాలు చేశాం. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలే కాదు, పిల్లలు, వారి చదువులు, అత్తామామలు, బంధువుల రాకపోకలు... ఇలా నిరంతరం కష్టపడినా ఎలాంటి ఇబ్బందులు లేవు.


ఇప్పుడు బాధ్యతలు తక్కువ. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఒక్కటే బిడ్డ. అయినా డీలా పడిపోతున్నారు.

కారణం తినే తిండిలో బలం లేదు. అందుబాటులో ఉండే ఆహారం మంచిది కాదు. అన్నీ విషపూరితాలే.


చూడటానికి ఆకర్షణీయం. తింటే మాత్రం రోగపూరితం. పళ్ళు పండనివ్వరు. రసాయనాలతో రంగు వచ్చేలా చేయడం, ఆర్గానిక్ పేరుతో ఖరీదు ఎక్కువ చేసి అమ్మడం. అసలు మోసం కానీ, కల్తీ లేని వస్తువే లేదు.


వాతావరణం రుతువులను బట్టి ఉండదు. వానలు కురిస్తే అదే వాన, ఎండలు కాస్తే దగ్గు, జలుబు పట్టుకుని తరచుగా వేధిస్తున్నాయి. కోవిడ్ వేరియంట్స్ — అది ఎలా మారుతుందో తెలియదు.


చలికాలం మరో బాధ. బాడీ పెయిన్స్ లేదా మరో రకం. డాక్టర్ చెప్పలేడు. టెస్టులు రాయడం తప్ప. వాటి ఖర్చు భరించలేక ఇంటి చిట్కాలు, అమ్మమ్మ చిట్కాలు పాటించి తిప్పలు పడుతుంటారు. ఏదో ఒకరోజుకి తగ్గుతాయని!


పన్నులు కడుతున్నాం, సదుపాయాలు ఉండవు. ఆహార పదార్థాలు, పళ్ళు, పాలు, పానీయాలు కల్తీ జరుగుతున్నా చర్యలు ఉండవు.


ప్రతి ఏడాది కల్తీ గురించి దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఏం చర్యలు తీసుకుంటారో తెలియదు. మళ్ళీ ఏడాది ఇవే కల్తీ దాడులు — మామూలే.

చిన్న వయసులో అంతుపట్టని జబ్బులు, అకాల మరణాలు. వాహనాల రద్దీతో ప్రమాదాలు. బయటకు వెళితే ఇంటికి వచ్చేదాకా సేఫ్టీ లేదు.


మనిషిలో డబ్బు సంపాదించే ఆశ పెరిగి తప్పుడు మార్గాలు పట్టడం, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, ప్రేమించి పెళ్లి చేసుకున్నవారే ఒకరిని మరొకరు హత్య చేసేదాకా వెళ్లడం చూస్తుంటే మతిపోతోంది.


ఎందుకు మనుషులు కూడా కలుషితమై పోతున్నారు? అని. చదువులు, ఉద్యోగాలు వచ్చాక ఇటీవల పెళ్లిళ్లు ఆలస్యం కావడం, అక్రమ సంబంధాలు పెరగడం, భార్యాభర్తల మధ్య కక్షలు, ఆవేశాలు దారుణంగా ఉంటున్నాయి.

ఎక్కడికి పోతున్నాం? రాబోయే కాలం ఇంకెంత దారుణంగా ఉంటుంది? ఊహించలేము.


"కల్తీ" అనేది ఒక్క రంగమే కాదు. అనేక రకాలుగా అలుముకుపోయింది.

ఇది చాలా ప్రమాదకరంగా పరిణమించింది. దీన్ని ఎవరికి వారు మొదట్లోనే తుంచివేయాలి.


లేకపోతే మనశ్శాంతి, భవిష్యత్తు, ఆరోగ్యం అన్నీ నాశనం అవుతాయి.


"Be careful."



*******************


ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ


నాగురించి పరిచయం. 

నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లుగారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంధకర్త. ''వారురాసిన మహర్హుల చరిత్ర'' టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. దానిమీద నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథవారి ''ఏకవీర '', శరత్ బాబు, ప్రేమ్ చంద్, తిలక్, భారతీ మాసపత్రిక. నాన్నగారు రాసిన వ్యాసాలూ ప్రింట్ అయినా తెలుగు -ఇంగిలీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్నా ;;ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ'' కి వచ్చే పిల్లల పత్రికలూ, వారం మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటు అయింది. పెళ్లి అయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. 


చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపుల తో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చారు. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమసంస్థ లో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను.. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే

వెళ్ళివస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, సాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనేవున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి అనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్ట్లలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page