అయ్యో పాపం
అయ్యో పాపం, తెలుగు వ్యాసం, మానవత్వం, చేయూత, సమాజం, సహాయం, సామాజిక బాధ్యత, తెలుగు రచన, ప్రేరణాత్మక వ్యాసం, జీవిత సత్యాలు, దయ, జాలి, మనిషి విలువలు, తెలుగు సాహిత్యం

Ayyo Papam - Telugu Inspirational Article | Kotha Viritha
అయ్యో పాపం - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Publishes in manatelugukathalu.com on 04/07/2026
మన చుట్టూ ప్రతిరోజూ ఎన్నో కష్టాలు, బాధలు, ప్రమాదాలు కనిపిస్తూనే ఉంటాయి. కానీ వాటిని చూసి స్పందించే విధానంలోనే మన మానవత్వం ప్రతిబింబిస్తుంది. "అయ్యో పాపం" అనే ఈ ఆలోచింపజేసే తెలుగు వ్యాసం, మాటల్లో జాలి చూపించడం కంటే చేతల్లో సహాయం చేయడం ఎంత గొప్పదో హృద్యంగా వివరిస్తుంది. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి నుంచి వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రుల వరకు, సమాజంలోని అనేక వాస్తవ పరిస్థితులను ఉదాహరణలుగా చూపిస్తూ, నిజమైన మానవత్వం అంటే ఏమిటో మనకు గుర్తు చేస్తుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన విలువైన వ్యాసం ఇది.
ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చేయడానికి కంటే, "అయ్యో పాపం" అనడం చాలా సులభం.
ఉద్యోగం పోయిన వ్యక్తికి ఉద్యోగ అవకాశాలు చెప్పం; "పాపం" అంటాం.
ఆసుపత్రిలో ఉన్నవారిని ఒక్కసారి వెళ్లి చూడం, వాట్సాప్‌లో "గెట్ వెల్ సూన్" పంపి మన బాధ్యత పూర్తయిందనుకుంటాం.
చదువులో వెనుకబడిన పిల్లాడికి ఒక గంట సమయం కేటాయించం; "పాపం పరిస్థితులే అలాంటివి" అని తీర్పు ఇస్తాం.
అప్పుల బారిన పడ్డ రైతుకి తోడుగా నిలబడడం కంటే, అతని కథను నలుగురికి చెప్పి జాలి సంపాదించుకుంటాం.
వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులను చూడటానికి సమయం ఉండదు, కానీ "ఈ కాలం పిల్లలు ఇలా అయిపోయారు" అని ఉపన్యాసాలు మాత్రం ఆగవు.
రోడ్డు ప్రమాదం జరిగితే గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లే వాళ్ళు తక్కువ; వీడియో తీసే మొబైళ్లు ఎక్కువ.
ఎందుకంటే సహాయం చేయడానికి మనసు కావాలి; జాలి చూపించడానికి మాటలు చాలు.
మాటల్లో మానవత్వం చాలా గొప్పగా ఉంటుంది; చేతల్లోకి వచ్చే సరికి అది సెలవు తీసుకుంటుంది.
చేతనైనప్పుడు చేయూత ఇవ్వకుండా, అన్నీ అయిపోయిన తర్వాత "అయ్యో పాపం" అని ఓ నిట్టూర్పు విడిచేస్తాం.
ఆ ఒక్క మాటతో వాళ్ల జీవితంలో ఏమీ మారదు, కానీ మన మనస్సాక్షికి మాత్రం ఒక నకిలీ ఓదార్పు దొరుకుతుంది.
మనం "పాపం" అన్న తరువాతే వాళ్లు బాగుపడాలి, అప్పుడే మన "మానవత్వానికి" మనశ్శాంతి.
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
"అయ్యో పాపం" వ్యాసం మీలో ఆలోచన రేకెత్తిస్తే, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, విద్యార్థులతో Facebook, WhatsApp ద్వారా షేర్ చేసి, మాటల్లో కాదు చేతల్లో మానవత్వాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగస్వాములు అవండి. ManaTeluguKathalu.com లోని మరిన్ని ఆలోచింపజేసే కథలు, వ్యాసాలు చదవడం మర్చిపోవద్దు.
***************************************
కొత్త విరిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.







Nicely explained.ఆడంబరాల ఖర్చుకు వెనక్కిపోని సగటు మనిషి ఎదుటి వారికి సహాయం చెయ్యాలనే ఆలోచనే రాదు.తప్పని పరిస్థితి వస్తే గింజుకొని ఏదో విదిలిస్తారు
👌 👌 👌 👌