top of page


రెండే రెండు నిజాలు
మనిషి సంపద, పేరు, ప్రతిష్ఠ, జ్ఞానం, విజయాల కోసం జీవితాంతం అన్వేషిస్తూనే ఉంటాడు. కానీ ప్రకృతి ప్రతిరోజూ అతనికి రెండు సాధారణమైన నిజాలను గుర్తుచేస్తుంది—ఆకలి, నిద్ర.
ఆకలి ఉంటే సాధారణ అన్నమే అమృతంలా అనిపించవచ్చు. అలసిన శరీరానికి సాధారణమైన మంచమే గొప్ప విశ్రాంతిని ఇవ్వవచ్చు.
అవసరం వచ్చినప్పుడే కొన్ని విషయాల అసలు విలువ తెలుస్తుంది.

Kotha Viritha
Sep 112 min read


అన్నీ అవే… ఏదో మారింది
గతసారి అద్భుతంగా అనిపించిన ప్రదేశం ఈసారి సాధారణంగా అనిపించవచ్చు. నిన్న నచ్చిన మాట ఈరోజు చిరాకు తెప్పించవచ్చు. ఇందులో తప్పు ఎవరిదీ కాకపోవచ్చు.
కాలం మారుతుంది…
మనసు మారుతుంది…
మన అవసరాలు మారతాయి.
అందుకే నిన్నటి అనుభూతిని రేపు కూడా అలాగే ఇవ్వమని జీవితాన్ని అడగడం కాస్త అత్యాశే!

Kotha Viritha
Sep 92 min read


అలారం మోగని ఒక ఉదయం
ఆమెకు పెద్ద పెద్ద కోరికలు లేవు. కొత్త చీరలు, ఖరీదైన వస్తువులు, విదేశీ ప్రయాణాలు కూడా కాదు.
“రేపు ఇంకో గంట నిద్రపోతే బాగుండును…”
అలారం మోగకుండా… ఎవ్వరూ లేపకుండా… ఏ బాధ్యతా గుర్తు చేయకుండా… ప్రశాంతంగా నిద్రపోవాలనేదే ఆమె చిన్న కోరిక.

Kotha Viritha
Sep 82 min read


నెమరు గేదెలదే… పశ్చాత్తాపం మనదే
జంతువులు గడ్డిని నెమరువేసుకుని జీర్ణించుకుంటాయి. మనుషులు మాత్రం తొందరగా అన్న మాటలను నెమరువేసుకుని పశ్చాత్తాపపడతారు!
గడ్డిని మళ్లీ నోట్లోకి తెచ్చుకుంటే జీర్ణమవుతుంది. కానీ మాటను వెనక్కి తీసుకోవాలని ప్రయత్నించినంత మాత్రాన ఎదుటివారి మనసులో పడిన గాయం వెంటనే మాయమవదు.
అందుకే మాట బయటకు రాకముందు ఒక్క క్షణం ఆలోచించడం మంచిది.

Kotha Viritha
Sep 72 min read


లైఫ్ రూల్ ఇన్ ట్రాఫిక్ రూల్
పక్క లైన్లో ఉన్నవాడికి గ్రీన్ వస్తే మనకు వెంటనే అసూయ మొదలవుతుంది. కానీ వాళ్ల ప్రయాణం వాళ్లది… మన సిగ్నల్ మనది!
గ్రీన్ రావాలని ఎంత హారన్ కొట్టినా సిగ్నల్ త్వరగా మారదు. అలాగే కొన్ని విషయాల్లో జీవితాన్ని తొందరపెట్టడం వల్ల సరైన సమయం ముందుకు రాదు.
రెడ్లో ఓపిక… గ్రీన్లో వేగం… ఇదే జీవిత ట్రాఫిక్ రూల్!

Kotha Viritha
Sep 62 min read


గబ్బు డబ్బు
ప్రతి ఖర్చుకీ ఒకే డైలాగ్ — “ఆ డబ్బు దాచుకోవచ్చుగా!”
దాచుకోవడం అవసరమే. కానీ జీవితం మొత్తం “ఇది కొనొద్దు, అది తినొద్దు, అక్కడికి వెళ్లొద్దు” అంటూ ఆశలకు సంకెళ్లు వేస్తే… చివరికి మన దగ్గర డబ్బు ఉండొచ్చు. దాన్ని ఖర్చు చేసి ఆనందించే అవకాశం మాత్రం వెళ్లిపోవచ్చు.

Kotha Viritha
Sep 52 min read
bottom of page
