top of page
Original.png

ముప్పై మూడు

3 hours ago
2 min read

“ముప్పై మూడు” తెలుగు కుటుంబ హాస్య రచనకు సంబంధించిన చిత్రం. ఇంట్లో పిల్లలకు చదువు, బట్టలు సర్దుకోవడం, వస్తువులు సరిగ్గా పెట్టడం వంటి పనులను తల్లి పదేపదే గుర్తుచేస్తుండగా, తండ్రి ఒక్కసారి చెప్పగానే పిల్లలు పనులు చేస్తున్నట్లు చూపించారు. కింద తల్లి మొక్కకు నీరు పోస్తుండగా తండ్రి ప్రోత్సహిస్తున్న దృశ్యం, పిల్లల క్రమశిక్షణ వెనుక తల్లి నిరంతర ప్రయత్నం, తండ్రి సహకారం రెండూ ఉన్నాయనే భావాన్ని సూచిస్తుంది.

Muppai Mudu - Telugu Inspirational Article | Kotha Viritha

ముప్పై మూడు - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Published in manatelugukathalu.com on 08/10/2026

అమ్మ ఎన్నిసార్లు చెప్పినా వినని పిల్లలు నాన్న ఒక్క మాటకు ఎందుకు వింటారు? ఆ ఒక్క మాట వెనుక అమ్మ ముప్పై మూడు సార్లు చెప్పిన మాటలే ఉన్నాయనే సరదా కుటుంబ రచన.




అమ్మ ఒక విషయం చెబితే పిల్లలు వినరు… ఎందుకంటే అమ్మ కదా, మళ్లీ చెబుతుందని వాళ్లకు నమ్మకం!


“చదువుకో”,

“సమయానికి పడుకో” 

"తీసిన వస్తువు తీసిన చోటే పెట్టు"

"బట్టలు సర్దుకో"

"ఇల్లు నీట్ గా పెట్టుకోండి"


ఇలా అమ్మ  చెప్పినదే ఒక ముప్పై మూడు సార్లు చెబుతూనే ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లా!

పిల్లలు వింటున్నట్టే ఉంటారు… కానీ పని జరగదు.


మరి అదే విషయం నాన్న ఒక్కసారి చెబితే… ఒక్కసారిగా ఇంట్లో మిలిటరీ క్రమశిక్షణ మొదలవుతుంది!

“నాన్న చెప్పారుగా!” అంటూ పిల్లలు వెంటనే పనిలో పడిపోతారు.


అప్పుడు అందరికీ ఒక సందేహం ...

అమ్మ గొప్పా? 

నాన్న గొప్పా?


అసలు విషయం అక్కడే ఉంది,నాన్న ఆ ఒక్క మాటకు వచ్చిన బలం, ఆయన ఒక్కరోజులో సంపాదించింది కాదు. ఆ మాటకు బలం ఇచ్చింది అమ్మ ఇన్నాళ్లుగా చెప్పిన ఆ ముప్పై మూడు సార్లే!


అమ్మ ప్రతిరోజూ వేసిన విత్తనమే… నాన్న ఒక్కసారి చెప్పగానే మొలకెత్తుతుంది.


అమ్మ చేసిన హెచ్చరికలే… నాన్న మాటకు గౌరవంగా మారతాయి. అమ్మ చెప్పిన ప్రతి “జాగ్రత్త”కీ… నాన్న చెప్పిన ఒక్క “ఇదిగో చూడు!” తో ముగింపు వస్తుంది.


కాబట్టి పిల్లలు నాన్న మాట వింటున్నారని అమ్మ ఓడిపోయినట్టు కాదు. నాన్న ఒక్క మాటకే అంత పవర్ వచ్చిందంటే… దాని వెనుక అమ్మ ముప్పై మూడు సార్లు చెప్పిన అమ్మ మాటలే ఉన్నాయి!


ఇంట్లో నాన్నది ఒక్క డైలాగ్ పవర్ అయితే…

ఆ డైలాగ్‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం కచ్చితంగా అమ్మదే!


***

కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


మనతెలుగుకథలు.కామ్ — తెలుగు కథలకు మీ సొంత వేదిక





మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కొత్త విరిత

రచయిత్రి పరిచయం: కొత్త విరిత

నా పేరు కొత్త విరిత

B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page