top of page
Original.png

లైఫ్ రూల్ ఇన్ ట్రాఫిక్ రూల్



తన బైక్‌పై ఓపిక లేకుండా ఎదురుచూస్తున్న వ్యక్తి, పక్క లైన్‌లో గ్రీన్ సిగ్నల్ రావడంతో ముందుకు వెళ్తున్న మరో వ్యక్తిని చూస్తున్నాడు. అతని ముందు వేగంగా వెళ్తున్న క్రాస్ ట్రాఫిక్ ప్రస్తుతం రెడ్ సిగ్నల్ అతన్ని ఆపడానికి కాకుండా కాపాడుతోందనే భావాన్ని సూచిస్తుంది. దూరంలో అతని మార్గంలో కనిపించే గ్రీన్ లైట్ ప్రతి ఒక్కరికీ సరైన సమయంలో అవకాశం వస్తుందనే సందేశాన్ని ప్రతిబింబిస్తుంది.

Life Rule in Traffic Rule Telugu Inspirational Article | Kotha Viritha

లైఫ్ రూల్ ఇన్ ట్రాఫిక్ రూల్ - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Published in manatelugukathalu.com on 06/09/2026



రెడ్‌లో ఓపిక…గ్రీన్‌లో వేగం…ఇదే జీవిత ట్రాఫిక్ రూల్!

ఇతరుల సిగ్నల్ చూసి ఓవర్‌టేక్ చేయకండి.

మీ గ్రీన్ కూడా వస్తుంది!

అప్పటివరకు…

జీవితం మీద హారన్ కొట్టడం ఆపండి ప్లీజ్! 😄



లైఫ్ రూల్ ఇన్ ట్రాఫిక్ రూల్


ట్రాఫిక్ సిగ్నల్‌లో రెడ్ లైట్ రెండు నిమిషాలు… గ్రీన్ మాత్రం కొన్ని సెకన్లుజీవితం కూడా మనల్ని అలాగే వెయిటింగ్‌లో పెట్టడం చాలా ఇష్టం!


“ఇంకెప్పుడు నా టైమ్ వస్తుంది?” అని సిగ్నల్‌నే అడిగినా సమాధానం ఉండదు!


పక్క లైన్‌లో ఉన్నవాడికి గ్రీన్ వచ్చిందంటే… మనకు వెంటనే అసూయ మొదలు!


“అతనికే ఎందుకు?” అని అనుకునేలోపే… అతను వెళ్లిపోతాడు, మనం ఇంకా రెడ్‌లోనే!


అప్పుడు ఓవర్‌టేక్ చేద్దామని చూస్తాం… ఎందుకంటే మనకి ఓపిక ఉండదు కదా!


ట్రాఫిక్ ఉన్నప్పుడు రెడ్‌లో దూసుకెళ్తే యాక్సిడెంట్ అవుతుందని తెలుసు.కానీ జీవితంలో అదే పని చేసి… “అదృష్టం కలిసి రాలేదు” అంటాం! నిజానికి సిగ్నల్ తప్పు కాదు… మన తొందరే తప్పు. కొన్ని రెడ్ సిగ్నల్స్ మనల్ని ఆపడానికి కాదు… కాపాడటానికి వస్తాయి.


ఇతరుల గ్రీన్ చూసి మన వచ్చిన రెడ్‌ను శాపంగా భావించాల్సిన అవసరం లేదు. వాళ్ల ప్రయాణం వాళ్లది… మన సిగ్నల్ మనది! గ్రీన్ రావాలని హారన్ కొట్టినా సిగ్నల్ త్వరగా మారదు. అలాగే జీవితాన్ని తొందరపెట్టినా విజయం ముందుగా రాదు.


రెడ్‌లో ఆగడం ఓటమి కాదు… సరైన సమయం కోసం సిద్ధపడటం.గ్రీన్ వచ్చినప్పుడు మాత్రం… “ఇంకొంచెం ఆగుదాం” అని నిలబడకూడదు! అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందుకోవడం కూడా మన బాధ్యతే.రెడ్‌లో ఓపిక… గ్రీన్‌లో వేగం… ఇదే జీవిత ట్రాఫిక్ రూల్!

ఇతరుల సిగ్నల్ చూసి ఓవర్‌టేక్ చేయకండి… మీ గ్రీన్ కూడా వస్తుంది!


అప్పటివరకు జీవితం మీద హారన్ కొట్టడం ఆపండి ప్లీజ్!


కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.





మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కొత్త విరిత

రచయిత్రి పరిచయం: కొత్త విరిత

నా పేరు కొత్త విరిత

B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.

4 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

Super

Like

rangarao kokku
rangarao kokku
20 hours ago
Rated 5 out of 5 stars.

Good.. baaga chepparu madam

Like

Haritha kotha
Haritha kotha
21 hours ago
Rated 5 out of 5 stars.

👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

Like

We Work
We Work
21 hours ago
Rated 5 out of 5 stars.

Mee kavitha chadivinappudu manasulo oka kotha alochana, oka prasanthatha kaluguthundi. Idi kavithvam mathrame kaadhu, oka anubhoothi

Like
bottom of page